కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

32వ పాఠం

దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది!

దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది!

దేవుని రాజ్యం 1914 నుండి పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టింది. అప్పటినుండే, మనుషుల పరిపాలనకు చివరి రోజులు మొదలయ్యాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? బైబిలు ముందే ఏం చెప్పిందో, 1914 నుండి పరిస్థితుల్లో, ప్రజల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోండి.

1. బైబిలు ముందే ఏం చెప్పింది?

దేవుని రాజ్యం ఎప్పుడు పరిపాలించడం మొదలుపెడుతుందో బైబిల్లోని దానియేలు పుస్తకం చెప్పింది. “ఏడు కాలాలు” పూర్తయిన తర్వాత ఆ పరిపాలన మొదలౌతుంది. (దానియేలు 4:16, 17) వందల సంవత్సరాల తర్వాత, యేసు ఆ ఏడు కాలాల్నే “అన్యజనులకు నిర్ణయించిన కాలాలు” అని అన్నాడు. ఆ కాలాలు అప్పటికింకా పూర్తికాలేదని కూడా ఆయన చెప్పాడు. (లూకా 21:24) ఆ ఏడు కాలాలు 1914లో పూర్తయ్యాయి అని మనం ఇప్పుడు తెలుసుకుంటాం.

2. లోకంలో 1914 నుండి ఎలాంటి పరిస్థితుల్ని, ప్రజల్ని చూస్తున్నాం?

యేసు శిష్యులు ఆయన్ని ఇలా అడిగారు: “నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి?” (మత్తయి 24:3) దానికి జవాబుగా, పరలోకంలో తాను దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాక జరగబోయే చాలా విషయాల గురించి యేసు చెప్పాడు. వాటిలో కొన్ని ఏంటంటే యుద్ధాలు, ఆహారకొరతలు, భూకంపాలు. (మత్తయి 24:7 చదవండి.) “చివరి రోజుల్లో” ప్రజలు దారుణంగా తయారౌతారని, దానివల్ల జీవితం ‘కష్టంగా’ ఉంటుందని కూడా బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-5) ఇలాంటి పరిస్థితుల్ని, ప్రజల్ని ముఖ్యంగా 1914 నుండి చూస్తున్నాం.

3. దేవుని రాజ్య పరిపాలన మొదలైనప్పటి నుండి లోకం ఎందుకు ఇంత దారుణంగా తయారైంది?

దేవుని రాజ్యానికి రాజైన వెంటనే యేసు పరలోకంలో సాతానుతో, చెడ్డదూతలతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయాడు. “అతను భూమ్మీద పడేయబడ్డాడు, అతని దూతలు కూడా అతనితోపాటు పడేయబడ్డారు” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 12:9, 10, 12) తన నాశనం దగ్గరపడిందని తెలిసి సాతాను చాలా కోపంతో ఉన్నాడు. అందుకే ఈ భూమ్మీద ఉన్న వాళ్లందరికీ బాధల్ని, కష్టాల్ని తెస్తున్నాడు. లోకం ఇంత దారుణంగా తయారవ్వడానికి కారణం అదే! అయితే, దేవుని రాజ్యం త్వరలోనే ఈ సమస్యలన్నీ తీసేస్తుంది.

ఎక్కువ తెలుసుకోండి

దేవుని రాజ్యం 1914 లో పరిపాలించడం మొదలుపెట్టిందని ఎలా చెప్పవచ్చో, దాన్ని మీరు నమ్ముతున్నారని ఎలా చూపించవచ్చో తెలుసుకోండి.

4. దేవుని రాజ్య పరిపాలన 1914 లో మొదలైందని బైబిలు ప్రవచనం చూపిస్తుంది

పూర్వం బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ఆ కలలో చూపించాడు. ఆ కల గురించి, దానికి దానియేలు చెప్పిన అర్థం గురించి మనం బైబిల్లో చదువుతాం. ఆ కల నెబుకద్నెజరు పరిపాలన గురించే కాకుండా, దేవుని రాజ్యం గురించి కూడా చెప్తుంది.దానియేలు 4:17 చదవండి. a

దానియేలు 4:20-26 చదవండి, తర్వాత చార్టును ఉపయోగించి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • (1) నెబుకద్నెజరు తన కలలో ఏం చూశాడు?—20, 21 వచనాలు చూడండి.

