కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గౌరవాన్నిస్తూ వాడే బిరుదులు

గౌరవాన్నిస్తూ వాడే బిరుదులు

మనుషుల్ని మహిమపర్చడానికి వాళ్లను మత సంబంధమైన బిరుదులతో పిలవచ్చా?

యోహా 5:41

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • లూకా 18:18, 19—యేసు మంచివాడే అయినా “మంచి బోధకుడు” అనే బిరుదును స్వీకరించలేదు, అలాగే యెహోవా తప్ప మంచివాళ్లు ఎవ్వరూ లేరని చెప్పాడు

క్రైస్తవులు “తండ్రి” లేదా “నాయకుడు” లాంటి మత సంబంధమైన బిరుదులు ఎందుకు ఉపయోగించరు?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 23:9-12—గౌరవాన్నిస్తూ వాడే బిరుదుల్ని అంటే “తండ్రి,” “నాయకుడు” లాంటివి మనుషులకు అస్సలు ఉపయోగించకూడదని యేసు చెప్పాడు

    • 1కొ 4:14-17—అపొస్తలుడైన పౌలు చాలామందికి తండ్రి లాంటివాడే అయినా అతన్ని అయ్యగారు అనో, ఫాదర్‌ అనో పిలిచినట్టు బైబిల్లో ఎక్కడా లేదు

క్రైస్తవులు ఒకరినొకరు సహోదరుడు, సహోదరి అని పిలవడం అలాగే సహోదర సహోదరీల్లా ఉండడం ఎందుకు సరైంది?

మత్త 23:8

అపొ 12:17; 18:18; రోమా 16:1 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • మత్త 12:46-50—తోటి ఆరాధకులు తనకు ఆధ్యాత్మిక సహోదర సహోదరీలని యేసు స్పష్టంగా చెప్పాడు

క్రైస్తవులు ప్రభుత్వ అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, న్యాయమూర్తుల్ని, ఇతర అధికారుల్ని బిరుదులు పెట్టి పిలవడం సరైనదే అని ఎందుకు చెప్పవచ్చు?

రోమా 13:1, 7; 1పే 2:17

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 26:1, 2, 25—అగ్రిప్ప, ఫేస్తు లాంటి ప్రభుత్వ అధికారుల్ని అపొస్తలుడైన పౌలు అధికారిక బిరుదుల్ని ఉపయోగించి పిలిచాడు