కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ పాఠం

యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?

యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?

ఎవరైనా మిమ్మల్ని యెహోవాసాక్షుల మీటింగ్స్‌కి రమ్మని పిలిచారా? మొదటిసారి మీటింగ్స్‌కి వెళ్లాలంటే మీకు కాస్త కంగారుగా అనిపించవచ్చు. ‘ఈ మీటింగ్స్‌ ఎలా జరుగుతాయి? ఇవి ఎందుకు అంత ముఖ్యమైనవి? వీటికి నేను ఎందుకు వెళ్లాలి?’ అనే ప్రశ్నలు మీకు రావచ్చు. మీటింగ్స్‌కి వెళ్లడం వల్ల మీరు దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో, అవి మీకు ఎలా సహాయం చేస్తాయో ఈ పాఠంలో తెలుసుకుంటారు.

1. యెహోవాసాక్షులు ఎందుకు మీటింగ్స్‌కి వెళ్తారు?

మీటింగ్స్‌కి వెళ్లడానికి గల ముఖ్యమైన కారణాన్ని, కీర్తనలు రాసిన ఒక వ్యక్తి ఇలా వివరించాడు: “మహా సమాజంలో నేను యెహోవాను స్తుతిస్తాను.” (కీర్తన 26:12) నేడు యెహోవాసాక్షులు కూడా ఆ కారణంతోనే, అంటే తోటివాళ్లతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మీటింగ్స్‌కి వెళ్తారు. మీటింగ్స్‌ అంటే వాళ్లకు చాలా ఇష్టం. ప్రపంచమంతటా వాళ్లు ప్రతీవారం దేవుణ్ణి స్తుతించడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి కలుసుకుంటారు. అంతేకాదు, ప్రతీ సంవత్సరం వాళ్లు పెద్దపెద్ద సమావేశాలకు కూడా వెళ్తారు.

2. మీటింగ్స్‌లో మీరేం నేర్చుకుంటారు?

మా మీటింగ్స్‌లో అన్నీ బైబిలు నుండే బోధిస్తారు, బైబిల్ని ‘స్పష్టంగా వివరిస్తూ, అర్థాన్ని చెప్తారు.’ (నెహెమ్యా 8:8 చదవండి.) మీటింగ్స్‌లో యెహోవా గురించి, ఆయనకున్న చక్కని లక్షణాల గురించి మీరు నేర్చుకుంటారు. మీరు ఆయన ప్రేమను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, అంత ఎక్కువగా ఆయనకు దగ్గరౌతారు. మీరు ప్రశాంతంగా జీవించడానికి ఆయన ఎలా సహాయం చేస్తాడో కూడా తెలుసుకుంటారు.—యెషయా 48:17, 18.

3. మీటింగ్స్‌లో కలిసేవాళ్లు మీకు ఎలా సహాయం చేస్తారు?

‘ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచించాలని, కూటాలకు మానకుండా’ వెళ్లాలని యెహోవా చెప్తున్నాడు. (హెబ్రీయులు 10:24, 25) ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమ ఉన్నవాళ్లను, మీలాగే దేవుని గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాళ్లను మా మీటింగ్స్‌లో మీరు కలుసుకుంటారు. వాళ్లు ప్రోత్సాహాన్నిచ్చే బైబిలు మాటల్ని చెప్తారు. (రోమీయులు 1:11, 12 చదవండి.) రకరకాల సమస్యల్ని ధైర్యంగా తట్టుకుంటున్న వాళ్లను కూడా మీరు అక్కడ కలుసుకుంటారు. యెహోవా మనల్ని మీటింగ్స్‌కి మానకుండా వెళ్లమని చెప్పడానికి, ఇవి కొన్ని కారణాలు మాత్రమే!

ఎక్కువ తెలుసుకోండి

యెహోవాసాక్షుల మీటింగ్స్‌ ఎలా జరుగుతాయో, వాటికి వెళ్లడానికి ఎందుకు కృషి చేయాలో తెలుసుకోండి.

4. యెహోవాసాక్షుల మీటింగ్స్‌

మొదటి శతాబ్దంలో క్రైస్తవులు యెహోవాను ఆరాధించడానికి క్రమంగా కలుసుకున్నారు. (రోమీయులు 16:3-5) కొలొస్సయులు 3:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మొదటి శతాబ్దంలో క్రైస్తవులు యెహోవాను ఎలా ఆరాధించారు?

నేడు కూడా యెహోవాసాక్షులు క్రమంగా రాజ్యమందిరంలో కలుసుకుంటారు. వాళ్ల మీటింగ్స్‌ ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి, వీడియో చూడండి. తర్వాత మీటింగ్స్‌ ఎలా జరుగుతాయో తెలిపే చిత్రాన్ని చూసి ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • రాజ్యమందిరంలో జరిగే దానికి, కొలొస్సయులు 3:16 లో చదివిన దానికి మధ్య ఎలాంటి పోలికల్ని మీరు గమనించారు?