  • (2) ఆ చెట్టుకు ఏమౌతుంది?—23వ వచనం చూడండి.

  • (3) “ఏడు కాలాలు” పూర్తయ్యాక ఏం జరుగుతుంది?—26వ వచనం చూడండి.

చెట్టు గురించిన కలకు, దేవుని రాజ్యానికి ఉన్న సంబంధం

ప్రవచనం (దానియేలు 4:20-36)

పరిపాలన

(1) చాలా పెద్ద చెట్టు

పరిపాలన ఆగిపోతుంది

(2) “చెట్టును నరకండి,” “ఏడు కాలాలు” గడవనివ్వండి

పరిపాలన మళ్లీ మొదలౌతుంది

(3) “నీ రాజ్యం మళ్లీ నీకు వస్తుంది”

ఆ ప్రవచనం మొదటి నెరవేర్పు . . .

  • (4) చెట్టు ఎవరికి గుర్తుగా ఉంది?—22వ వచనం చూడండి.

  • (5) అతని పరిపాలన ఎప్పుడు ఆగిపోయింది?దానియేలు 4:29-33 చదవండి.

  • (6) “ఏడు కాలాలు” పూర్తయ్యాక నెబుకద్నెజరుకు ఏమైంది?దానియేలు 4:34-36 చదవండి.

మొదటి నెరవేర్పు

పరిపాలన

(4) బబులోను రాజైన నెబుకద్నెజరు

పరిపాలన ఆగిపోతుంది

(5) క్రీస్తు పూర్వం 606 తర్వాత, నెబుకద్నెజరు పిచ్చివాడై ఏడు సంవత్సరాలు పరిపాలన చేయలేకపోయాడు

పరిపాలన మళ్లీ మొదలౌతుంది

(6) నెబుకద్నెజరుకు తెలివి వచ్చింది, అతను మళ్లీ పరిపాలించడం మొదలుపెట్టాడు

ఆ ప్రవచనం రెండో నెరవేర్పు . . .

  • (7) చెట్టు ఎవరికి గుర్తుగా ఉంది?1 దినవృత్తాంతాలు 29:23 చదవండి.

  • (8) వాళ్ల పరిపాలన ఎప్పుడు ఆగిపోయింది? యేసు భూమ్మీద ఉన్నప్పుడు కూడా ఆ పరిపాలన ఆగిపోయే ఉందని మనకెలా తెలుసు?లూకా 21:24 చదవండి.

  • (9) ఆ పరిపాలన మళ్లీ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

రెండో నెరవేర్పు

పరిపాలన

(7) దేవుని పరిపాలనకు గుర్తుగా ఉన్న ఇశ్రాయేలు రాజులు

పరిపాలన ఆగిపోతుంది

(8) యెరూషలేము నాశనం అవ్వడంతో ఇశ్రాయేలు రాజుల పరిపాలన 2,520 సంవత్సరాల పాటు ఆగిపోయింది

పరిపాలన మళ్లీ మొదలౌతుంది

(9) దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టాడు

ఏడు కాలాలు అంటే ఎంత?

బైబిల్లో ఉన్న కొన్ని వచనాల్ని వేరే వచనాల సహాయంతో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, మూడున్నర కాలాలు అంటే 1,260 రోజులు అని బైబిల్లోని ప్రకటన పుస్తకం చెప్తుంది. (ప్రకటన 12:6, 14) దాన్నిబట్టి ఏడు కాలాలు అంటున్నప్పుడు దానికి రెండింతలు, అంటే 2,520 రోజులు. బైబిల్లో కొన్నిసార్లు ఒక రోజు అంటున్నప్పుడు ఒక సంవత్సరం అని అర్థం. (యెహెజ్కేలు 4:6) దీని ప్రకారం, దానియేలు పుస్తకంలో చెప్పిన ఏడు కాలాలు అంటే 2,520 సంవత్సరాలు.

