కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లులు

తల్లులు

తల్లి బాధ్యతలు ఏంటి?

సామె 31:17, 21, 26, 27; తీతు 2:4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 21:8-12—ఇష్మాయేలు చిన్నవాడైన ఇస్సాకును తీవ్రంగా బాధపెట్టడం గమనించినప్పుడు శారా తన కుమారుడిని కాపాడమని అబ్రాహామును వేడుకుంది

    • 1రా 1:11-21—అదోనీయా రహస్యంగా రాజవ్వడానికి ప్రయత్నించినప్పుడు బత్షెబ తన కుమారుడైన సొలొమోనును కాపాడమని అలాగే అతన్ని రాజును చేయమని దావీదును బ్రతిమాలింది

మనం తల్లి మాట వింటూ ఆమెను ఎందుకు గౌరవించాలి?

నిర్గ 20:12; ద్వితీ 5:16; 27:16; సామె 1:8; 6:20-22; 23:22

1తి 5:9, 10 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1పే 3:5, 6—తనకున్న బలమైన విశ్వాసం వల్ల శారా అనేకమంది స్త్రీలకు తల్లి అయిందని అపొస్తలుడైన పేతురు చెప్పాడు

    • సామె 31:1, 15, 21, 28—పెళ్లి గురించి, కుటుంబంలో భార్యకి-తల్లికి ఉన్న ముఖ్యమైన పాత్ర గురించి రాజైన లెమూయేలు తల్లి మంచి సలహాలు ఇచ్చింది

    • 2తి 1:5; 3:15—తన భర్త అవిశ్వాసి అయినప్పటికీ యునీకే తన కుమారుడు తిమోతికి పసితనం నుండే లేఖనాల గురించి బోధించినందుకు అపొస్తలుడైన పౌలు ఆమెను మెచ్చుకున్నాడు