కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

30వ పాఠం

చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు!

చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు!

మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మనం ఎంతో బాధపడతాం, ఏడుస్తాం. అందుకే, బైబిలు మరణాన్ని శత్రువు అని పిలుస్తుంది. (1 కొరింథీయులు 15:26) యెహోవా ఆ శత్రువును నాశనం చేస్తాడని 27వ పాఠంలో తెలుసుకున్నాం. కానీ, ఇప్పటికే చనిపోయినవాళ్ల సంగతేంటి? యెహోవా మాటిచ్చిన మరో అద్భుతమైన విషయాన్ని ఈ పాఠంలో తెలుసుకుంటాం. అదేంటంటే, చనిపోయిన కోట్లమందిని యెహోవా బ్రతికిస్తాడు, వాళ్లకు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది. అవును, ఆయన చనిపోయినవాళ్లను పునరుత్థానం చేస్తాడు! అది నిజంగా జరుగుతుందా? తిరిగి బ్రతికిన తర్వాత వాళ్లు పరలోకంలో జీవిస్తారా లేక భూమ్మీద జీవిస్తారా?

1. చనిపోయినవాళ్ల విషయంలో యెహోవా ఏం కోరుకుంటున్నాడు?

చనిపోయినవాళ్లను బ్రతికించాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడు. దేవుని సేవకుడైన యోబు, తాను చనిపోయిన తర్వాత యెహోవా తనను మర్చిపోడని బలంగా నమ్మాడు. ఆయన దేవునితో ఇలా అన్నాడు: “నువ్వు పిలుస్తావు, నేను [సమాధిలో నుండి] నీకు జవాబిస్తాను.”యోబు 14:13-15 చదవండి.

2. చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారని మనకు ఎలా తెలుసు?

దేవుడు ఇచ్చిన శక్తితో, యేసు భూమ్మీద ఉన్నప్పుడు చనిపోయినవాళ్లను బ్రతికించాడు. యేసు 12 ఏళ్ల అమ్మాయిని, ఒక విధవరాలి కొడుకును తిరిగి బ్రతికించాడు. (మార్కు 5:41, 42; లూకా 7:12-15) ఆ తర్వాత ఒక సందర్భంలో, యేసు స్నేహితుడైన లాజరు చనిపోయాడు. ఆయన చనిపోయి నాలుగు రోజులైనా, యేసు ఆయన్ని బ్రతికించాడు. దేవునికి ప్రార్థించిన తర్వాత యేసు సమాధి వైపు చూస్తూ, “లాజరూ, బయటికి రా!” అని పిలిచాడు. దాంతో “చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చాడు.” లాజరు తిరిగి బ్రతికాడు! (యోహాను 11:43, 44) అప్పుడు లాజరు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంత సంతోషించి ఉంటారో ఊహించండి!

3. మీకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మీరు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

చనిపోయినవాళ్లను “దేవుడు తిరిగి బ్రతికిస్తాడు” అని బైబిలు మాటిస్తుంది. (అపొస్తలుల కార్యాలు 24:15) గతంలో యేసు బ్రతికించినవాళ్లు పరలోకానికి వెళ్లలేదు. (యోహాను 3:13) వాళ్లు మళ్లీ ఇదే భూమ్మీద బ్రతికారు, తమ కుటుంబ సభ్యుల్ని-స్నేహితుల్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు. అదేవిధంగా, చనిపోయిన కోట్లమందిని యేసు త్వరలో ఇదే భూమ్మీద తిరిగి బ్రతికిస్తాడు. పరదైసుగా మారిన భూమ్మీద ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే అవకాశం వాళ్లకు ఉంటుంది. చనిపోయి దేవుని జ్ఞాపకంలో ఉన్న వాళ్లందరూ లేస్తారని యేసు అన్నాడు. మనుషులు వాళ్లను మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు.—యోహాను 5:28, 29.

ఎక్కువ తెలుసుకోండి

చనిపోయినవాళ్లు ఖచ్చితంగా బ్రతుకుతారని ఎందుకు నమ్మవచ్చో, ఆ విషయం మీకు ఎలా ఓదార్పును-ఆశను ఇస్తుందో తెలుసుకోండి.

