కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

45వ పాఠం

తటస్థంగా ఉండడం అంటే ఏంటి?

తటస్థంగా ఉండడం అంటే ఏంటి?

తన అనుచరులు ‘లోకానికి చెందినవాళ్లుగా’ ఉండకూడదని యేసు చెప్పాడు. (యోహాను 15:19) దానర్థం, వాళ్లు తటస్థంగా ఉండాలి. తటస్థంగా ఉండడం అంటే లోక రాజకీయాల్లో అలాగే యుద్ధాల్లో పాల్గొనకపోవడం, ఎవ్వరి వైపూ ఉండకపోవడం. నిజం చెప్పాలంటే, తటస్థంగా ఉండడం అన్నిసార్లూ అంత తేలిక కాదు. తటస్థంగా ఉన్నందుకు ప్రజలు మనల్ని ఎగతాళి చేయవచ్చు. అయినా మనం తటస్థంగా ఉంటూ యెహోవా దేవునికి ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

1. మానవ ప్రభుత్వాల విషయంలో నిజ క్రైస్తవుల అభిప్రాయం ఏంటి?

క్రైస్తవులు ప్రభుత్వాల్ని గౌరవిస్తారు. యేసు చెప్పినట్టే, మనం ‘కైసరువి కైసరుకు చెల్లిస్తాం.’ అంటే పన్ను కట్టడం లాంటి చట్టాలకు లోబడతాం. (మార్కు 12:17) యెహోవా అనుమతించడం వల్లే మానవ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 13:1) కాబట్టి, ఆ ప్రభుత్వాలకు కొంచెం అధికారమే ఉందని మనం గుర్తుంచుకుంటాం. మనుషుల సమస్యల్ని పూర్తిగా తీసేయగలిగేది మన దేవుడు, ఆయన పరలోక రాజ్యం మాత్రమేనని మనం నమ్ముతాం.

2. మనం తటస్థంగా ఉన్నామని ఎలా చూపించవచ్చు?

యేసులాగే, మనం రాజకీయాల్లో తలదూర్చం. ప్రజలు యేసు చేసిన ఒక అద్భుతం చూసి ఆయన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన దానికి ఒప్పుకోలేదు. (యోహాను 6:15) ఎందుకు? ఎందుకంటే, తర్వాత ఒక సందర్భంలో ఆయన ఇలా చెప్పాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహాను 18:36) యేసు శిష్యులమైన మనం తటస్థంగా ఉన్నామని ఎన్నో విధాలుగా చూపిస్తాం. ఉదాహరణకు, మనం యుద్ధాల్లో పాల్గొనం. (మీకా 4:3 చదవండి.) మనం జెండా వంటి జాతీయ చిహ్నాల్ని గౌరవిస్తాం కానీ వాటిని పూజించం. (1 యోహాను 5:21) అంతేకాదు, మనం ఏ రాజకీయ పార్టీకి గానీ అభ్యర్థికి గానీ మద్దతివ్వం, అలాగని వ్యతిరేకించం. మనం ఈ విధాలుగా, ఇంకా వేరే విధాలుగా దేవుని ప్రభుత్వానికే, అంటే ఆయన రాజ్యానికే పూర్తి మద్దతు ఇస్తామని చూపిస్తాం.

ఎక్కువ తెలుసుకోండి

ఎలాంటి పరిస్థితుల్లో తటస్థంగా ఉండడం కష్టంగా ఉండవచ్చో, మీరు యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చో పరిశీలించండి.

3. నిజ క్రైస్తవులు తటస్థంగా ఉంటారు

తటస్థంగా ఎలా ఉండవచ్చో యేసు, ఆయన అనుచరులు చూపించారు. రోమీయులు 13:1, 5-7; 1 పేతురు 2:13, 14 చదవండి. అలాగే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • మనం ప్రభుత్వాల్ని ఎందుకు గౌరవించాలి?

  • ప్రభుత్వాలకు లోబడుతున్నాం అని మనం ఏయే విధాలుగా చూపించవచ్చు?

రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, కొన్ని దేశాలు తటస్థంగా ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ యుద్ధంలో పోరాడుతున్న ఆ రెండు దేశాలకూ అవి మద్దతు ఇస్తుండవచ్చు. మరి నిజమైన తటస్థత అంటే ఏంటి? యోహాను 17:16 చదవండి. అలాగే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • తటస్థంగా ఉండడం అంటే ఏంటి?

ప్రభుత్వాలు దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉండే పనేదైనా చేయమని చెప్తే అప్పుడేంటి? అపొస్తలుల కార్యాలు 5:28, 29 చదవండి. అలాగే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఒకవేళ ప్రభుత్వం పెట్టే నియమం దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉంటే, మనం ఎవరి నియమానికి లోబడాలి?

  • క్రైస్తవులు ప్రభుత్వ నియమాలకు లోబడని కొన్ని పరిస్థితులు చెప్పగలరా?

4. మీ ఆలోచనల్లో, పనుల్లో తటస్థంగా ఉండండి

1 యోహాను 5:21 చదవండి. అలాగే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • వీడియోలో ఉన్న సహోదరుడు రాజకీయ పార్టీలో చేరకూడదని, జెండా వందనం లాంటి జాతీయ పండుగలో పాల్గొనకూడదని ఎందుకు నిర్ణయించుకున్నాడు?

  • ఆయన తీసుకున్నది తెలివైన నిర్ణయమే అని మీకు అనిపిస్తుందా?

ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మన తటస్థత పరీక్షించబడవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • దేశాల మధ్య జరుగుతున్న ఆటల పోటీలు చూస్తున్నప్పుడు మనం ఎలా తటస్థంగా ఉండవచ్చు?

  • రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల మనం ప్రయోజనం పొందినా, లేక నష్టపోయినా మనం ఎలా తటస్థంగా ఉండవచ్చు?

  • మనం చూసే వార్తలు లేదా మన తోటివాళ్లు మన తటస్థత మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

ఏ విషయాల్లో ఒక క్రైస్తవుడు తన ఆలోచనల్లో, పనుల్లో తటస్థంగా ఉండాలి?

కొంతమంది ఇలా అడుగుతారు: “మీరు ఎందుకు జెండా వందనం చేయరు లేదా జాతీయ గీతం పాడరు?”

  • వాళ్లకు మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

క్రైస్తవులు తమ ఆలోచనల్లో, పనుల్లో, మాటల్లో తటస్థంగా ఉండడానికి ఎంతో కృషి చేస్తారు.

మీరేం నేర్చుకున్నారు?

  • మనం ప్రభుత్వాల్ని గౌరవిస్తున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

  • మనం ఎందుకు తటస్థంగా ఉంటాం?

  • ఎలాంటి పరిస్థితుల్లో మన తటస్థత పరీక్షించబడవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

తటస్థంగా ఉండడానికి మనం ఎలాంటి త్యాగాలు చేయాల్సి రావచ్చు?

యెహోవా మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు (3:14)

తటస్థత విషయంలో వచ్చే పరీక్షలకు కుటుంబాలు ముందుగానే ఎలా సిద్ధపడవచ్చు?

నలుగురిలో ఉన్నప్పుడు మీ తటస్థతను కాపాడుకోండి (4:25)

ఒక వ్యక్తి పొందగల అత్యంత గొప్ప గౌరవం ఏంటి?

“దేవునికి అన్నీ సాధ్యమే” (5:19)

ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఎలా లోక సంబంధులు కాకుండా ఉండవచ్చో పరిశీలించండి.

“ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను” (కావలికోట, మార్చి 15, 2006)