కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కరుణ

కరుణ

మనకు కరుణ ఉంటే ఇంకా ఏ లక్షణాలు చూపిస్తాం?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 51:1, 2—తన మీద కరుణ చూపించమని దావీదు యెహోవాను వేడుకోవడం ద్వారా అతను యెహోవా క్షమాపణ కోరాడు అలాగే తన పాపాల్ని కడిగేయమని బ్రతిమాలాడు

    • లూకా 10:29-37—ఒక యూదుని పరిస్థితిని అర్థం చేసుకుని దయ చూపించిన సమరయుడి కథ చెప్పడం ద్వారా యేసు కరుణ గురించి ఒక చక్కని పాఠం నేర్పించాడు

మనుషులందరికీ యెహోవా కరుణ ఎందుకు అవసరం?

కరుణ చూపించే విషయంలో యెహోవా ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?

నిర్గ 34:6; నెహె 9:17; కీర్త 103:8; 2కొ 1:3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 42:1, 2, 6-10; యాకో 5:11—యెహోవా యోబు మీద కరుణ చూపించడమే కాదు, అతను కూడా ఇతరుల మీద కరుణ చూపించాలని నేర్పించాడు

    • లూకా 15:11-32—తప్పుదారి పట్టి పశ్చాత్తాపపడిన తన కొడుకును క్షమించిన తండ్రి కథను చెప్తూ యేసు యెహోవా కరుణ గురించి నేర్పించాడు

యెహోవా మనమీద కరుణ ఎందుకు చూపిస్తున్నాడు?

రోమా 5:8; 1యో 4:9, 10

తీతు 3:4, 5 కూడా చూడండి

క్రీస్తు బలి వల్లే మన పాపాలకు క్షమాపణ దొరుకుతుందని ఎందుకు చెప్పవచ్చు?

మనం ఎందుకు దేవుని కరుణ కోసం వేడుకోవాలి అలాగే దేవుడు చూపించే కరుణను ఎందుకు చులకనగా చూడకూడదు?

లూకా 11:2-4; హెబ్రీ 4:16

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 51:1-4—తను చేసిన పాపాన్ని బట్టి గుండె బరువెక్కిన దావీదు యెహోవా కరుణ కోసం వినయంగా వేడుకున్నాడు

    • లూకా 18:9-14—తమ బలహీనతలు గుర్తించి వినయంగా ప్రవర్తించే ప్రజల పట్ల యెహోవా కరుణ చూపిస్తాడని చెప్పడానికి యేసు ఒక ఉదాహరణ ఉపయోగించాడు

ఘోరమైన పాపాలు చేసినవాళ్లు కూడా యెహోవా కరుణను పొందగలమనే ఆశతో ఎందుకు ఉండవచ్చు?

ద్వితీ 4:29-31; యెష 55:7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 33:9-13, 15—మనష్షే చాలా చెడ్డవాడైనా, పశ్చాత్తాపపడి యెహోవా కరుణ కోసం వేడుకున్నాడు, దాంతో అతను మళ్లీ రాజయ్యాడు; అతను ఆ తర్వాత చేసిన పనుల్ని బట్టి నిజమైన పశ్చాత్తాపం చూపించాడని, నిజంగా మారాడని రుజువైంది

    • యోనా 3:4-10—నీనెవె ప్రజల చేతులు హింస, రక్తపాతంతో నిండిపోయినా పశ్చాత్తాపం చూపించి తమ ప్రవర్తనను మార్చుకున్నందుకు దేవుని కరుణను పొందారు

ఒక పాపి తన పాపాల్ని ఒప్పుకుని ప్రవర్తనను మార్చుకుంటేనే యెహోవా కరుణను పొందుతాడని ఎందుకు చెప్పవచ్చు?

మనం యెహోవా కరుణను పొందినంత మాత్రాన క్రమశిక్షణను గానీ, మన పాపాల వల్ల వచ్చే చెడు ఫలితాల్ని గానీ తప్పించుకోలేం

మనం ఇతరుల మీద కరుణ ఎందుకు చూపించాలి?

ఇతరుల మీద కరుణ చూపించకపోతే యెహోవాతో మనకున్న స్నేహం పాడౌతుందని ఎందుకు చెప్పవచ్చు?

మత్త 9:13; 23:23; యాకో 2:13

సామె 21:13 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 18:23-35—ఒక వ్యక్తి ఇతరుల మీద కరుణ చూపించకపోతే యెహోవా కూడా అతని మీద కరుణ చూపించడని చెప్పడానికి యేసు ఒక ఉదాహరణ ఉపయోగించాడు

    • లూకా 10:29-37—యెహోవాకు, యేసుకు కరుణ చూపించనివాళ్లంటే ఇష్టంలేదని, సమరయునిలా ఇతరుల మీద కరుణ చూపించేవాళ్లంటేనే ఇష్టమని మనకు బాగా పరిచయమున్న సమరయుని కథ నేర్పిస్తుంది

ఇతరుల మీద కరుణ చూపిస్తే యెహోవా మనతో ఎలా ఉంటాడు?