కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

54వ పాఠం

“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎవరు? ఏం చేస్తాడు?

“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎవరు? ఏం చేస్తాడు?

క్రైస్తవ సంఘానికి శిరస్సు, యేసు. (ఎఫెసీయులు 5:23) నేడు, యేసు పరలోకం నుండి భూమ్మీద ఉన్న తన అనుచరుల్ని ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ ద్వారా నడిపిస్తున్నాడు. (మత్తయి 24:45 చదవండి.) యేసే స్వయంగా ‘ఆ దాసుణ్ణి’ నియమించి, కొంత అధికారం ఇచ్చాడు. అయినప్పటికీ, ఆ దాసుడు క్రీస్తుకు లోబడుతూ క్రీస్తు సహోదరులకు సేవ చేస్తాడు. ఇంతకీ ఆ దాసుడు ఎవరు? ఆ దాసుడు మనల్ని ఎలా చూసుకుంటాడు?

1. “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎవరు?

యెహోవా ఎప్పుడూ తన ప్రజల్ని నడిపించడానికి ఒక వ్యక్తిని గానీ, ఒక చిన్న గుంపును గానీ ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. (మలాకీ 2:7; హెబ్రీయులు 1:1) యేసు చనిపోయిన తర్వాత, యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు దేవుని ప్రజల్ని నడిపించారు. (అపొస్తలుల కార్యాలు 15:2) నేడు అదే పద్ధతిని అనుసరిస్తూ, అనుభవంగల పెద్దలున్న ఒక చిన్న గుంపు, అంటే యెహోవాసాక్షుల పరిపాలక సభ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తూ ప్రకటనా పనిని నిర్దేశిస్తోంది. ఆ గుంపే “[యేసు] నియమించిన నమ్మకమైన, బుద్ధిగల దాసుడు.” (మత్తయి 24:45) పరిపాలక సభలో ఉన్న వాళ్లందరూ పవిత్రశక్తితో అభిషేకించబడిన వాళ్లే. చనిపోయిన తర్వాత, క్రీస్తుతో కలిసి పరలోకం నుండి పరిపాలించే అవకాశం వాళ్లకు ఉంది.

2. నమ్మకమైన దాసుడు పెట్టే ఆధ్యాత్మిక ఆహారం ఏంటి?

నమ్మకమైన దాసుడు తోటి క్రైస్తవులకు, ‘తగిన సమయంలో ఆహారం పెడతాడు’ అని యేసు చెప్పాడు. (మత్తయి 24:45) మనం రోజూ తినే ఆహారం మన శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి సహాయం చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ఆహారం, అంటే దేవుని వాక్యం నుండి ఇచ్చే ఉపదేశం మనం యెహోవాకు నమ్మకంగా ఉండడానికి, యేసు అప్పగించిన పనిని చేయడానికి సహాయం చేస్తుంది. (1 తిమోతి 4:6) మీటింగ్స్‌, సమావేశాలు, బైబిలు ప్రచురణలు, వీడియోల ద్వారా మనం ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందుకుంటున్నాం. అవి దేవుని ఇష్టాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయనతో ఉన్న స్నేహాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తాయి.

ఎక్కువ తెలుసుకోండి

“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు,” అంటే పరిపాలక సభ మనకు ఎందుకు అవసరమో పరిశీలించండి.

పరిపాలక సభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని, నిర్దేశాన్ని, అవసరమైన సహాయాన్ని అందిస్తుంది

3. యెహోవా ప్రజలు ఒక పద్ధతి ప్రకారం పని చేయాలి

యేసు నిర్దేశం కింద, పరిపాలక సభ యెహోవాసాక్షుల పని పద్ధతి ప్రకారం జరిగేలా చూసుకుంటుంది. ఇలాంటి ఏర్పాటే అప్పట్లో తొలి క్రైస్తవుల మధ్య కూడా ఉండేది. వీడియో చూడండి.

1 కొరింథీయులు 14:33, 40 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • తన ప్రజలు పద్ధతి ప్రకారం పని చేయాలన్నది యెహోవా కోరిక అని ఎలా చెప్పవచ్చు?

