కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

58వ పాఠం

యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి

యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి

నిజ క్రైస్తవులు దేనివల్లా లేదా ఎవ్వరివల్లా యెహోవాతో తమకున్న స్నేహం పాడవ్వకూడదని బలంగా కోరుకుంటారు. మీ కోరిక కూడా ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. యెహోవా మీ విశ్వసనీయతను విలువైనదిగా చూస్తాడు. (1 దినవృత్తాంతాలు 28:9 చదవండి.) ఎలాంటి పరిస్థితులు యెహోవా మీద మీకున్న విశ్వసనీయతను పరీక్షిస్తాయి? అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయవచ్చు?

1. వేరేవాళ్లు మన విశ్వసనీయతను ఎలా పరీక్షించవచ్చు?

యెహోవాను సేవించకుండా మనల్ని ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ఎవరు వాళ్లు? సత్యాన్ని విడిచిపెట్టిన కొంతమంది మన విశ్వాసాన్ని పాడుచేయడానికి దేవుని సంస్థ గురించి అబద్ధాలు చెప్తారు. వాళ్లనే మతభ్రష్టులు అంటారు. అలాగే కొంతమంది మతనాయకులు కూడా మన గురించి అబద్ధాలు వ్యాప్తి చేస్తుంటారు. జాగ్రత్తగా లేనివాళ్లు వాటిని నమ్మి, సత్యాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. అలాంటి వ్యతిరేకులతో వాదించడం, వాళ్ల పుస్తకాలు చదవడం, ఇంటర్నెట్‌లో వాళ్లు రాసేవి చదవడం, వాళ్ల వీడియోలు చూడడం చాలా ప్రమాదకరం. యెహోవాను విశ్వసనీయంగా సేవించకుండా ఇతరుల్ని అడ్డుకునేవాళ్ల గురించి యేసు ఇలా చెప్పాడు: “వాళ్లను పట్టించుకోకండి. వాళ్లే గుడ్డివాళ్లు, అలాంటిది వాళ్లు ఇతరులకు దారి చూపిస్తారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే, వాళ్లిద్దరూ గుంటలో పడతారు.”మత్తయి 15:14.

ఒకవేళ మనకు తెలిసినవాళ్లలో ఎవరైనా ఇక యెహోవాసాక్షిగా ఉండకూడదని నిర్ణయించుకుంటే, అప్పుడేంటి? దగ్గరివాళ్లే అలా చేస్తే మనకు గుండె పిండేసినట్టు అనిపించవచ్చు. వాళ్లు కావాలో, యెహోవా కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిని వాళ్లు మనకు తీసుకురావచ్చు. అయితే, అందరికన్నా ఎక్కువగా యెహోవాకే విశ్వసనీయంగా ఉండాలని మనం నిర్ణయించుకోవాలి. (మత్తయి 10:37) కాబట్టి, అలాంటివాళ్లతో సహవసించకూడదని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు మనం లోబడతాం.—1 కొరింథీయులు 5:11 చదవండి.

2. ఎలాంటి నిర్ణయాలు యెహోవా మీద మనకున్న విశ్వసనీయతను పరీక్షించవచ్చు?

యెహోవా మీద ప్రేమ ఉంటే, అబద్ధ మతానికి సంబంధించిన ప్రతీదానికి మనం దూరంగా ఉంటాం. మనం అబద్ధ మతంతో సంబంధం ఉన్న ఉద్యోగం చేయకూడదు, అబద్ధ మతంతో సంబంధం ఉన్న సంస్థల్లో ఉండకూడదు, అబద్ధ మతానికి మద్దతిచ్చే ఏ పనుల్లో పాల్గొనకూడదు. యెహోవా మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాడు: ‘నా ప్రజలారా, [మహాబబులోను] నుండి బయటికి రండి.’ప్రకటన 18:2, 4.

ఎక్కువ తెలుసుకోండి

వేరేవాళ్ల వల్ల మీ విశ్వసనీయత తగ్గకుండా ఎలా చూసుకోవచ్చో తెలుసుకోండి. అలాగే మహాబబులోను నుండి బయటికి రావడం ద్వారా మీ విశ్వసనీయతను ఎలా చూపించవచ్చో పరిశీలించండి.

3. అబద్ధ బోధకులతో జాగ్రత్త!

యెహోవా సంస్థ గురించి ఎవరైనా చెడుగా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సామెతలు 14:15 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం వినే ప్రతీ మాటను నమ్మకుండా ఎలా జాగ్రత్తపడాలి?

2 యోహాను 10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనం మతభ్రష్టులతో ఎలా ఉండాలి?

  • మతభ్రష్టులతో నేరుగా మాట్లాడకపోయినా, మనం ఎలా వాళ్ల బోధల్ని వినే ప్రమాదం ఉంది?

