కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

33వ పాఠం

దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

దేవుని రాజ్యం ఇప్పటికే పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టింది. త్వరలోనే అది భూమి మొత్తాన్ని పరిపాలిస్తుంది, మంచి పరిస్థితుల్ని తెస్తుంది. దేవుని రాజ్యం తెచ్చే ఆశీర్వాదాల్లో కొన్నిటిని ఈ పాఠంలో చూస్తాం.

1. దేవుని రాజ్యం ఎలా భూమ్మీద శాంతిని, న్యాయాన్ని తీసుకొస్తుంది?

దేవుని రాజ్యానికి రాజైన యేసు హార్‌మెగిద్దోను యుద్ధంలో చెడ్డ ప్రజల్ని, ప్రభుత్వాల్ని నాశనం చేస్తాడు. (ప్రకటన 16:14, 16) అప్పుడు, బైబిలు మాటిచ్చిన ఈ విషయం పూర్తిగా నిజమౌతుంది: “కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు.” (కీర్తన 37:10) దేవుని రాజ్యం ద్వారా యేసు భూమ్మీద ప్రతీచోట శాంతి, న్యాయం ఉండేలా చూసుకుంటాడు.—యెషయా 11:4 చదవండి.

2. భూమ్మీద దేవుని ఇష్టం నెరవేరినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?

దేవుని రాజ్య పరిపాలన కింద, నీతిమంతులు భూమిని సొంతం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు. (కీర్తన 37:29) ఒక్కసారి ఆలోచించండి: భూమంతటా యెహోవాను, తోటివాళ్లను ప్రేమించే మంచివాళ్లే ఉంటారు! అప్పుడు ఎవ్వరూ జబ్బుపడరు, అందరూ శాశ్వతంగా అంటే ఎల్లప్పుడూ జీవిస్తారు.

3. చెడ్డవాళ్లు నాశనమైన తర్వాత దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

చెడ్డవాళ్లు నాశనమైన తర్వాత యేసు 1,000 ఏళ్లు రాజుగా పరిపాలిస్తాడు. ఆ సమయంలో, భూమ్మీద ఉన్న మనుషులు పరిపూర్ణులయ్యేలా యేసు, ఆయనతోపాటు పరిపాలించే 1,44,000 మంది సహాయం చేస్తారు. 1,000 ఏళ్లు పూర్తయ్యేసరికి భూమంతా అందమైన తోటలా మారుతుంది, మనుషులందరూ యెహోవా నియమాలు పాటిస్తూ సంతోషంగా ఉంటారు. అప్పుడు యేసు తన తండ్రికి రాజ్యాన్ని తిరిగి అప్పగించేస్తాడు. అలా యెహోవా ‘పేరు పవిత్రపర్చబడుతుంది.’ (మత్తయి 6:9, 10) యెహోవా మంచి పరిపాలకుడని, తన పరిపాలన కింద ఉన్న ప్రజలకు మంచే చేస్తాడని రుజువౌతుంది. తర్వాత యెహోవా సాతానును, చెడ్డదూతల్ని, తన పరిపాలనకు ఎదురుతిరిగే ఇంకెవరినైనా నాశనం చేసేస్తాడు. (ప్రకటన 20:7-10) దేవుని రాజ్యం తీసుకొచ్చిన మంచి పరిస్థితులు ఇక ఎప్పటికీ ఉంటాయి.

ఎక్కువ తెలుసుకోండి

బైబిలు మాటిచ్చిన వాటన్నిటినీ యెహోవా తన రాజ్యం ద్వారా నిజం చేస్తాడు. దాన్ని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోండి.

4. దేవుని రాజ్యం మనుషుల పరిపాలనను తీసేస్తుంది

బైబిలు ఇలా చెప్తుంది: “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.” (ప్రసంగి 8:9) మనుషుల పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని యెహోవా తన రాజ్యం ద్వారా తీసేస్తాడు.

దానియేలు 2:44; 2 థెస్సలొనీకయులు 1:6-8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనుషుల పరిపాలనను, దానికి మద్దతిచ్చే వాళ్లను యెహోవా, ఆయన కుమారుడైన యేసు ఏం చేస్తారు?

  • ఇప్పటివరకు యెహోవా గురించి, యేసు గురించి మీరు నేర్చుకున్న దాన్నిబట్టి వాళ్లు ఏం చేసినా న్యాయంగానే చేస్తారని మీరు నమ్ముతున్నారా?

