కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

25వ పాఠం

దేవుడు మనల్ని ఎందుకు చేశాడు?

దేవుడు మనల్ని ఎందుకు చేశాడు?

“మనిషి కొంతకాలమే బ్రతుకుతాడు, అదీ కష్టాలూ కన్నీళ్లతో” అని బైబిలు ఒప్పుకుంటోంది. (యోబు 14:1) కానీ అలా జీవించడానికే దేవుడు మనల్ని చేశాడా? అసలు ఆయన మనల్ని ఏ ఉద్దేశంతో చేశాడు? ఆయన అనుకున్నది ఎప్పటికైనా జరుగుతుందా? బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకుంటే మీకు ఓదార్పుగా ఉంటుంది.

1. మన జీవితం ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

మనం సంతోషంగా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన మొదటి మనుషులైన ఆదాముహవ్వల్ని సృష్టించి, వాళ్లను అందమైన పరదైసులో అంటే ఏదెను తోటలో ఉంచాడు. తర్వాత “దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: ‘మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి.’” (ఆదికాండం 1:28) వాళ్లు పిల్లల్ని కనాలని, భూమంతటిని పరదైసులా మార్చాలని, జంతువుల్ని చూసుకోవాలని యెహోవా కోరుకున్నాడు. మనుషులందరూ పూర్తి ఆరోగ్యంతో, ఎల్లప్పుడూ అంటే శాశ్వతకాలం జీవించాలి అన్నదే ఆయన ఉద్దేశం.

ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినా, a దేవుడు తన ఉద్దేశాన్ని మాత్రం మార్చుకోలేదు. (యెషయా 46:10, 11) తనకు లోబడే మనుషులు మంచి పరిస్థితుల్లో, ఎల్లప్పుడూ జీవించాలని ఆయన ఇప్పటికీ కోరుకుంటున్నాడు.—ప్రకటన 21:3, 4 చదవండి.

2. ఇప్పుడు మన జీవితం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి?

మనకు “దేవుని నిర్దేశం” అవసరం, యెహోవా మనల్ని అలానే సృష్టించాడు. అందుకే దేవుని గురించి తెలుసుకోవాలనే, ఆయన్ని ఆరాధించాలనే కోరిక మనలో ఉంటుంది. (మత్తయి 5:3-6 చదవండి.) మనం తనకు దగ్గరి స్నేహితులు అవ్వాలని, ‘తన మార్గాలన్నిట్లో నడవాలని, తనను ప్రేమించాలని, నిండు హృదయంతో సేవించాలని’ ఆయన కోరుకుంటున్నాడు. (ద్వితీయోపదేశకాండం 10:12; కీర్తన 25:14) అలా ఆయన కోరుకున్నట్టు జీవిస్తే, కష్టాలున్నా మనం నిజంగా సంతోషంగా ఉండవచ్చు. యెహోవాను ఆరాధించినప్పుడు, మనం దేవుడు కోరుకున్న విధంగా జీవిస్తున్నామనే సంతృప్తి ఉంటుంది, మన జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.

ఎక్కువ తెలుసుకోండి

మనం జీవించడానికి వీలుగా భూమిని తయారు చేస్తున్నప్పుడు యెహోవా ఎంత ప్రేమ చూపించాడో తెలుసుకోండి. అలాగే జీవితానికి ఉన్న అర్థం ఏంటని బైబిలు చెప్తుందో గమనించండి.

3. మనుషులు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి అన్నదే యెహోవా ఉద్దేశం

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • దేవుడు భూమిని ఎందుకు తయారుచేశాడు?

ప్రసంగి 3:11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఈ వచనం ప్రకారం, మన విషయంలో యెహోవా ఉద్దేశం ఏంటి?

4. యెహోవా ఉద్దేశం మారలేదు

కీర్తన 37:11, 29; యెషయా 55:11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం మారలేదని మనకెలా తెలుసు?

5. యెహోవాను ఆరాధించడం వల్ల మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది

జీవితానికి ఉన్న అర్థం ఏంటో తెలుసుకుంటే మనం సంతోషంగా జీవించవచ్చు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • జీవితానికి ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవడం వల్ల ఒకామె ఎలా ప్రయోజనం పొందింది?

ప్రసంగి 12:13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవా మన కోసం ఎంతో చేశాడు కాబట్టి, ఆయన మీద కృతజ్ఞతతో మనం ఏం చేయాలి?

కొంతమంది ఇలా అడుగుతారు: “అసలు దేవుడు మనల్ని ఎందుకు చేశాడు?”

  • వాళ్లకు మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

మనం ఈ భూమ్మీద మంచి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం నిండు హృదయంతో ఆయన్ని ఆరాధించినప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు కూడా మనం సంతోషంగా జీవించవచ్చు.

మీరేం నేర్చుకున్నారు?

  • ఆదాముహవ్వలు ఎలా జీవించాలని యెహోవా కోరుకున్నాడు?

  • మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం మారలేదని మనకెలా తెలుసు?

  • జీవితానికి ఉన్న అర్థం ఏంటి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

ఏదెను తోట నిజంగా ఉండేది అనడానికి రుజువులు పరిశీలించండి.

“ఏదెను తోట—కట్టుకథా లేక వాస్తవమా?” (కావలికోట ఆర్టికల్‌)

భూమి ఎప్పటికీ నాశనం కాదని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోండి.

“భూమి నాశనమౌతుందా?” (jw.org ఆర్టికల్‌)

జీవితానికి ఉన్న అర్థం గురించి బైబిలు ఏం చెప్తుందో పరిశీలించండి.

“జీవితానికి అర్థం ఏంటి?” (jw.org ఆర్టికల్‌)

ఒకాయనకు అన్నీ ఉన్నా, ఏదో వెలితి ఉన్నట్టు అనిపించింది. అది ఎలా తీరిందో చూడండి.

ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఉంది (3:55)

a ఇప్పుడు పరిస్థితులు దేవుడు అనుకున్నట్టుగా ఎందుకు లేవో తర్వాతి పాఠంలో మీరు తెలుసుకుంటారు.