కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అబద్ధాలు

అబద్ధాలు

ఇచ్చిన మాట నిలబెట్టుకోని వాళ్లను చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

రోమా 1:31, 32

కీర్త 15:4; మత్త 5:37 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నిర్గ 9:27, 28, 34, 35—ఫరో దేవుని ప్రజల్ని విడిపిస్తానని చెప్పాడు, కానీ తర్వాత తన మాటను నిలబెట్టుకోలేదు

    • యెహె 17:11-15, 19, 20—రాజైన సిద్కియా బబులోను రాజుతో చేసిన ప్రమాణాన్ని, ఒప్పందాన్ని నిలబెట్టుకోనందుకు యెహోవా అతన్ని శిక్షించాడు

    • అపొ 5:1-10—అననీయ, సప్పీరా తమ పొలం అమ్మితే వచ్చిన డబ్బు మొత్తం సంఘానికే ఇచ్చేశామని అబద్ధమాడారు

ఇతరుల గురించి లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లను చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

కీర్త 15:1-3; సామె 6:16-19; 16:28; కొలొ 3:9

సామె 11:13; 1తి 3:11 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2స 16:1-4; 19:24-30—నమ్మకమైన మెఫీబోషెతు గురించి అతని సేవకుడైన సీబా లేనిపోనివి కల్పించి చెప్పాడు

    • ప్రక 12:9, 10—లేనిపోనివి కల్పించి చెప్పేవాడు అనే పేరున్న వ్యక్తి లేదా అపవాది, దేవుని సేవకుల మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నాడు