5. యేసు చాలా మంచి రాజు

దేవుని రాజ్యానికి రాజైన యేసు భూమ్మీద ఉన్న మనుషులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాడు. మనుషులకు సహాయం చేయాలనే కోరిక, అలా చేసే శక్తి తనకు ఉన్నాయని యేసు ఇప్పటికే చూపించాడు. దాని గురించి తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

భవిష్యత్తులో దేవుని రాజ్యం ఏమేం చేస్తుందో భూమ్మీద ఉన్నప్పుడే యేసు చూపించాడు. ఇక్కడ లిస్టులో ఇచ్చిన ఆశీర్వాదాల్లో మీరు దేనికోసం బాగా ఎదురుచూస్తున్నారు? లిస్టులో ఇచ్చిన ఆశీర్వాదాల్ని పరిశీలిస్తూ, వాటి పక్కన ఉన్న వచనాల్ని చదవండి.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు . . .

యేసు పరలోకం నుండి . . .

  • అద్భుత రీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు.—మత్తయి 14:17-21.

  • చాలారకాల రోగాల్ని నయం చేశాడు.—లూకా 18:35-43.

  • అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తాడు.—యెషయా 33:24.

  • చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించాడు.—లూకా 8:49-55.

  • చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికిస్తాడు, మరణాన్ని తీసేస్తాడు.—ప్రకటన 21:3, 4.

6. దేవుని రాజ్యం అద్భుతమైన ఆశీర్వాదాల్ని తెస్తుంది

మనుషుల విషయంలో యెహోవా ఉద్దేశాన్ని దేవుని రాజ్యం పూర్తిగా నిజం చేస్తుంది. మనుషులు అందమైన తోటలా మారిన భూమ్మీద ఎల్లప్పుడూ జీవిస్తారు. యెహోవా తన కుమారుడైన యేసుతో కలిసి, మనుషుల విషయంలో తన ఉద్దేశాన్ని ఎలా నిజం చేస్తాడో తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

కీర్తన 145:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవా “ప్రతీ జీవి కోరికను” తీరుస్తాడని తెలుసుకున్నాక మీకు ఎలా అనిపిస్తుంది?

కొంతమంది ఇలా అంటారు: “అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చు.”

  • మనుషుల ప్రభుత్వాలు తీసేయలేని ఏ సమస్యల్ని దేవుని రాజ్యం తీసేస్తుంది?

ఒక్కమాటలో

దేవుని రాజ్యం యెహోవా ఉద్దేశాన్ని నిజం చేస్తుంది. అది భూమి మొత్తాన్ని అందమైన తోటలా మారుస్తుంది. అందులో యెహోవాను ఆరాధించే మంచివాళ్లే ఉంటారు, వాళ్లు ఎల్లప్పుడూ జీవిస్తారు.

మీరేం నేర్చుకున్నారు?

  • దేవుని రాజ్యం యెహోవా పేరును ఎలా పవిత్రపరుస్తుంది?

  • బైబిలు మాటిచ్చిన వాటిని దేవుని రాజ్యం నిజం చేస్తుందని మనం ఎందుకు నమ్మవచ్చు?

  • దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాల్లో దేనికోసం మీరు బాగా ఎదురుచూస్తున్నారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

హార్‌మెగిద్దోను అంటే ఏంటో తెలుసుకోండి.

“హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?” (jw.org ఆర్టికల్‌)

వెయ్యేళ్ల పరిపాలనలో, అలాగే ఆ పరిపాలన ముగింపులో ఏం జరుగుతుందో చదవండి.

“తీర్పు రోజున ఏం జరుగుతుంది?” (కావలికోట ఆర్టికల్‌)

దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాల్ని ఒక కుటుంబం ఎలా ఊహించుకుంటుందో చూడండి.

మీరు పరదైసులో ఉన్నట్లు ఊహించుకోండి (1:50)

ఒకప్పుడు ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వ్యక్తి తన ప్రశ్నలకు ఎలా జవాబులు తెలుసుకున్నాడో, “నేను ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను” అనే ఆర్టికల్‌లో చదవండి.

“బైబిలు జీవితాల్ని మారుస్తుంది” (కావలికోట ఆర్టికల్‌)