కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

57వ పాఠం

మీరు ఏదైనా ఘోరమైన పాపం చేస్తే?

మీరు ఏదైనా ఘోరమైన పాపం చేస్తే?

మీరు యెహోవాను ఎంత ప్రేమిస్తున్నా, ఆయన్ని బాధపెట్టకుండా ఉండడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. అయితే, కొన్ని తప్పులు మాత్రం మిగతావాటి కన్నా చాలా ఘోరమైనవి. (1 కొరింథీయులు 6:9, 10) ఒకవేళ మీరు ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, యెహోవా మిమ్మల్ని ప్రేమించడం ఆపేయడు అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని క్షమించడానికి, మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు.

1. యెహోవా మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి?

యెహోవాను ప్రేమించేవాళ్లు తాము ఏదైనా ఘోరమైన పాపం చేశామని గుర్తించినప్పుడు చాలా బాధపడతారు. అయితే, యెహోవా ఇచ్చిన ఈ మాట వాళ్లకు ఓదార్పును ఇస్తుంది: “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, మంచు అంత తెల్లగా అవుతాయి.” (యెషయా 1:18) మనం నిజంగా పశ్చాత్తాపపడితే, యెహోవా మనల్ని పూర్తిగా క్షమిస్తాడు. మనం పశ్చాత్తాపపడుతున్నాం అని ఎలా చూపిస్తాం? మనం తప్పు చేసినందుకు చాలా బాధపడతాం, దాన్ని మళ్లీ చేయకుండా ఉంటాం, క్షమించమని యెహోవాను వేడుకుంటాం. అంతేకాదు, పాపం చేయడానికి కారణమైన ఆలోచనల్ని, అలవాట్లను మార్చుకోవడానికి గట్టిగా కృషి చేస్తాం. అలాగే, యెహోవా పవిత్ర ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తాం.—యెషయా 55:6, 7 చదవండి.

2. మనం పాపం చేసినప్పుడు పెద్దల్ని ఉపయోగించి యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

మనం ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు “సంఘ పెద్దల్ని పిలవాలి” అని యెహోవా చెప్తున్నాడు. (యాకోబు 5:14, 15 చదవండి.) పెద్దలు యెహోవాను, ఆయన గొర్రెల్ని ప్రేమిస్తారు. యెహోవాతో ఉన్న స్నేహాన్ని తిరిగి సంపాదించుకునేలా మనకు సహాయం చేయడానికి వాళ్లు అర్హులు.—గలతీయులు 6:1.

మనం ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు పెద్దలు ఎలా సహాయం చేస్తారు? ఇద్దరు లేదా ముగ్గురు పెద్దలు లేఖనాల్ని ఉపయోగించి మనల్ని సరిదిద్దుతారు. అంతేకాదు, ఆ పాపం మళ్లీ చేయకుండా ఉండడానికి కావాల్సిన మంచి సలహాలు ఇస్తారు. మనం ఆధ్యాత్మికంగా కోలుకునేంత వరకు సంఘంలో కొన్ని పనులు చేసే అవకాశం మనకు ఉండదు అని వాళ్లు చెప్పవచ్చు. ఘోరమైన పాపాలు చేసి పశ్చాత్తాపం చూపించని వాళ్లను పెద్దలు సంఘం నుండి బహిష్కరిస్తారు. సంఘం మీద చెడు ప్రభావం పడకుండా ఉండడానికి వాళ్లు అలా చేస్తారు.

ఎక్కువ తెలుసుకోండి

మనం ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడో మరింత బాగా అర్థం చేసుకుని, కృతజ్ఞత పెంచుకోండి.

3. పాపాల్ని ఒప్పుకుంటే మీరు బాగౌతారు

మనం పాపం చేసినప్పుడు యెహోవాను బాధపెడతాం, కాబట్టి ఆ పాపాన్ని ఆయన ముందు ఒప్పుకోవడం సరైనది. కీర్తన 32:1-5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • పాపాల్ని దాచిపెట్టకుండా యెహోవా ముందు ఒప్పుకోవడం ఎందుకు మంచిది?

మన పాపాల్ని యెహోవా ముందు ఒప్పుకోవడంతో పాటు, పెద్దల సహాయం కూడా తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా వీడియోలో ఉన్న సహోదరునికి పెద్దలు ఎలా సహాయం చేశారు?

మనం పెద్దల దగ్గర ఏదీ దాచకుండా నిజాయితీగా మాట్లాడాలి. మనకు సహాయం చేయడానికే వాళ్లు ఉన్నారు. యాకోబు 5:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం నిజాయితీగా మాట్లాడితే, మనకు సహాయం చేయడం పెద్దలకు ఇంకా తేలిక అవుతుంది. ఎందుకు?

