కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు?

1వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు?

మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తితో కలిసి ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. భవిష్యత్తు గురించి బైబిలు మాటిస్తున్న వాటిలో మీకు ఏది బాగా నచ్చింది?

    (2వ పాఠం చూడండి.)

  2. బైబిలు దేవుని వాక్యమని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

    (3వ పాఠం అలాగే 5వ పాఠం చూడండి.)

  3. యెహోవా పేరు ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం?

    (4వ పాఠం చూడండి.)

  4. దేవుని దగ్గర “జీవపు ఊట ఉంది” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 36:9) మీరు ఆ మాట నమ్ముతారా?

    (6వ పాఠం చూడండి.)

  5. సామెతలు 3:32 చదవండి.

    • యెహోవా కన్నా మంచి స్నేహితులు ఇంకెవరూ ఉండరు అని ఎందుకు చెప్పవచ్చు?

    • యెహోవా తన స్నేహితుల నుండి ఏం కోరుతున్నాడు? ఆయన మరీ ఎక్కువ కోరుతున్నట్టు మీకు అనిపిస్తుందా?

      (7వ పాఠం అలాగే 8వ పాఠం చూడండి.)

  6. కీర్తన 62:8 చదవండి.

    • మీరు వేటి గురించి యెహోవాకు ప్రార్థించారు? ఇంకా వేటి గురించి ప్రార్థించవచ్చు?

    • యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు?

      (9వ పాఠం చూడండి.)

  7. హెబ్రీయులు 10:24, 25 చదవండి.

    • యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకెలా సహాయం చేస్తాయి?

    • మీటింగ్స్‌కి వెళ్లడానికి కృషి చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా?

      (10వ పాఠం చూడండి.)

  8. రోజూ బైబిలు చదవడం ఎందుకు మంచిది? మీరు ఏ సమయంలో బైబిలు చదువుతారు?

    (11వ పాఠం చూడండి.)

  9. ఇప్పటివరకు బైబిలు స్టడీలో మీకు ఏది బాగా నచ్చింది?

  10. బైబిలు స్టడీ మొదలైనప్పటి నుండి మీకు ఏమైనా ఆటంకాలు వచ్చాయా? వస్తే, ఎలాంటివి వచ్చాయి? స్టడీని కొనసాగించడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

    (12వ పాఠం చూడండి.)