కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హృదయం

హృదయం

బైబిల్లో హృదయం అనే మాట ఒక వ్యక్తి ఆలోచనల్ని, ఉద్దేశాల్ని, లక్షణాల్ని, భావోద్వేగాల్ని సూచిస్తుందని ఎలా చెప్పవచ్చు?

కీర్త 49:3; సామె 16:9; లూకా 5:22; అపొ 2:26

ద్వితీ 15:7; కీర్త 19:8 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • లూకా 9:46-48—ఇతరుల కంటే గొప్పగా ఉండాలనే ఆలోచన తన అపొస్తలుల్లో ఉందని యేసు గ్రహించి సరిదిద్దాడు

మన హృదయాన్ని కాపాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

1ది 28:9; సామె 4:23; యిర్మీ 17:9

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 6:5-7—మనిషి హృదయంలోని చెడ్డ ఆలోచనలు హింసకు దారి తీశాయి, దానివల్ల దేవుడు భూమంతటి మీదికి జలప్రళయం తీసుకొచ్చాడు

    • 1రా 11:1-10—రాజైన సొలొమోను తన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు, అతను పెళ్లి చేసుకున్న విదేశీ స్త్రీలు అతని హృదయాన్ని యెహోవాకు వ్యతిరేకంగా తిప్పేశారు

    • మార్కు 7:18-23—దేవుని దృష్టిలో మనిషిని అపవిత్రం చేసే ప్రతీది హృదయం నుండే వస్తుందని యేసు చెప్పాడు

మన హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

కీర్త 19:14; సామె 3:3-6; లూకా 21:34; ఫిలి 4:8

ఎజ్రా 7:8-10; కీర్త 119:11 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • ఎఫె 6:14-18; 1థె 5:8—ఛాతి కవచం మన గుండెను కాపాడినట్టే ఆధ్యాత్మిక కవచంలో ఉన్న నీతి, విశ్వాసం, ప్రేమ మన హృదయాన్ని కాపాడతాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు

మన హృదయంలో ఏదైనా సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది?

సామె 21:2-4; హెబ్రీ 3:12

సామె 6:12-14 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 25:1, 2, 17-27—మొదట్లో రాజైన అమజ్యా యెహోవా దృష్టిలో సరైనది చేశాడు కానీ సంపూర్ణ హృదయంతో చేయలేదు; కొంతకాలం తర్వాత అతను గర్విష్ఠిగా తయారై యెహోవాకు నమ్మకంగా లేనందువల్ల చెడు పర్యవసానాల్ని అనుభవించాడు

    • మత్త 7:17-20—ఒక చెడ్డ చెట్టు పనికిరాని ఫలాల్ని ఇచ్చినట్టే చెడ్డ హృదయం కూడా చెడ్డ పనులకు నడిపిస్తుందని యేసు చెప్పాడు

మంచి హృదయాన్ని ఎందుకు అలవర్చుకోవాలి, దాన్ని ఎలా చేయవచ్చు?

సామె 10:8; 15:28; లూకా 6:45

కీర్త 119:97, 104; రోమా 12:9-16; 1తి 1:5 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2రా 20:1-6—రాజైన హిజ్కియా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తను సంపూర్ణ హృదయంతో చేసిన సేవను బట్టి తన ప్రాణాన్ని కాపాడమని యెహోవాను వేడుకున్నాడు

    • మత్త 21:28-32—ఒక వ్యక్తి మాట్లాడే మాటల కంటే చేసే పనులే అతని హృదయంలో ఏముందో బయటపెడతాయని యేసు ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు

యెహోవా మన హృదయాన్ని పరిశీలిస్తాడని తెలుసుకోవడం ఎందుకు ఓదార్పును ఇస్తుంది?

1ది 28:9; యిర్మీ 17:10

1స 2:3 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 16:1-13—యెహోవా ఒక వ్యక్తి పైరూపాన్ని కాదుగానీ అతని హృదయాన్ని చూస్తాడని సమూయేలు ప్రవక్త తెలుసుకున్నాడు

    • 2ది 6:28-31—యెహోవాకు మన హృదయంలో ఉన్నదంతా తెలుసని, ఆయన దాన్నిబట్టి మనపై కరుణ, శ్రద్ధ చూపిస్తాడని ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో రాజైన సొలొమోను చేసిన ప్రార్థనను బట్టి అర్థమౌతుంది