కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పర్యవేక్షకులు

పర్యవేక్షకులు

క్రైస్తవ పర్యవేక్షకులు ఏ అర్హతల్ని తగిన స్థాయిలో చేరుకోవాలి?

క్రైస్తవ పర్యవేక్షకులు ఇంకా ఎలాంటి విషయాల్లో మంచి ఆదర్శం ఉంచాలి?

సంఘ పరిచారకులు ఏ అర్హతల్ని తగిన స్థాయిలో చేరుకోవాలి?

పర్యవేక్షకులు పవిత్రశక్తి ద్వారానే నియమించబడతారని ఎందుకు చెప్పవచ్చు?

అపొ 20:28

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 13:2-5; 14:23—ప్రయాణ పర్యవేక్షకులైన పౌలు, బర్నబా వేర్వేరు సంఘాలకు వెళ్లి పెద్దల్ని నియమించారు; నేడు ప్రాంతీయ పర్యవేక్షకులు కూడా అలాగే చేస్తారు, వాళ్లు పవిత్రశక్తి కోసం ప్రార్థన చేసి ఒక వ్యక్తి పర్యవేక్షకుడు అవ్వడానికి కావాల్సిన లేఖన అర్హతలు చేరుకున్నాడో లేదో జాగ్రత్తగా పరిశీలిస్తారు

    • తీతు 1:1, 5—వేర్వేరు సంఘాలకు వెళ్లి పెద్దల్ని నియమించే బాధ్యత తీతుకు అప్పగించబడింది

సంఘం ఎవరిది, దాన్ని కొనడానికి ఎలాంటి మూల్యం చెల్లించబడింది?

బైబిలు ఎందుకు పర్యవేక్షకులను సేవకులని, దాసులని పిలుస్తుంది?

పర్యవేక్షకులు ఎందుకు వినయంగా ఉండాలి?

ఫిలి 1:1; 2:5-8; 1థె 2:6-8; 1పే 5:1-3, 5, 6

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 20:17, 31-38—అపొస్తలుడైన పౌలు తాను ఎన్నో సంవత్సరాలు ఎఫెసు పెద్దల కోసం చేసినదాన్ని వాళ్లకు గుర్తుచేశాడు; వాళ్లు ఆయన ప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞత చూపించారు

“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే నిర్దేశాన్ని క్రైస్తవ పర్యవేక్షకులు ఎలా చూస్తారు?

పెద్దలు ఇతరులకు బోధించడానికి అన్నిటికన్నా మంచి పద్ధతి ఏంటి?

1తి 4:12; 1పే 5:2, 3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నెహె 5:14-16—యెహోవా మీదున్న ప్రగాఢమైన గౌరవం వల్ల అధిపతైన నెహెమ్యా, దేవుని ప్రజల మీద తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, న్యాయంగా తనకు చెందాల్సింది కూడా తీసుకోలేదు

    • యోహా 13:12-15—యేసు తన ఆదర్శం ద్వారా వినయంగా ఎలా ఉండాలో శిష్యులకు బోధించాడు

ఒక క్రైస్తవ కాపరి సంఘంలో ఉన్న ప్రతీఒక్కరి మీద ప్రేమ, శ్రద్ధ ఎలా చూపించవచ్చు?

ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నవాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?

బోధించేటప్పుడు పెద్దల బాధ్యత ఏంటి?

సంఘాన్ని పవిత్రంగా ఉంచే విషయంలో పెద్దలు ఎందుకు బాగా కష్టపడాలి?

పెద్దలు ఎవరికి శిక్షణ ఇస్తారు?

2తి 2:1, 2

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 10:5-20—ప్రకటనా పనికి పంపించే ముందు యేసు తన 12 మంది అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు

    • లూకా 10:1-11—ప్రకటనా పనికి పంపించే ముందు యేసు తన 70 మంది శిష్యులకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు, నిర్దేశాలు ఇచ్చాడు

పెద్దలు తమకున్న ఎన్నో బాధ్యతల్ని చక్కగా నిర్వహించాలంటే ఏం చేయాలి?

1పే 5:1, 7

సామె 3:5, 6 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 3:9-12—తన ప్రజలకు తీర్పు తీర్చే విషయంలో కావాల్సిన వివేచనను, అవగాహనను ఇవ్వమని రాజైన సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు

    • 2ది 19:4-7—రాజైన యెహోషాపాతు యూదా దేశమంతటా న్యాయమూర్తుల్ని నియమించి, తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తుండగా యెహోవా వాళ్లకు తోడుంటాడని గుర్తుచేశాడు

నమ్మకమైన పర్యవేక్షకులను సంఘంలోని వాళ్లు ఎలా చూడాలి?

1థె 5:12, 13; 1తి 5:17; హెబ్రీ 13:7, 17

ఎఫె 4:8, 11, 12 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 20:37—ఎఫెసు పెద్దలు అపొస్తలుడైన పౌలు పట్ల ఆప్యాయత చూపించడానికి వెనకాడలేదు

    • అపొ 28:14-16—అపొస్తలుడైన పౌలు రోముకు బయల్దేరినప్పుడు అక్కడి సహోదరులు దాదాపు 65 కిలోమీటర్లు ప్రయాణించి, అతన్ని అప్పీయాలోని సంతలో కలుసుకున్నారు; వాళ్లను చూసి అపొస్తలుడైన పౌలు చాలా ప్రోత్సాహం పొందాడు