కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సలహాలు

సలహాలు

ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు

మనం బైబిలు ఇచ్చే సలహాల కోసం ఎందుకు చూడాలి?

ఎవరైనా సలహా ఇస్తే సాకులు చెప్పే బదులు దాన్ని వినడం ఎందుకు మంచిది?

సామె 12:15; 29:1

సామె 1:23-31; 15:31 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 15:3, 9-23—సమూయేలు ప్రవక్త తనను సరిచేసినప్పుడు, సౌలు సలహా తీసుకోకుండా సాకులు చెప్పాడు; దానివల్ల యెహోవా అతన్ని తిరస్కరించాడు

    • 2ది 25:14-16, 27—యెహోవా తన ప్రవక్త ద్వారా రాజైన అమజ్యాకి తన పాపాలను సరిచేసుకోమని సలహా ఇచ్చినప్పుడు అతను దాన్ని వినలేదు; దానివల్ల యెహోవా అనుగ్రహాన్ని, కాపుదలను కోల్పోయాడు

నాయకత్వం వహిస్తున్నవాళ్లు మనకు సలహా ఇచ్చినప్పుడు మనమెందుకు వాళ్ల మీద గౌరవం చూపించాలి?

1థె 5:12; 1తి 5:17; హెబ్రీ 13:7, 17

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 3యో 9, 10—దియొత్రెఫే సంఘంలో నాయకత్వం వహిస్తున్నవాళ్ల మీద గౌరవం చూపించలేదు కాబట్టి అపొస్తలుడైన యోహాను అతన్ని ఖండించాడు

వృద్ధుల మాట ఎందుకు వినాలి?

లేవీ 19:32; సామె 16:31

యోబు 12:12; 32:7; తీతు 2:3-5 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 23:16-18—తనకంటే దాదాపు 30 ఏళ్లు పెద్దవాడైన యోనాతాను సలహా ఇచ్చినప్పుడు, దావీదు విని బలం పొందాడు

    • 1రా 12:1-17—రెహబాము వృద్ధులు ఇచ్చిన మంచి సలహాను వినకుండా, యువకులు ఇచ్చిన చెడ్డ సలహాను విన్నందుకు ఎన్నో సమస్యల్ని కొనితెచ్చుకున్నాడు

మనకంటే చిన్న వయసున్న యెహోవా సేవకులు అలాగే నమ్మకమైన స్త్రీలు మంచి సలహాలు ఇవ్వగలరని ఎలా చెప్పవచ్చు?

యోబు 32:6, 9, 10; సామె 31:1, 10, 26; ప్రస 4:13

కీర్త 119:100 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 25:14-35—అబీగయీలు దావీదు రాజుకు సలహా ఇచ్చింది; దానివల్ల అతని మీదకు రక్తాపరాధం రాలేదు, చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయి

    • 2స 20:15-22—ఆబేల్‌ నగరానికి చెందిన ఒక తెలివిగల స్త్రీ ఇచ్చిన సలహా, ఆ నగరంలోని ప్రజలందర్నీ కాపాడింది

    • 2రా 5:1-14—ఇశ్రాయేలుకు చెందిన ఒక పాప ఇచ్చిన సలహా వల్ల ఒక బలమైన యోధుడి కుష్ఠువ్యాధి నయమైంది

యెహోవాను గానీ, దేవుని వాక్యాన్ని గానీ గౌరవించనివాళ్ల సలహాను ఎందుకు తీసుకోకూడదు?

కీర్త 1:1; సామె 4:14

లూకా 6:39 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1ది 10:13, 14—సౌలు రాజు యెహోవాను అడిగే బదులు చనిపోయినవాళ్లను సంప్రదించే స్త్రీ దగ్గరికి వెళ్లాడు. అలా యెహోవాకు నమ్మకంగా లేనందువల్ల అతను చనిపోయాడు

    • 2ది 22:2-5, 9—రాజైన అహజ్యా చెడ్డ సలహాదారుల మాట వినడం వల్ల చనిపోయాడు

    • యోబు 21:7, 14-16—యెహోవాను గౌరవించనివాళ్లలా అస్సలు ఆలోచించకూడదని యోబు గట్టిగా నిర్ణయించుకున్నాడు

ఎవరికైనా సలహా ఇచ్చే ముందు

సలహా ఇచ్చే ముందు జరిగిన దాని గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం, రెండు వైపుల వాళ్లు చెప్పేది వినడం ఎందుకు మంచిది?

సామె 18:13, 17

సామె 25:8 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 1:9-16—ప్రధానయాజకుడైన ఏలీ నిజనిజాలు తెలుసుకోకుండా, హన్నా తాగిన మత్తులో ఉందనుకొని ఆ నమ్మకమైన స్త్రీని కఠినంగా గద్దించాడు

    • మత్త 16:21-23—అపొస్తలుడైన పేతురు యేసును మందలించాడు. అలా అనుకోకుండానే అతను యెహోవా ఇష్టాన్ని కాకుండా సాతాను ఇష్టాన్ని చేయమని సలహా ఇచ్చాడు

సలహా ఇచ్చే ముందు సహాయం కోసం యెహోవాకు ఎందుకు ప్రార్థించాలి?

