కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ పాఠం

బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండండి

బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండండి

బైబిలు గురించి నేర్చుకోవడం ఒక అందమైన ప్రయాణం లాంటిది. కానీ కొన్నిసార్లు దారిలో ఆటంకాలు రావచ్చు. అయినా ఈ ప్రయాణాన్ని కొనసాగించడం ఎందుకు మంచిది? ఈ ప్రయాణంలో మీకు ఎదురయ్యే ఆటంకాల్ని ఎలా దాటవచ్చు?

1. బైబిలు గురించి నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

“దేవుని వాక్యం సజీవమైనది, చాలా శక్తివంతమైనది.” (హెబ్రీయులు 4:12) బైబిలు గురించి నేర్చుకోవడం వల్ల దేవుని ఆలోచనలు ఏంటో, ఆయనకు మీ మీద ఎంత ప్రేమ ఉందో మీరు తెలుసుకుంటారు. అంతేకాదు మీరు మంచి జ్ఞానం సంపాదించుకుంటారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, భవిష్యత్తు మీద ఆశతో ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా, మీరు యెహోవాకు స్నేహితులు అవ్వగలుగుతారు. బైబిలుకు మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది, మీరు బైబిలు గురించి నేర్చుకుంటూ ఉంటే ఆ శక్తిని చూడగలుగుతారు.

2. బైబిలు సత్యం ఎంత విలువైనదో అర్థం చేసుకుంటే ఏం చేస్తాం?

బైబిల్లో ఉన్న సత్యాలు అమూల్యమైన సంపద లాంటివి. అందుకే, “సత్యాన్ని కొనుక్కో, దాన్ని ఎన్నడూ అమ్మకు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 23:23) బైబిలు సత్యం ఎంత విలువైనదో అర్థం చేసుకుంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండడానికి కృషి చేస్తాం.—సామెతలు 2:4, 5 చదవండి.

3. బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండడానికి యెహోవా మీకెలా సహాయం చేయగలడు?

యెహోవా మన సృష్టికర్త. ఆయనకు ఈ విశ్వంలోనే అందరి కన్నా ఎక్కువ శక్తి ఉంది. ఆయన మీ స్నేహితుడు. మీరు తన గురించి తెలుసుకునేలా సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. తనకు ఇష్టమైనవి “చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఆయన మీకు ఇవ్వగలడు. (ఫిలిప్పీయులు 2:13 చదవండి.) బైబిలు గురించి నేర్చుకోవాలనే, నేర్చుకున్నవి పాటించాలనే కోరిక ఎప్పుడైనా మీలో తగ్గిపోతే దేవుడు ఆ కోరికను పెంచగలడు. ఆటంకాల్ని లేదా వ్యతిరేకతను సహించడానికి మీ శక్తి సరిపోకపోతే, ఆయన మీకు శక్తిని ఇవ్వగలడు. బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండడానికి సహాయం చేయమని ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించండి.—1 థెస్సలొనీకయులు 5:17.

ఎక్కువ తెలుసుకోండి

బిజీగా ఉన్నా లేదా వ్యతిరేకత ఎదురైనా, బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండడానికి ఏం చేయవచ్చో తెలుసుకోండి. ఈ విషయంలో యెహోవా మీకెలా సహాయం చేస్తాడో పరిశీలించండి.

4. ఎంత బిజీగా ఉన్నా బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండండి

కొన్నిసార్లు మనం ఎంత బిజీ అయిపోతాం అంటే, బైబిలు గురించి నేర్చుకోవడానికి సమయం లేదు అనిపిస్తుంది. మరి, అప్పుడు ఏం చేయవచ్చు? ఫిలిప్పీయులు 1:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • జీవితంలో “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవి” అని మీరు అనుకుంటున్నారు?

  • ఎంత బిజీగా ఉన్నా, బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండడానికి మీరు ఏం చేయవచ్చు?