5. లోకం 1914 నుండి మారిపోయింది

తాను రాజైన తర్వాత లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయో యేసు ముందే చెప్పాడు. లూకా 21:9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఈ లేఖనంలో చెప్పిన ఎలాంటి పరిస్థితుల్ని మీరు చూశారు లేదా విన్నారు?

చివరి రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. 2 తిమోతి 3:1-5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఈ లేఖనంలో చెప్పిన ఎలాంటి ప్రజల్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు?

6. దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని మీరు నమ్ముతున్నట్లు చూపించండి

మత్తయి 24:3, 14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని నేడు జరుగుతున్న ఏ ముఖ్యమైన పని చూపిస్తుంది?

  • మీరు ఆ పనిలో పాల్గొనడానికి ఏం చేయవచ్చు?

దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది, అది భూమి మొత్తాన్ని పరిపాలించే రోజు దగ్గర్లోనే ఉంది. హెబ్రీయులు 10:24, 25 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • “ఆ రోజు దగ్గరపడే కొద్దీ” మనలో ప్రతీ ఒక్కరం ఏం చేయాలి?

ఏదైనా విషయం వేరేవాళ్లకు సహాయం చేస్తుందని, వాళ్ల ప్రాణాల్ని కాపాడుతుందని తెలిస్తే, మీరు ఏం చేస్తారు?

కొంతమంది ఇలా అడుగుతారు: “1914 ముఖ్యమైన సంవత్సరం అని యెహోవాసాక్షులు ఎందుకు అంటారు?”

  • వాళ్లకు మీరు ఏం చెప్తారు?

ఒక్కమాటలో

బైబిలు ప్రవచనం, అలాగే లోకంలోని పరిస్థితులు దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని రుజువు చేస్తున్నాయి. మనం దాన్ని నమ్ముతున్నామని దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా, మీటింగ్స్‌కి వెళ్లడం ద్వారా చూపిస్తాం.

మీరేం నేర్చుకున్నారు?

  • బైబిల్లోని దానియేలు పుస్తకం ముందే చెప్పినట్టు, ఏడు కాలాలు పూర్తయ్యాక ఏం జరిగింది?

  • దేవుని రాజ్యం 1914 లో పరిపాలించడం మొదలుపెట్టిందని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

  • దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని మీరు నమ్ముతున్నట్లు ఎలా చూపించవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

చరిత్ర గురించి రాసినవాళ్లు, అలాగే ఇంకొందరు 1914 నుండి ప్రపంచంలో జరుగుతున్న మార్పుల విషయంలో ఏమన్నారో చదవండి.

“నైతిక విలువలు హఠాత్తుగా పడిపోయిన కాలం” (తేజరిల్లు!, జూలై-సెప్టెంబరు, 2007)

మత్తయి 24:14 లో యేసు చెప్పిన ప్రవచనం, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేసిందో చదవండి.

“ఒకప్పుడు బేస్‌బాల్‌ ఆడడం అంటే నాకు ప్రాణం!” (కావలికోట ఆర్టికల్‌)

 దానియేలు 4వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం దేవుని రాజ్యం గురించి చెప్తుందని మనకెలా తెలుసు?

“దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది? (1వ భాగం)” (కావలికోట, జనవరి-మార్చి 2015)

దానియేలు 4వ అధ్యాయంలో ఉన్న “ఏడు కాలాలు” 1914లో పూర్తయ్యాయి అని ఎలా చెప్పవచ్చు?

“దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది? (2వ భాగం)” (కావలికోట, ఏప్రిల్‌-జూన్‌ 2015)

a ఈ పాఠంలో, “ఇవి కూడా చూడండి” కింద ఇచ్చిన  చివరి రెండు ఆర్టికల్స్‌ చదవండి.