కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

60వ పాఠం

ప్రగతి సాధిస్తూ ఉండండి

ప్రగతి సాధిస్తూ ఉండండి

ఇప్పటివరకు జరిగిన ఈ బైబిలు స్టడీ మొత్తంలో, యెహోవా గురించి మీరు ఎంతో నేర్చుకున్నారు. నేర్చుకున్న వాటిని బట్టి మీరు యెహోవాను ఎంతగా ప్రేమించారంటే, మీరు ఇప్పటికే ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చు. లేదా త్వరలో బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటుండవచ్చు. అయితే, మీ ప్రగతి బాప్తిస్మంతో ఆగిపోదు. మీరు ఎల్లప్పుడూ యెహోవాకు దగ్గరౌతూ ఉండవచ్చు. ఎలా?

1. యెహోవాతో మీకున్న స్నేహాన్ని ఎందుకు పెంచుకుంటూ ఉండాలి?

యెహోవాతో మనకున్న స్నేహాన్ని పెంచుకుంటూ ఉండడానికి మనం కృషి చేయాలి. ఎందుకంటే, అలా చేయడం వల్ల మనం ఎప్పటికీ యెహోవాకు దూరంగా “కొట్టుకుపోకుండా ఉంటాం.” (హెబ్రీయులు 2:1) యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగడానికి మనం ఏం చేయవచ్చు? మనం ప్రకటనా పనిలో బిజీగా ఉంటూ, దేవుని సేవను ఇంకా ఎక్కువ చేసే అవకాశాల కోసం చూడవచ్చు. (ఫిలిప్పీయులు 3:16 చదవండి.) యెహోవా సేవ చేయడం కన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు!—కీర్తన 84:10.

2. మీరు ఇంకా ఏం చేస్తూ ఉండాలి?

ఈ బైబిలు స్టడీ ఇంతటితో అయిపోతుంది కానీ, యెహోవాతో మీ ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మనం “కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి” అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 4:23, 24) మీరు ఇప్పటివరకు చేసినట్టే, బైబిల్ని అధ్యయనం చేస్తూ, మీటింగ్స్‌కి హాజరౌతూ ఉంటే యెహోవా గురించి, ఆయన లక్షణాల గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆయనకున్న లక్షణాల్ని మీ జీవితంలో ఇంకా ఎక్కువగా ఎలా చూపించవచ్చో ఆలోచించండి. యెహోవాను సంతోషపెట్టడానికి అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండండి.

3. ప్రగతి సాధిస్తూ ఉండడానికి యెహోవా మీకు ఎలా సహాయం చేస్తాడు?

బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడే మీ శిక్షణను పూర్తిచేస్తాడు. . . . ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.” (1 పేతురు 5:10) మనందరికీ తప్పు చేయాలనిపించే పరిస్థితులు ఎదురౌతాయి. అయితే, మనం పడిపోకుండా ఉండడానికి యెహోవా సహాయం చేస్తాడు. (కీర్తన 139:23, 24) తనకు నమ్మకంగా సేవ చేయాలనే కోరికను, అలా చేయడానికి కావల్సిన శక్తిని మీకు ఇస్తానని ఆయన మాటిస్తున్నాడు.—ఫిలిప్పీయులు 2:13 చదవండి.

ఎక్కువ తెలుసుకోండి

మీరు ఎలా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చో, యెహోవా మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడో పరిశీలించండి.

4. మీ స్నేహితుడైన యెహోవాతో మాట్లాడుతూ ఉండండి, ఆయన చెప్పేది వినండి

యెహోవాకు స్నేహితులు అవ్వడానికి ప్రార్థన, బైబిలు అధ్యయనం మీకు సహాయం చేశాయి. అయితే, ఆయనకు ఇంకా దగ్గరవ్వడానికి అవి మీకు ఎలా సహాయం చేస్తాయి?

కీర్తన 62:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవాతో ఉన్న స్నేహాన్ని పెంచుకోవడానికి మీరు ఇంకా బాగా ఎలా ప్రార్థన చేయవచ్చు?