4. చనిపోయినవాళ్లను బ్రతికించగలనని యేసు చూపించాడు

తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు యేసు ఏం చేశాడో వివరంగా తెలుసుకోండి. యోహాను 11:14, 38-44 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • లాజరు నిజంగా చనిపోయాడని మనకు ఎలా తెలుసు?—39వ వచనం చూడండి.

  • ఒకవేళ లాజరు చనిపోయి పరలోకానికి వెళ్లి ఉంటే, ఆయన్ని మళ్లీ భూమ్మీదికి తీసుకురావడం ఆయనకు మేలు చేసినట్లు అవుతుందా?

వీడియో చూడండి.

5. చనిపోయిన చాలామంది తిరిగి బ్రతుకుతారు!

కీర్తన 37:29 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • చనిపోయి తిరిగి బ్రతికిన కోట్లమంది ఎక్కడ జీవిస్తారు?

యేసు కేవలం యెహోవాను ఆరాధించిన వాళ్లను మాత్రమే కాకుండా ఇంకా చాలామందిని బ్రతికిస్తాడు. అపొస్తలుల కార్యాలు 24:15 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఎవరు తిరిగి బ్రతకడం మీరు చూడాలనుకుంటున్నారు?

ఒకసారి ఆలోచించండి: ఒక తండ్రి తన పిల్లాడిని నిద్ర లేపినంత తేలిగ్గా, యేసు చనిపోయినవాళ్లను లేపగలడు

6. చనిపోయినవాళ్లు బ్రతుకుతారు అనే మాట మీకు ఓదార్పును, ఆశను ఇస్తుంది

చాలామందికి బైబిల్లోని యాయీరు కూతురి కథ ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా జరిగిన ఈ కథ గురించి తెలుసుకోవడానికి, లూకా 8:40-42, 49-56 చదవండి.

యాయీరు కూతుర్ని బ్రతికించడానికి ముందు, యేసు యాయీరుతో ఇలా అన్నాడు: “భయపడకు, విశ్వాసం ఉంచు చాలు.” (50వ వచనం చూడండి.) చనిపోయినవాళ్లు బ్రతుకుతారనే ఆశతో ఉండడం ఈ సందర్భాల్లో మీకు ఎలా సహాయం చేస్తుంది . . .

  • మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోయినప్పుడు?

  • మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు?

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • చనిపోయినవాళ్లు బ్రతుకుతారు అనే మాట ఫెలిసిటి వాళ్ల అమ్మానాన్నలకు ఎలా ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చింది?

కొంతమంది ఇలా అంటారు: “చనిపోయినవాళ్లు బ్రతుకుతారు అంటే నమ్మడం కష్టంగా ఉంది.”

  • మీకు ఏమనిపిస్తుంది?

  • చనిపోయినవాళ్లు నిజంగా బ్రతుకుతారని చెప్పడానికి మీరు ఏ బైబిలు వచనం చూపిస్తారు?

ఒక్కమాటలో

చనిపోయిన కోట్లమంది తిరిగి బ్రతుకుతారని బైబిలు మాటిస్తుంది. వాళ్లు తిరిగి బ్రతకాలని యెహోవా కోరుకుంటున్నాడు, అంతేకాదు వాళ్లను పునరుత్థానం చేసే శక్తిని ఆయన యేసుకు ఇచ్చాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • చనిపోయినవాళ్ల విషయంలో యెహోవా, యేసు ఏం కోరుకుంటున్నారు?

  • తిరిగి బ్రతికిన కోట్లమంది ఎక్కడ జీవిస్తారు, పరలోకంలోనా లేక భూమ్మీదా? అలాగని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

  • చనిపోయిన మీ వాళ్లు బ్రతుకుతారని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

స్నేహితులు, కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కలిగే బాధను ఎలా తట్టుకోవచ్చో కొన్ని సలహాలు చూడండి.

“మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?” (తేజరిల్లు! నం. 3 2018)

మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధను తట్టుకోవడానికి బైబిలు సలహాలు ఉపయోగపడతాయా?

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు (5:06)

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధను పిల్లలు ఎలా తట్టుకోవచ్చు?

విమోచన క్రయధనం (2:07)

ఎవరైనా పరలోకానికి పునరుత్థానం అవుతారా? దేవుడు అందర్నీ తిరిగి బ్రతికిస్తాడా?

“పునరుత్థానం అంటే ఏమిటి?” (jw.org ఆర్టికల్‌)