కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిచయం

పరిచయం

మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే ఈ పుస్తకం మీకు వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయగల లేఖనాల్ని, బైబిలు ఉదాహరణల్ని ఈజీగా వెతకడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇతరుల్ని ప్రోత్సహించడానికి, అలాగే వాళ్లు యెహోవాను ఘనపర్చే మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయడానికి సరైన లేఖనాలు కూడా ఇందులో దొరుకుతాయి. మీకు కావాల్సిన అంశం దగ్గరికి వెళ్తే చాలు, దాని కింద ప్రశ్నలు, బైబిలు ఉదాహరణల్ని వివరిస్తూ ఒకట్రెండు మాటలు కనిపిస్తాయి. (“ ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి?” బాక్సు చూడండి.) అలా మీరు సలహాలు, నిర్దేశాలు, ఊరటనిచ్చే బైబిలు లేఖనాలు ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇతరుల్ని ప్రోత్సహించడానికి, బలపర్చడానికి, సలహా ఇవ్వడానికి ఉపయోగపడే రత్నాల్లాంటి ఎన్నో బైబిలు లేఖనాల్ని కూడా మీరు కనుక్కోవచ్చు.

ఒక అంశం గురించిన అన్ని లేఖనాలు ఈ పుస్తకంలో లేవు కానీ, పరిశోధన చేయడానికి ఇదొక మంచి ప్రారంభం. (సామె 2:1-6) ఏదైనా లేఖనం గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో ఉన్న మార్జినల్‌ రెఫరెన్సులను, అలాగే ఇంగ్లీషు బైబిల్లో ఉన్న స్టడీ నోట్స్‌ను చూడండి. ఫలానా లేఖనం అర్థం ఏంటో, ఆ లేఖనాన్ని ఎలా పాటించాలో ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం లేదా ఇంగ్లీషులోని వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ చూడండి. ఒక లేఖనానికి ఉన్న ప్రస్తుత అవగాహనను తెలుసుకోవడానికి తాజాగా వచ్చిన ప్రచురణలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.

మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే ఈ పుస్తకం ద్వారా మీరు దేవుని వాక్యంలో ఉన్న తెలివి, జ్ఞానం, అవగాహన పొందాలని మేం ప్రార్థిస్తున్నాం. ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తుండగా “దేవుని వాక్యం సజీవమైనది, చాలా శక్తివంతమైనది” అనే మీ నమ్మకం ఖచ్చితంగా బలపడుతుంది.—హెబ్రీ 4:12.