  1. 1. ఒక బకెట్లో ముందు ఇసుక వేసి తర్వాత రాళ్లు వేయాలని చూస్తే, రాళ్లన్నీ అందులో పట్టవు

  2. 2. కానీ ముందే రాళ్లను వేస్తే, ఎక్కువ ఇసుక పడుతుంది. అదేవిధంగా, మీరు “ఎక్కువ ప్రాముఖ్యమైన” పనుల్ని ముందుగా చేస్తే, వేరే పనులు చేయడానికి కూడా సమయం ఉంటుంది

మనందరికీ దేవుని నిర్దేశం అవసరం. బైబిలు గురించి నేర్చుకోవడం వల్ల ఆ అవసరం తీరుతుంది. మత్తయి 5:3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బిజీగా ఉన్నా, బైబిలు గురించి నేర్చుకోవడానికి సమయం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

5. వేరేవాళ్లు వ్యతిరేకిస్తున్నా బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండండి

బైబిలు గురించి నేర్చుకోవడం ఆపేయమని కొంతమంది మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. ఫ్రాన్సిస్కో అనుభవాన్ని గమనించండి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఫ్రాన్సిస్కో తాను నేర్చుకుంటున్న విషయాల్ని వాళ్ల అమ్మకు, స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు ఏం చేశారు?

  • ఆయన ఆపకుండా బైబిలు గురించి నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?

2 తిమోతి 2:24, 25 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మీరు బైబిలు గురించి నేర్చుకుంటున్నందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏమంటున్నారు?

  • మీరు బైబిలు గురించి నేర్చుకోవడం ఎవరికైనా ఇష్టం లేకపోతే, మీరు ఏం చేయాలని ఈ వచనాలు చెప్తున్నాయి? ఎందుకు?

6. యెహోవా సహాయం తీసుకోండి

మనం యెహోవాకు దగ్గరయ్యే కొద్దీ, ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక ఇంకా పెరుగుతుంది. కానీ, ఆయనకు నచ్చిన విధంగా మన జీవితంలో మార్పులు చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తే, నిరుత్సాహపడకండి. యెహోవా మీకు సహాయం చేస్తాడు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఈ వీడియోలో ఉన్న ఆయన యెహోవాను సంతోషపెట్టడానికి ఎలాంటి మార్పులు చేసుకున్నాడు?

  • ఆయన అనుభవంలో మీకు ఏ విషయం బాగా నచ్చింది?

హెబ్రీయులు 11:6 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • “తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్ల” కోసం, అంటే తన గురించి తెలుసుకుని, తనను సంతోషపెట్టడానికి కృషిచేసే వాళ్ల కోసం యెహోవా ఏం చేస్తాడు?

  • బైబిలు గురించి నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్ని చూసి యెహోవా సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?

కొంతమంది ఇలా అడుగుతారు: “మీరు బైబిలు గురించి యెహోవాసాక్షుల దగ్గర ఎందుకు నేర్చుకుంటున్నారు?”

  • వాళ్లకు మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

ఆటంకాలు వచ్చినా బైబిలు గురించి నేర్చుకుంటూ ఉంటే, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించవచ్చు. యెహోవా సహాయాన్ని తీసుకుంటూ ఉండండి, ఆయన మీ ప్రయత్నాల్ని ఆశీర్వదిస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • బైబిలు సత్యాలు విలువైనవని మీకెందుకు అనిపిస్తుంది?

  • బైబిలు గురించి నేర్చుకోవడం మీకు ప్రాముఖ్యమని మీరెలా చూపించవచ్చు?

  • బైబిలు గురించి నేర్చుకుంటూ ఉండేలా సహాయం చేయమని యెహోవాను ఎందుకు అడగాలి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడానికి చాలామందికి సహాయం చేసిన నాలుగు విషయాల్ని పరిశీలించండి.

“మీ సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చు?” (తేజరిల్లు! ఆర్టికల్‌)

దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఒకామె చేసిన ప్రయత్నాల్ని ఆమె భర్త అర్థం చేసుకోలేదు. యెహోవా ఆమెకు ఎలా సహాయం చేశాడో చూడండి.

భారాల్ని మోసేలా యెహోవా మనల్ని బలపరుస్తాడు (5:05)

తన భార్య పట్టుదలగా బైబిలు గురించి నేర్చుకోవడం వల్ల ఒకతను ఎలా ప్రయోజనం పొందాడో చూడండి.

సత్యాన్ని పరీక్షించాను (6:30)

యెహోవాసాక్షులు కుటుంబాల్ని విడదీస్తారని కొంతమంది అంటారు. మరి అది నిజమేనా?

“యెహోవాసాక్షులు కుటుంబాలను విడదీస్తారా?” (jw.org ఆర్టికల్‌)