కీర్త 32:8; 73:23, 24; సామె 3:5, 6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నిర్గ 3:13-18—తోటి ఇశ్రాయేలీయులు అడిగే ప్రశ్నలకు ఏమని జవాబు ఇవ్వాలో చెప్పమని మోషే యెహోవాను అడిగాడు

    • 1రా 3:5-12—యౌవన రాజైన సొలొమోను సొంత తెలివి మీద ఆధారపడే బదులు తెలివి కోసం యెహోవాను అడిగాడు, దానివల్ల దీవెనలు పొందాడు

మనం బైబిలు నుండే ఎందుకు సలహా ఇవ్వాలి?

కీర్త 119:24, 105; సామె 19:21; 2తి 3:16, 17

ద్వితీ 17:18-20 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 4:1-11—సాతాను ప్రలోభాలను తిప్పికొట్టడానికి యేసు సొంత తెలివి మీద కాకుండా దేవుని వాక్యం మీద ఆధారపడి జవాబు ఇచ్చాడు

    • యోహా 12:49, 50—యేసు ఎప్పుడూ తండ్రి నేర్పించిన వాటినే ప్రజలకు బోధించానని చెప్పాడు, ఈ విషయంలో ఆయన మనకు మంచి మాదిరి ఉంచాడు

సలహా ఇస్తున్నప్పుడు సౌమ్యంగా ఉండడానికి అలాగే సాధ్యమైతే ఎదుటివ్యక్తిని మెచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి?

గల 6:1; కొలొ 3:12

యెష 9:6; 42:1-3; మత్త 11:28, 29 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 19:2, 3—యెహోవా తన ప్రవక్త ద్వారా రాజైన యెహోషాపాతును సరిదిద్దుతూనే అతను చేసిన మంచిని కూడా మెచ్చుకున్నాడు

    • ప్రక 2:1-4, 8, 9, 12-14, 18-20—యేసు సంఘాల్ని ముందు మెచ్చుకుని, ఆ తర్వాత సలహా ఇచ్చాడు

ఒక క్రైస్తవుడు ఫలానా సహోదరుడు తన విషయంలో తప్పు చేశాడని మనకు చెప్తే అంటే మోసం చేశాడని గానీ, పేరు పాడు చేశాడని గానీ చెప్తే, జరిగిన దానిగురించి తప్పు చేసిన వ్యక్తితో ఒంటరిగా మాట్లాడమని సలహా ఇవ్వడం ఎందుకు మంచిది?

ఇతరులు తన విషయంలో తప్పు చేశారని ఒక క్రైస్తవుడు అనుకుంటే కరుణ చూపించమని, ఓర్పు చూపించమని, క్షమించమని అతన్ని ఎలా ప్రోత్సహించవచ్చు?

మత్త 18:21, 22; మార్కు 11:25; లూకా 6:36; ఎఫె 4:32; కొలొ 3:13

మత్త 6:14; 1కొ 6:1-8; 1పే 3:8, 9 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • మత్త 18:23-35—ఇతరుల్ని క్షమించడం ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి యేసు ఒక శక్తివంతమైన ఉదాహరణ చెప్పాడు

సలహా ఇస్తున్నప్పుడు యెహోవా ప్రమాణాల విషయంలో అస్సలు రాజీ పడకుండా ఎందుకు స్థిరంగా ఉండాలి?

కీర్త 141:5; సామె 17:10; 2కొ 7:8-11

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 15:23-29—సమూయేలు ప్రవక్త సౌలు రాజుకు అస్సలు భయపడలేదు, ధైర్యంగా సలహా ఇచ్చాడు

    • 1రా 22:19-28—ఎంత బెదిరించినా, హింసించినా మీకాయా ప్రవక్త మాత్రం అహాబు రాజుకు చెప్పాల్సిన హెచ్చరికా సందేశాన్ని మార్చలేదు

ఎదుటివ్యక్తికి ఆధ్యాత్మిక హాని కలిగించకుండా ఎలా సలహా ఇవ్వవచ్చు?

హెబ్రీ 12:11-13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 22:31-34—అపొస్తలుడైన పేతురు పెద్దపెద్ద పొరపాట్లు చేసినప్పటికీ వాటిని సరిచేసుకుని, ఇతరుల్ని బలపరుస్తాడని నమ్ముతున్నట్టు యేసు తెలియజేశాడు

    • ఫిలే 21—దేవుని ఇష్టానికి తగ్గట్టు ఇచ్చిన సలహాను ఫిలేమోను తప్పకుండా పాటిస్తాడని నమ్ముతున్నట్టు అపొస్తలుడైన పౌలు రాశాడు

ఆందోళనగా, బాధగా ఉన్నవాళ్లకు సలహా ఇస్తున్నప్పుడు ఎలా దయగా ఉండొచ్చు?

తప్పు చేసిన వ్యక్తి యెహోవాతో తిరిగి మంచి సంబంధం సంపాదించుకునేలా సహాయం చేయడమే మన కోరిక అని ఎలా చూపించవచ్చు?

సలహా ఇస్తున్నప్పుడు ఆడామగ, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరి మీద ఎలా గౌరవం చూపించాలి?

ఎన్నిసార్లు చెప్పినా బైబిలు సలహాను స్వీకరించడానికి ఇష్టపడని వ్యక్తిని కాపరులు ఎందుకు గట్టిగా సరిదిద్దుతారు?