  • వీడియోలో లేదా చిత్రంలో మీకు ఇంకా ఏ విషయాలు నచ్చాయి?

2 కొరింథీయులు 9:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌లో చందాలు ఎందుకు అడగరు?

ఈ వారం మీటింగ్‌లో ఏం చర్చిస్తారో మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తితో కలిసి పరిశీలించండి.

  • అందులో ఏది మీకు ఆసక్తిగా అనిపించింది లేదా ఉపయోగపడుతుందని అనిపించింది?

మీకు తెలుసా?

ప్రపంచం మొత్తంలో మీటింగ్స్‌ ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీరు jw.orgలో చూసి తెలుసుకోవచ్చు.

  1. (1) మా మీటింగ్స్‌లో ప్రసంగాలు, ప్రదర్శనలు, వీడియోలు ఉంటాయి. మీటింగ్స్‌ పాటతో, ప్రార్థనతో మొదలౌతాయి అలాగే ముగుస్తాయి

  2. (2) మీటింగ్స్‌లోని కొన్ని భాగాల్లో ప్రేక్షకులు కూడా జవాబులు చెప్పవచ్చు

  3. (3) స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ మా మీటింగ్స్‌కి రావచ్చు

  4. (4) మీటింగ్స్‌ పూర్తిగా ఉచితం, అక్కడ చందాలు అడగరు

5. మీటింగ్స్‌కి వెళ్లాలంటే కృషి అవసరం

యేసు కుటుంబం గురించి ఆలోచించండి. వాళ్లు ప్రతీ సంవత్సరం యెహోవాను ఆరాధించడానికి నజరేతు నుండి యెరూషలేముకు వెళ్లేవాళ్లు. అందుకోసం కొండ మార్గంలో దాదాపు 100 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. లూకా 2:39-42 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యేసు కుటుంబం యెరూషలేముకు ప్రయాణించడం అంత చిన్న విషయమా? మీరేమంటారు?

  • మీటింగ్స్‌కి వెళ్లడానికి మీరు ఎలాంటి కృషి చేయాల్సి రావచ్చు?

  • అలా కృషి చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా?

ఆరాధన కోసం కలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అని బైబిలు చెప్తుంది. హెబ్రీయులు 10:24, 25 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం మీటింగ్స్‌కి మానకుండా ఎందుకు వెళ్లాలి?

కొంతమంది ఇలా అంటారు: “మీరు మీటింగ్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని బైబిలు చదివితే సరిపోతుంది.”

  • ఈ విషయంలో యెహోవా అభిప్రాయాన్ని ఏ బైబిలు వచనం లేదా ఏ బైబిలు ఉదాహరణ తెలియజేస్తుంది?

ఒక్కమాటలో

మీటింగ్స్‌కి వెళ్లడం వల్ల మీరు యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుంటారు, ఆయనకు ఇంకా దగ్గరౌతారు, తోటివాళ్లతో కలిసి ఆయన్ని ఆరాధిస్తారు.

మీరేం నేర్చుకున్నారు?

  • మీటింగ్స్‌కి వెళ్లమని యెహోవా ఎందుకు చెప్తున్నాడు?

  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌లో మీరేం నేర్చుకుంటారు?

  • మీటింగ్స్‌ ఇంకా ఎలా సహాయం చేస్తాయని మీరు అనుకుంటున్నారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

మొదటిసారి మీటింగ్‌కి వెళ్లాలంటే ఒకతనికి కంగారుగా అనిపించింది. కానీ అతను ఇప్పుడు మీటింగ్స్‌ని ఎందుకు ఇష్టపడుతున్నాడో చూడండి.

వాళ్ల పలకరింపును మేము ఎప్పుడూ మర్చిపోము (4:16)

ఒక యువకునికి మీటింగ్స్‌ ఎందుకు నచ్చాయో, మీటింగ్స్‌కి మానకుండా వెళ్లడానికి అతను ఏం చేశాడో చూడండి.

మీటింగ్స్‌ నాకు చాలా నచ్చాయి! (4:33)

మీటింగ్స్‌కి వెళ్లడం గురించి కొంతమంది ఏమంటున్నారో చదవండి.

“రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?” (jw.org ఆర్టికల్‌)

యెహోవాసాక్షుల మీటింగ్‌కి వెళ్లిన తర్వాత ఒక రౌడీ జీవితం ఎలా మారిపోయిందో తెలుసుకోండి.

“నేను తుపాకి లేకుండా అడుగు బయటపెట్టేవాణ్ణే కాదు” (కావలికోట, అక్టోబరు-డిసెంబరు 2014)