మీ పాపాన్ని ఒప్పుకోండి, పెద్దలతో నిజాయితీగా మాట్లాడండి, యెహోవా ప్రేమతో ఇచ్చే సహాయాన్ని తీసుకోండి

4. బహిష్కరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు

ఘోరమైన పాపం చేసిన వ్యక్తి యెహోవా ప్రమాణాల్ని పాటించడానికి ఇష్టపడకపోతే, ఇక అతను సంఘంలో ఒకడిగా ఉండలేడు. అతన్ని సంఘం నుండి బహిష్కరిస్తారు. మనం అతనితో సహవసించం, కనీసం మాట్లాడం. 1 కొరింథీయులు 5:6, 11; 2 యోహాను 9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • పులిసిన పిండి, ముద్ద అంతటినీ పులిసేలా చేస్తుంది. అదేవిధంగా, పశ్చాత్తాపపడని పాపితో సహవాసం చేస్తే సంఘంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

సంఘం నుండి బహిష్కరించబడిన చాలామంది మొదట్లో బాధపడినా, తర్వాత ఈ ఏర్పాటు వల్ల తప్పు తెలుసుకుని యెహోవా దగ్గరికి తిరిగొచ్చారు. (కీర్తన 141:5) వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • ఈ వీడియోలో సోనియాను సంఘం నుండి బహిష్కరించారు, దానివల్ల ఆమె ఎలా ప్రయోజనం పొందింది?

బహిష్కరించే ఏర్పాటు . . .

  • యెహోవా పేరుకు ఎలా ఘనత తెస్తుంది?

  • యెహోవా న్యాయం, ప్రేమ గలవాడని ఎలా చూపిస్తుంది?

5. పశ్చాత్తాపపడితే యెహోవా క్షమిస్తాడు

ఒక వ్యక్తి పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఎంత సంతోషిస్తాడో యేసు ఒక ఉదాహరణలో చెప్పాడు. లూకా 15:1-7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • దీన్నుండి యెహోవా గురించి మీరేం నేర్చుకున్నారు?

యెహెజ్కేలు 33:11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • పశ్చాత్తాపపడుతున్నాం అని చూపించడానికి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి?

ఒక కాపరిలాగే, యెహోవా తన గొర్రెల్ని శ్రద్ధగా చూసుకుంటాడు

కొంతమంది ఇలా అంటారు: “అమ్మో! నేను పాపం చేశానని సంఘ పెద్దలకు చెప్తే, వాళ్లు నన్ను బహిష్కరిస్తారు.”

  • అలా భయపడుతున్న వ్యక్తికి మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

మనం ఘోరమైన పాపం చేసినా గానీ పశ్చాత్తాపం చూపించి, దాన్ని మళ్లీ చేయకూడదని బలంగా నిర్ణయించుకుంటే యెహోవా మనల్ని క్షమిస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • మన పాపాల్ని యెహోవా ముందు ఒప్పుకోవడం ఎందుకు మంచిది?

  • యెహోవా మన పాపాల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి?

  • మనం ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, పెద్దల సహాయం ఎందుకు తీసుకోవాలి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యెషయా 1:18 లో వర్ణించిన యెహోవా కరుణను ఒక వ్యక్తి ఎలా రుచి చూశాడో గమనించండి.

యెహోవా ఎల్లప్పుడూ కరుణ చూపిస్తాడు (5:02)

బహిష్కరించే ఏర్పాటు అందరికీ ఎలా మేలు చేస్తుంది?

“బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?” (కావలికోట, ఏప్రిల్‌ 15, 2015)

బహిష్కరించే ఏర్పాటు గురించి సాక్షులుకాని వాళ్లకు ఎలా వివరించవచ్చో తెలుసుకోండి.

“యెహోవాసాక్షులు ఒకప్పుడు తమతో కలిసి ఆరాధించినవాళ్లను దూరంగా ఉంచుతారా?” (jw.org ఆర్టికల్‌)

సత్యానికి దూరమైన ఒక వ్యక్తి యెహోవాయే తనను వెనక్కి తీసుకొచ్చాడు అని చెప్తున్నాడు. ఆయనకు ఎందుకు అలా అనిపించిందో తెలుసుకోవడానికి, “నేను మళ్లీ యెహోవాకు దగ్గరవ్వాలి” అనే అనుభవం చదవండి.

“బైబిలు జీవితాల్ని మారుస్తుంది” (కావలికోట, జూలై-సెప్టెంబరు 2012)