4. నమ్మకమైన దాసుడు ప్రకటనా పనిని నిర్దేశిస్తాడు

తొలి క్రైస్తవులు చేసిన ముఖ్యమైన పని, ప్రకటించడం. అపొస్తలుల కార్యాలు 8:14, 25 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మొదటి శతాబ్దంలో ప్రకటనా పనిని ఎవరు నిర్దేశించారు?

  • తోటి అపొస్తలులు నిర్దేశం ఇచ్చినప్పుడు పేతురు, యోహాను ఏం చేశారు?

నేడు పరిపాలక సభ ముఖ్యంగా ప్రకటనా పనిని నిర్దేశిస్తుంది. వీడియో చూడండి.

ప్రకటనా పని ఎంత ముఖ్యమైనదో యేసు చెప్పాడు. మార్కు 13:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • పరిపాలక సభ ముఖ్యంగా ప్రకటనా పని మీద ఎందుకు దృష్టి పెడుతుంది?

  • ప్రకటనా పని ప్రపంచవ్యాప్తంగా జరగాలంటే “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎందుకు అవసరం?

5. నమ్మకమైన దాసుడు నిర్దేశం ఇస్తాడు

పరిపాలక సభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు నిర్దేశం ఇస్తుంది. ఏ నిర్దేశం ఇవ్వాలో పరిపాలక సభ ఎలా నిర్ణయించుకుంటుంది? మొదటి శతాబ్దంలో పరిపాలక సభ ఎలా నిర్దేశం ఇచ్చిందో పరిశీలించండి. అపొస్తలుల కార్యాలు 15:1, 2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • కొంతమంది తొలి క్రైస్తవుల మధ్య ఏ వివాదం వచ్చింది?

  • పౌలు, బర్నబా, ఇతరులు పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వెళ్లారు?

అపొస్తలుల కార్యాలు 15:12-18, 23-29 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ, నిర్ణయం తీసుకునే ముందు దేవుని నిర్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఏం చేసింది?—12, 15, 28 వచనాలు చూడండి.

అపొస్తలుల కార్యాలు 15:30, 31; 16:4, 5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • పరిపాలక సభ ఇచ్చిన నిర్దేశాన్ని అందుకున్న తర్వాత తొలి క్రైస్తవులు ఏం చేశారు?

  • ఆ నిర్దేశాన్ని పాటించినందుకు యెహోవా వాళ్లను ఎలా ఆశీర్వదించాడు?

2 తిమోతి 3:16; యాకోబు 1:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • నేడు పరిపాలక సభ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, దేవుని నిర్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఏం చేస్తుంది?

కొంతమంది ఇలా అంటారు: “పరిపాలక సభలో ఉన్నది కూడా మనుషులే కదా, అంటే మీరు మనుషుల్ని అనుసరిస్తున్నారు.”

  • పరిపాలక సభ యేసు నిర్దేశం కింద పని చేస్తుందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?

ఒక్కమాటలో

పరిపాలక సభే క్రీస్తు నియమించిన “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు.” ఆ దాసుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు నిర్దేశాన్ని, ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుడిని’ ఎవరు నియమించారు?

  • పరిపాలక సభ మనల్ని ఎలా చూసుకుంటుంది?

  • పరిపాలక సభే “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” అని మీరు నమ్ముతున్నారా?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

పరిపాలక సభలో ఎవరు ఉంటారో, వాళ్లు ఎలా పని చేస్తారో తెలుసుకోండి.

“యెహోవాసాక్షుల పరిపాలక సభ అంటే ఏమిటి?” (jw.org ఆర్టికల్‌)

ఆధ్యాత్మిక ఆహారం ఖచ్చితమైనదిగా, నమ్మదగినదిగా ఉండేలా పరిపాలక సభ ఎలా చూసుకుంటుందో పరిశీలించండి.

ఖచ్చితమైన ప్రచురణల్ని తయారుచేయడం (17:18)

యేసు తమకు అప్పగించిన పని గురించి పరిపాలక సభ సభ్యులు ఏమనుకుంటున్నారు?

అదొక అమూల్యమైన అవకాశం (7:04)

పరిపాలక సభను యెహోవాయే నడిపిస్తున్నాడని మన మీటింగ్స్‌, సమావేశాలు ఎలా రుజువు చేస్తున్నాయి?

యెహోవా తన ప్రజలకు బోధిస్తున్నాడు (9:39)