కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వినయం

వినయం

యెహోవా వినయస్థుల్ని, గర్విష్ఠుల్ని ఎలా చూస్తాడు?

కీర్త 138:6; సామె 15:25; 16:18, 19; 22:4; 1పే 5:5

సామె 29:23; యెష 2:11, 12 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 26:3-5, 16-21—రాజైన ఉజ్జియా గర్విష్ఠిగా తయారయ్యాడు; అతను చేసిన తప్పు గురించి యాజకులు చెప్పినప్పుడు మండిపడ్డాడు, అప్పుడు దేవుడు అతన్ని కుష్ఠురోగంతో మొత్తాడు

    • లూకా 18:9-14—గర్విష్ఠులు అలాగే వినయస్థులు చేసే ప్రార్థనల్ని యెహోవా ఎలా చూస్తాడో యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు

ఎవరైనా తనను తాను తగ్గించుకుని హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా ఏం చేస్తాడు?

2ది 7:13, 14; కీర్త 51:2-4, 17

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 12:5-7—రాజైన రెహబాము అలాగే యూదా అధిపతులు యెహోవా ముందు వినయం చూపించడం ద్వారా విపత్తును తప్పించుకున్నారు

    • 2ది 32:24-26—మంచి రాజైన హిజ్కియా గర్విష్ఠిగా తయారయ్యాడు కానీ తనను తాను తగ్గించుకున్నప్పుడు యెహోవా అతన్ని క్షమించాడు

వినయం చూపించడం వల్ల ఇతరులతో మనకున్న సంబంధం ఎలా మెరుగౌతుంది?

ఎఫె 4:1, 2; ఫిలి 2:3; కొలొ 3:12, 13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 33:3, 4—గతంలో తనను ద్వేషించిన తన అన్న ఏశావును తిరిగి కలిసినప్పుడు యాకోబు తనను తాను బాగా తగ్గించుకుని వినయం చూపించాడు కాబట్టి వాళ్లిద్దరూ సమాధానపడ్డారు

    • న్యా 8:1-3—న్యాయాధిపతియైన గిద్యోను వినయంగా, ఎఫ్రాయిమువాళ్లు తన కంటే గొప్పవాళ్లని అనడం వల్ల వాళ్లు శాంతించారు, గొడవపడలేదు

మనం వినయంగా ఉండడం ముఖ్యమని యేసు ఎలా బోధించాడు?

మత్త 18:1-5; 23:11, 12; మార్కు 10:41-45

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెష 53:7; ఫిలి 2:7, 8—ప్రవక్తలు ముందే చెప్పినట్టు యేసు వినయంగా ఈ భూమ్మీదికి వచ్చి ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొని చనిపోయాడు

    • లూకా 14:7-11—ఒక విందులో కూర్చోవడానికి చేసిన ఏర్పాట్లను యేసు ఒక ఉదాహరణగా ఉపయోగించి వినయం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాడు

    • యోహా 13:3-17—యేసు ఒక దాసుడు చేసే పనిని చేయడం ద్వారా అంటే అపొస్తలుల పాదాలు కడగడం ద్వారా వినయం చూపించే విషయంలో శిష్యులకు మంచి ఆదర్శాన్ని ఉంచాడు

మన గురించి, ఇతరుల గురించి సరైన అభిప్రాయం కలిగి ఉండడానికి ప్రయత్నించడం, మనం వినయంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?

దొంగ వినయం ఎందుకు పనికిరాదు?