కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుఃఖం

దుఃఖం

ఎవరైనా చనిపోతే దుఃఖించడం తప్పుకాదని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?

యెహోవా దుఃఖంలో మునిగిపోయిన వాళ్లకు ఊరటను ఇవ్వాలనుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?

చనిపోయిన తర్వాత ఏమౌతుందో తెలుసుకోవడం ఎందుకు ఓదార్పునిస్తుంది?

ప్రస 9:5, 10; 1థె 4:13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 20:37, 38—పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని వివరిస్తూ చనిపోయిన వాళ్లు దేవుని దృష్టిలో ఇంకా బ్రతికే ఉన్నారని యేసు చెప్పాడు

    • యోహా 11:5, 6, 11-14—తన ప్రియ స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు మరణాన్ని యేసు నిద్రతో పోల్చాడు

    • హెబ్రీ 2:14, 15—లోకంలోని చాలామందిలా మనం మరణ భయంతో జీవించాల్సిన అవసరం లేదని అపొస్తలుడైన పౌలు వివరించాడు

ఒక వ్యక్తి పుట్టిన రోజు కన్నా చనిపోయిన రోజే మేలు అని బైబిలు ఎందుకు చెప్తుంది?

బైబిలు మరణాన్ని ఏమని పిలుస్తుంది, అలాగే దేవుడు మరణాన్ని ఏం చేయబోతున్నాడు?

భవిష్యత్తులో పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని మనం ఎందుకు నమ్మవచ్చు?

యెష 26:19; యోహా 5:28, 29; అపొ 24:15

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • బైబిల్లో మొత్తం తొమ్మిది పునరుత్థానాల గురించి ఉంది. అందులో ఎనిమిది మంది భూమ్మీదికి పునరుత్థానం అయ్యారు, యేసుక్రీస్తేమో పరలోకానికి పునరుత్థానం అయ్యాడు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు చనిపోయారని ఎవరైనా బాధపడుతుంటే వాళ్లు ఈ పునరుత్థానాల నుండి ఓదార్పును, భవిష్యత్తు మీద ఆశను పొందవచ్చు

      • 1రా 17:17-24—సీదోనులోని సారెపతు నగరంలో ఉన్న ఒక విధవరాలి కొడుకును ఏలీయా ప్రవక్త తిరిగి బ్రతికించాడు

      • 2రా 4:32-37—ఎలీషా ప్రవక్త షూనేము నగరంలో ఉన్న ఒక బాబును తిరిగి బ్రతికించి అతని తలిదండ్రులకు అప్పగించాడు

      • 2రా 13:20, 21—ఎలీషా ఎముకలు ఒక శవానికి తగలగానే, చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి బ్రతికాడు

      • లూకా 7:11-15—నాయీను నగరంలో పాడె మీద మోసుకెళ్తున్న ఒక విధవరాలి కుమారుడిని యేసు తిరిగి బ్రతికించాడు

      • లూకా 8:41, 42, 49-56—సమాజమందిర అధికారియైన యాయీరు కూతుర్ని యేసు తిరిగి బ్రతికించాడు

      • యోహా 11:38-44—మార్త, మరియల సహోదరుడైన లాజరును యేసు తిరిగి బ్రతికించి వాళ్లకు ఇచ్చాడు

      • అపొ 9:36-42—ఎన్నో మంచిపనులు చేసిన దొర్కా అనే క్రైస్తవురాలిని అపొస్తలుడైన పేతురు తిరిగి బ్రతికించాడు

      • అపొ 20:7-12—కిటికీ నుండి కిందపడి చనిపోయిన ఐతుకును అపొస్తలుడైన పౌలు తిరిగి బ్రతికించాడు

    • యెహోవా యేసును అమర్త్యమైన పరలోక ప్రాణిగా పునరుత్థానం చేశాడు, కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానాలన్నీ నెరవేరి తీరతాయి

    • మొట్టమొదట పరలోకానికి పునరుత్థానమై అమర్త్యమైన జీవం పొందింది యేసే, కానీ ఆ బహుమానం ఆయన ఒక్కడికే కాదు. 1,44,000 మంది అభిషిక్త అనుచరులు కూడా అలాంటి పునరుత్థానాన్నే పొందుతారు

కుటుంబ సభ్యులను, స్నేహితులను కోల్పోయి దుఃఖిస్తున్న వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు?