కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను సిద్ధంగా ఉన్నానా?

నేను సిద్ధంగా ఉన్నానా?

సంఘంతో కలిసి ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

మీరు వీటిని చేస్తుంటే, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు అవ్వడానికి బహుశా సిద్ధంగా ఉన్నట్టే  . . .

  • క్రమంగా బైబిల్ని అధ్యయనం చేస్తూ, ప్రార్థిస్తూ, మీటింగ్స్‌కి వస్తూ ఉంటే.

  • నేర్చుకుంటున్న విషయాల్ని ఇష్టపడుతూ, నమ్ముతూ, వాటిని ఇతరులకు చెప్పాలని కోరుకుంటే.

  • యెహోవాను ప్రేమిస్తుంటే, ఆయన్ని ప్రేమించేవాళ్లను దగ్గరి స్నేహితులుగా చేసుకుంటే.

  • రాజకీయ, అబద్ధమత సంస్థల్లో ఎలాంటి సభ్యత్వం లేకుండా ఉంటే.

  • యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవిస్తుంటే, యెహోవాసాక్షి అవ్వాలని కోరుకుంటే.

సంఘంతో కలిసి ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తే, పెద్దలు మీతో మాట్లాడేలా మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తి ఏర్పాట్లు చేస్తాడు. అర్హత సాధించడానికి మీరు ఏం చేయవచ్చో పెద్దలు చెప్తారు.

బాప్తిస్మం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

మీరు వీటిని చేస్తుంటే, బాప్తిస్మం తీసుకోవడానికి బహుశా సిద్ధంగా ఉన్నట్టే  . . .

  • మీరు బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు అయ్యుంటే.

  • క్రమంగా ప్రకటనా పనిలో పాల్గొంటూ, చేయగలిగినదంతా చేస్తుంటే.

  • ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునికి’ మద్దతిస్తూ, వాళ్ల నిర్దేశాన్ని పాటిస్తుంటే.—మత్తయి 24:​45-​47.

  • ప్రార్థనలో యెహోవాకు సమర్పించుకుని, ఎల్లప్పుడూ ఆయన సేవ చేయాలని కోరుకుంటే.

బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తే, పెద్దలు మీతో మాట్లాడేలా మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తి ఏర్పాట్లు చేస్తాడు. అర్హత సాధించడానికి మీరు ఏం చేయవచ్చో పెద్దలు చెప్తారు.