కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే

మనతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే

మనతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే మనకు ఎలా అనిపించవచ్చు?

కీర్త 69:20; సామె 18:14; ప్రస 4:1-3; మలా 2:13-16; కొలొ 3:21

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2స 10:1-5—శత్రువులు రాజైన దావీదు సైనికుల్లో కొంతమందిని శారీరకంగా గాయపర్చకపోయినా వాళ్లను ఘోరంగా అవమానించారు, అప్పుడు దావీదు తన సైనికులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు

    • 2స 13:6-19—అమ్నోను తామారుపై అత్యాచారం చేసి ఆమెను అవమానించి పంపించేసినప్పుడు, ఆమె ఏడుస్తూ తన బట్టల్ని చింపుకుంది

మనతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే, జరిగిందంతా యెహోవాకు తెలుసని ఎలా చెప్పవచ్చు, మరి ఆయన ఏం చేస్తాడు?

యోబు 34:21, 22; కీర్త 37:8, 9; యెష 29:15, 19-21; రోమా 12:17-21

కీర్త 63:6, 7 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 25:3, 14-17, 21, 32-38—కఠినుడు, చెడ్డవాడైన నాబాలు తన ఇంట్లోవాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆలోచించకుండా దావీదును అవమానించాడు; తర్వాత దేవుడు నాబాలును మొత్తడంతో అతను చనిపోయాడు

    • యిర్మీ 20:1-6, 9, 11-13—యాజకుడైన పషూరు యిర్మీయాను కొట్టి బొండలో పెట్టినప్పుడు మొదట్లో యిర్మీయా నిరుత్సాహపడ్డాడు, కానీ తర్వాత యెహోవా అతన్ని బలపర్చి కాపాడాడు