కీర్తన 1:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవాతో ఉన్న స్నేహాన్ని పెంచుకోవడానికి మీరు బైబిల్ని ఇంకా బాగా ఎలా చదవవచ్చు?

మీ వ్యక్తిగత అధ్యయనాన్ని ఇంకా బాగా చేయడానికి ఉపయోగపడే సలహాల కోసం, వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • వీడియోలోని ఏ సలహాల్ని మీరు పాటించవచ్చు?

  • మీరు ఏ విషయాల గురించి అధ్యయనం చేయాలనుకుంటున్నారు?

5. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోండి

యెహోవా సేవలో మీరు పెట్టుకునే లక్ష్యాలు, ప్రగతి సాధిస్తూ ఉండడానికి మీకు సహాయం చేస్తాయి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • ఈ వీడియోలో ఉన్న సహోదరి, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఎలా ప్రయోజనం పొందింది?

అందరం అలా వేరే దేశానికి వెళ్లి ప్రకటించలేం. అయినప్పటికీ మనందరం కొన్ని లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవచ్చు. సామెతలు 21:5 చదవండి, తర్వాత మీరు ఏ లక్ష్యాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆలోచించండి . . .

  • సంఘంలో.

  • పరిచర్యలో.

మీ లక్ష్యాల్ని చేరుకోవడానికి ఈ వచనంలో ఉన్న సలహా మీకు ఎలా సహాయం చేస్తుంది?

కొన్ని లక్ష్యాలు

  • ఇంకా బాగా ప్రార్థించండి.

  • బైబిలు మొత్తం చదవండి.

  • మీ సంఘంలో అందరితో పరిచయం పెంచుకోండి.

  • ఎవరితోనైనా బైబిలు స్టడీ మొదలుపెట్టి, దాన్ని చేయండి.

  • సహాయ పయినీరుగా లేదా క్రమ పయినీరుగా సేవ చేయండి.

  • మీరు సహోదరుడైతే, సంఘ పరిచారకుడు అవ్వడానికి కృషి చేయండి.

6. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!

కీర్తన 22:26 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఇప్పుడూ, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి మీరేం చేయవచ్చు?

ఒక్కమాటలో

యెహోవాతో మీకున్న స్నేహాన్ని పెంచుకుంటూ ఉండండి, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోండి. అలా చేస్తే, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించవచ్చు!

మీరేం నేర్చుకున్నారు?

  • తన సేవలో కొనసాగడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో మీరు ఎందుకు ఉండవచ్చు?

  • యెహోవాతో మీకున్న స్నేహాన్ని ఎలా పెంచుకోవచ్చు?

  • మీరు ప్రగతి సాధించడానికి ఆధ్యాత్మిక లక్ష్యాలు ఎలా సహాయం చేస్తాయి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యెహోవా దేన్ని విలువైనదిగా చూస్తాడు? ఒక పెద్ద పరీక్షలో నమ్మకంగా ఉండడమా, లేక ప్రతీరోజు ప్రతీక్షణం ఆయనకు నమ్మకంగా ఉండడమా?

అబ్రాహాములా ఎప్పుడూ నమ్మకంగా ఉండండి (9:20)

యెహోవాకు నమ్మకంగా సేవ చేసే వ్యక్తి కూడా తన ఆనందాన్ని కోల్పోవచ్చు. దాన్ని ఎలా తిరిగి పొందవచ్చో చూడండి.

బైబిల్ని చక్కగా చదువుతూ ధ్యానిస్తూ ఆనందాన్ని తిరిగి సంపాదించుకోండి (5:25)

మీరు ఎలా ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోవచ్చు?

“ఆధ్యాత్మిక లక్ష్యాలతో మీ సృష్టికర్తను మహిమపరచండి” (కావలికోట, జూలై 15, 2004)

పరిణతి సాధించడం ఎందుకు ప్రాముఖ్యం? మీరు దాన్ని ఎలా సాధించవచ్చు?

“‘యెహోవా దినం సమీపించింది’ కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేయండి” (కావలికోట, మే 15, 2009)