కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్షమించడం

క్షమించడం

యెహోవాకు నిజంగా మనల్ని క్షమించాలని ఉందా?

కీర్త 86:5; దాని 9:9; మీకా 7:18

2పే 3:9 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 78:40, 41; 106:36-46—ప్రజలు తనను బాధపెడుతూనే ఉన్నా యెహోవా మాత్రం వాళ్లను పదేపదే క్షమించాడు

    • లూకా 15:11-32—యెహోవా ఎలా క్షమిస్తాడో యేసు ఒక ఉదాహరణ చెప్పి వివరించాడు, అందులో పశ్చాత్తాపం చూపించిన తప్పిపోయిన కుమారునితో ఒక కరుణగల తండ్రి ఎలా వ్యవహరించాడో యేసు చెప్పాడు

యెహోవా దేని ఆధారంగా మనల్ని క్షమిస్తాడు?

యోహా 1:29; ఎఫె 1:7; 1యో 2:1, 2

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • హెబ్రీ 9:22-28—క్రీస్తు రక్తం ద్వారానే మన పాపాలు క్షమించబడతాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు

    • ప్రక 7:9, 10, 14, 15—క్రీస్తు రక్తం వల్ల పాపాలు క్షమించబడిన “ఒక గొప్పసమూహం” దేవుని ముందు నిలబడి ఉండడాన్ని అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు

యెహోవా మనల్ని క్షమించాలంటే, ఎవరైనా మన విషయంలో తప్పు చేసినప్పుడు ఏం చేయాలి?

మత్త 6:14, 15; మార్కు 11:25; లూకా 17:3, 4; యాకో 2:13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 42:7-10—యెహోవా యోబుకున్న కష్టాల్ని తీసేసి అతనికి అంతకుముందున్న ఆరోగ్యాన్ని, ఆస్తుల్ని తిరిగి ఇవ్వకముందు, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ముగ్గురు స్నేహితుల తరఫున ప్రార్థించాలని యెహోవా చెప్పాడు

    • మత్త 18:21-35—యెహోవా మనల్ని క్షమించాలంటే మనం ఇతరుల్ని క్షమించడం చాలా ముఖ్యమని యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు

పాపాల్ని ఒప్పుకుని, నిజంగా పశ్చాత్తాపపడడం ఎంత ముఖ్యం?

అపొ 3:19; 26:20; 1యో 1:8-10

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 32:1-5; 51:1, 2, 16, 17—తాను చేసిన ఘోరమైన పాపాల వల్ల రాజైన దావీదు ఎంతో కృంగిపోయి బాధపడ్డాడు, నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించాడు

    • యాకో 5:14-16—మనం ఏదైనా ఘోరమైన పాపం చేస్తే పెద్దలకు చెప్పాలని యాకోబు వివరించాడు

యెహోవా మనల్ని క్షమించాలంటే మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

సామె 28:13; యెష 55:7; ఎఫె 4:28

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 21:27-29; 2ది 18:18-22, 33, 34; 19:1, 2—యెహోవా తనను శిక్షించబోతున్నాడని విన్నప్పుడు రాజైన అహాబు బాధపడ్డాడు కానీ నిజమైన పశ్చాత్తాపం చూపించలేదు, అందుకే యెహోవా క్షమించలేదు, అతన్ని చంపేశాడు

    • 2ది 33:1-16—రాజైన మనష్షే చాలా చెడ్డవాడు కానీ అతను పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా క్షమించాడు. అతను విగ్రహపూజను నిర్మూలించి సత్యారాధనను ప్రోత్సహించడం ద్వారా నిజంగా మారాడని చూపించాడు

మనం నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా ఎంతలా క్షమిస్తాడు?

కీర్త 103:10-14; యెష 1:18; 38:17; యిర్మీ 31:34; మీకా 7:19

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 2స 12:13; 24:1; 1రా 9:4, 5—దావీదు చాలా ఘోరమైన పాపాలు చేసినా పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా క్షమించాడు, తర్వాత అతను యథార్థ హృదయంతో నడుచుకున్నాడని కూడా యెహోవా అన్నాడు

క్షమించడానికి సిద్ధంగా ఉన్న యెహోవాను, యేసు ఎలా పరిపూర్ణంగా అనుకరించాడు?

కీర్త 86:5; లూకా 23:33, 34

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 26:36, 40, 41—యేసుకు తన శిష్యుల సహాయం బాగా అవసరమైన సమయంలోనే వాళ్లు నిద్రపోయారు, అయినా యేసు వాళ్ల పరిమితుల్ని అర్థం చేసుకున్నాడు

    • మత్త 26:69-75; లూకా 24:33, 34; అపొ 2:37-41—తాను ఎవరో తెలీదని పేతురు మూడుసార్లు చెప్పినా పశ్చాత్తాపపడినప్పుడు యేసు అతన్ని క్షమించాడు; యేసు పునరుత్థానం అయ్యాక అతన్ని కలిశాడు, తర్వాత సంఘంలో ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఇచ్చాడు

యెహోవా ప్రతీ ఒక్కరిని క్షమించడని ఎలా చెప్పవచ్చు?

మత్త 12:31; హెబ్రీ 10:26, 27; 1యో 5:16, 17

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 23:29-33—శాస్త్రులు, పరిసయ్యులు గెహెన్నాలో వేయబడతారని అంటే శాశ్వతంగా నాశనం చేయబడతారని యేసు చెప్పాడు

    • యోహా 17:12; మార్కు 14:21—యేసు ఇస్కరియోతు యూదాను “నాశనపుత్రుడు” అని పిలిచాడు, నమ్మకద్రోహం చేసిన ఈ వ్యక్తి పుట్టకపోయుంటేనే అతని పరిస్థితి బాగుండేదని కూడా చెప్పాడు

ఇతరుల్ని క్షమించడానికి క్రైస్తవులకు ఏది సహాయం చేస్తుంది?