కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డబ్బు

డబ్బు

డబ్బును ప్రేమించడం ఎందుకు ప్రమాదకరం?

కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించడం తప్పుకాదని బైబిలు ఎలా చూపిస్తుంది?

ప్రస 7:12; 10:19; ఎఫె 4:28; 2థె 3:10; 1తి 5:8, 18

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 31:38-42—తన మామ లాబాను అన్యాయంగా ప్రవర్తించినా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి యాకోబు అతని దగ్గర నిజాయితీగా పని చేశాడు; యెహోవా అతని కష్టాన్ని దీవించాడు

    • లూకా 19:12, 13, 15-23—యేసు చెప్పిన ఉదాహరణను బట్టి ఆ కాలంలో డబ్బులు సంపాదించడం కోసం పెట్టుబడి పెట్టడం మామూలు విషయమే అని అర్థమౌతుంది

అప్పు తీసుకునే విషయంలో, అప్పు ఇచ్చే విషయంలో ఎలాంటి బైబిలు సూత్రాలు ఉన్నాయి?

అనవసరమైన అప్పులు చేయకుండా ఉండడం ఎందుకు మంచిది?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నెహె 5:2-8—నెహెమ్యా కాలంలో కొంతమంది ఇశ్రాయేలీయులు అప్పు తీసుకున్న వాళ్లతో కఠినంగా ఉండేవాళ్లు

    • మత్త 18:23-25—అప్పు తీసుకుని దాన్ని తిరిగి ఇవ్వని వ్యక్తికి శిక్షపడవచ్చని యేసు ఉదాహరణ మనకు గుర్తుచేస్తుంది

అవిశ్వాసులతో, సహోదర సహోదరీలతో లేదా బంధువులతో వ్యాపారంలోకి దిగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 23:14-20—శారాను సమాధి చేయడానికి కావాల్సిన పొలాన్ని, గుహను అబ్రాహాము కొంతమంది సాక్షుల ముందు కొన్నాడు; భవిష్యత్తులో ఎలాంటి గొడవలు, మనస్పర్థలు రాకూడదనే ఉద్దేశంతోనే అలా చేసి ఉంటాడు

    • యిర్మీ 32:9-12—యిర్మీయా ప్రవక్త తన బంధువుల దగ్గర పొలం కొనేటప్పుడు సాక్షుల ముందు క్రయపత్రాన్ని, నకలు పత్రాన్ని రాసి డబ్బులిచ్చాడు

డబ్బుల్ని ఎలా ఖర్చుపెట్టాలో ప్లాన్‌ చేసుకోవడం ఎందుకు మంచిది?

డబ్బుకు సంబంధించిన సమస్యలు సంఘంలో విభజనలు సృష్టించకుండా క్రైస్తవులు ఎందుకు జాగ్రత్తపడాలి?

1కొ 6:1-8

రోమా 12:18; 2తి 2:24 కూడా చూడండి

డబ్బును ఎలా ఉపయోగిస్తే నిజమైన సంతోషాన్ని పొందుతాం?