  • తన గురించి, తన సంస్థ గురించి చెప్పే తప్పుడు మాటల్ని మనం వింటే, యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

4. తోటి సహోదరుడు పాపం చేసినప్పుడు దేవునికి విశ్వసనీయంగా ఉండండి

సంఘంలో ఎవరైనా ఘోరమైన పాపం చేశారని మనకు తెలిస్తే, మన బాధ్యత ఏంటి? ప్రాచీన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఒక సూత్రాన్ని గమనించండి. లేవీయకాండం 5:1 చదవండి.

ఆ వచనం చెప్తున్నట్టు, ఎవరైనా ఘోరమైన పాపం చేశారని మనకు తెలిస్తే, మనం ఆ విషయాన్ని పెద్దలకు చెప్పాలి. అయితే దానికంటే ముందుగా, పెద్దల దగ్గరికి వెళ్లి తప్పు ఒప్పుకోమని మనం అతన్ని దయతో ప్రోత్సహించాలి. ఒకవేళ అతను అలా చేయకపోతే, మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉంటూ ఆ విషయాన్ని పెద్దలకు చెప్పాలి. అలా చేయడం ద్వారా . . .

  • యెహోవాపై విశ్వసనీయ ప్రేమ ఎలా చూపిస్తాం?

  • తప్పు చేసిన వ్యక్తిపై విశ్వసనీయ ప్రేమ ఎలా చూపిస్తాం?

  • సంఘంలో మిగతావాళ్లపై విశ్వసనీయ ప్రేమ ఎలా చూపిస్తాం?

మీ తోటి సహోదరుడు ప్రమాదంలో ఉంటే, అతనికి సహాయం చేయండి

5. మహాబబులోనుకు దూరంగా ఉండండి

లూకా 4:8; ప్రకటన 18:4, 5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • నేను ఇంకా అబద్ధ మతంలో సభ్యునిగా ఉన్నానా?

  • అబద్ధ మతంతో సంబంధం ఉన్న ఏదైనా సంస్థలో నేను ఉన్నానా?

  • నేను చేసే పని ఏ రకంగానైనా అబద్ధ మతానికి మద్దతు ఇస్తుందా?

  • నేను అబద్ధ మతానికి దూరంగా ఉండాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా?

  • వీటిలో ఏ ప్రశ్నకైనా జవాబు అవును అయితే, నేను ఏ మార్పులు చేసుకోవాలి?

ప్రతీ విషయంలో, యెహోవా మీద విశ్వసనీయతను చూపించే నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీరు స్వచ్ఛమైన మనస్సాక్షితో ఉండగలుగుతారు.

అబద్ధ మతంతో సంబంధం ఉన్న ఒక సంస్థ, మంచి పనుల కోసం చందా అడిగితే మీరేం చేస్తారు?

కొంతమంది ఇలా అంటారు: “యెహోవాసాక్షుల గురించి మతభ్రష్టులు ఏమంటున్నారో నేను తెలుసుకోవాలి, అప్పుడే నేను సత్యాన్ని సమర్థిస్తూ మాట్లాడగలను.”

  • అది తెలివైన పనే అంటారా? ఎందుకు?

ఒక్కమాటలో

యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలంటే, ఆయన్ని విడిచిపెట్టిన వాళ్లతో మనం అస్సలు సహవసించకూడదు. అంతేకాదు మనం అబద్ధ మతం నుండి పూర్తిగా బయటికి రావాలి.

మీరేం నేర్చుకున్నారు?

  • మతభ్రష్టులు చెప్పేవి మనం ఎందుకు వినకూడదు, చూడకూడదు, చదవకూడదు?

  • ఇక యెహోవాసాక్షులుగా ఉండకూడదు అని నిర్ణయించుకున్న వాళ్లతో మనం ఎలా ఉండాలి?

  • అబద్ధ మతం నుండి బయటికి రండి అనే హెచ్చరికను మనం ఎలా పాటించవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

వేరేవాళ్లు యెహోవాసాక్షుల గురించి అబద్ధాలు చెప్తుంటే, మనం ఏం చేయాలో తెలుసుకోండి.

“మీకు వాస్తవాలు తెలుసా?” (కావలికోట, ఆగస్టు 2018)

మహాబబులోనుతో సంబంధం ఉన్న సంస్థల్ని లేదా పనుల్ని మీరు ఎలా గుర్తుపట్టవచ్చు?

“‘అంత్యదినాల’ చివర్లో ఎక్కువ సేవచేయండి” (కావలికోట, అక్టోబరు 2019, 16-18 పేరాలు)

కొంతమంది వ్యతిరేకులు మన విశ్వాసాన్ని పాడుచేయడానికి ఎలా ప్రయత్నించారు?

జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి (9:32)

“చిన్నప్పటి నుండి నేను దేవుని కోసం వెదికాను” అనే అనుభవం చదివి, షింటో మతానికి చెందిన ఒక ప్రీస్టు అబద్ధ మతం నుండి పూర్తిగా ఎలా బయటికి వచ్చాడో తెలుసుకోండి.

“బైబిలు జీవితాల్ని మారుస్తుంది” (కావలికోట ఆర్టికల్‌)