కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హింస

హింస

క్రైస్తవులు ఖచ్చితంగా హింసించబడతారని ఎందుకు చెప్పవచ్చు?

మనం హింసించబడుతున్నప్పుడు, సహాయం కోసం యెహోవా వైపు ఎందుకు చూడాలి?

కీర్త 55:22; 2కొ 12:9, 10; 2తి 4:16-18; హెబ్రీ 13:6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 19:1-18—హింసలు వచ్చినప్పుడు ఏలీయా ప్రవక్త తన హృదయాన్ని యెహోవా ముందు కుమ్మరించడం వల్ల ప్రోత్సాహాన్ని, ఓదార్పును పొందాడు

    • అపొ 7:9-15—యోసేపుకు తన అన్నల నుండి హింసలు వచ్చాయి; కానీ యెహోవా మాత్రం అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు, అతన్ని కాపాడాడు, అలాగే అతన్ని ఉపయోగించుకునే అతని కుటుంబాన్ని కాపాడాడు

మనకు ఎలాంటి హింసలు రావచ్చు?

అవమానం, ఎగతాళి

2ది 36:16; మత్త 5:11; అపొ 19:9; 1పే 4:4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2రా 18:17-35—రబ్షాకే అష్షూరు రాజు తరఫున మాట్లాడుతూ యెహోవాను అవమానించాడు, యెరూషలేము ప్రజల్ని ఎగతాళి చేశాడు

    • లూకా 22:63-65; 23:35-37—యేసును హింసిస్తున్నవాళ్లు, ఆయన బంధించబడి ఉన్నప్పుడు అలాగే హింసాకొయ్య మీద ఉన్నప్పుడు ఆయన్ని అవమానించి, ఎగతాళి చేశారు

కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి వచ్చే వ్యతిరేకత

అరెస్టు చేసి అధికారుల ముందుకు తీసుకెళ్లడం

కొట్టడం

అల్లరిమూకలు దాడి చేయడం

చంపడం

హింసలు వచ్చినప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి?

మత్త 5:44; అపొ 16:25; 1కొ 4:12, 13; 1పే 2:23

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 7:57–8:1—ఒక పెద్ద గుంపు స్తెఫనును హింసించి అతన్ని చంపబోతున్నప్పుడు కూడా, హింసిస్తున్న వాళ్లపట్ల కరుణ చూపించమని అతను దేవున్ని అడిగాడు; ఆ గుంపులో తార్సుకు చెందిన సౌలు కూడా ఉన్నాడు

    • అపొ 16:22-34—అపొస్తలుడైన పౌలు చెరసాల అధికారి చేత కొట్టబడినా, బొండలో పెట్టబడినా, పౌలు అతని మీద దయ చూపించాడు, దానివల్ల అతనూ, అతని ఇంటివాళ్లూ విశ్వాసులయ్యారు

కొంతమంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏం ఎదుర్కొన్నారు?

మనం హింసల్ని ఎలా చూడాలి?

హింసల్ని తట్టుకోవడానికి నిరీక్షణ ఎలా సహాయం చేస్తుంది?

హింసించబడినప్పుడు మనం ఎందుకు అస్సలు సిగ్గుపడకుండా, భయపడకుండా, నిరుత్సాహపడకుండా ఉంటాం? అలాగే మనం ఎందుకు యెహోవా సేవ ఆపడానికి అస్సలు ఒప్పుకోం?

కీర్త 56:1-4; అపొ 4:18-20; 2తి 1:8, 12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 32:1-22—సన్హెరీబు రాజు పెద్ద సైన్యంతో యెరూషలేము మీద దండెత్తినప్పుడు, నమ్మకమైన హిజ్కియా రాజు యెహోవా మీద ఆధారపడుతూ ప్రజల్ని బలపర్చాడు, దానివల్ల అతను గొప్పగా ఆశీర్వదించబడ్డాడు

    • హెబ్రీ 12:1-3—శత్రువులు యేసును అవమానించడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన దాన్ని లెక్క చేయలేదు, నిరుత్సాహానికి చోటివ్వలేదు

హింసల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

కష్టాల్లో మనం చూపించే సహనం యెహోవాను సంతోషపెడుతుంది, ఆయన పేరుకు ఘనతను తెస్తుంది

1పే 2:19, 20; 4:12-16

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 1:6-22; 2:1-10—తన కష్టాల వెనుక ఉన్నది సాతాను అని యోబుకు తెలియకపోయినా అతను మాత్రం యెహోవాకు యథార్థంగా ఉన్నాడు, అలా సాతాను అబద్ధికుడని నిరూపించి యెహోవాను ఘనపర్చాడు

    • దాని 1:6, 7; 3:8-30—నమ్మకమైన హనన్యా, మిషాయేలు, అజర్యా (షద్రకు, మేషాకు, అబేద్నెగో) యెహోవాకు అవిధేయత చూపించడం కన్నా భయంకరమైన చావును ఎదుర్కోవడానికే సిద్ధపడ్డారు; దానివల్ల యెహోవాను ఆరాధించని నెబుకద్నెజరు రాజు కూడా అందరి ముందు సర్వోన్నత దేవుడు యెహోవాయే అని ఒప్పుకున్నాడు

మనం పడుతున్న హింసల్ని బట్టి ఇతరులు యెహోవా గురించి తెలుసుకోవాలనుకోవచ్చు

లూకా 21:12, 13; అపొ 8:1, 4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 11:19-21—హింసల వల్ల చెల్లాచెదురైపోయిన క్రైస్తవులు దూరదేశాల్లో కూడా మంచివార్తను ప్రకటించారు

    • ఫిలి 1:12, 13—అపొస్తలుడైన పౌలు జైల్లో ఉండడం వల్ల ఎంతోమంది మంచివార్తను తెలుసుకోవడం చూసి ఆయన సంతోషించాడు

హింసల్లో మనం చూపించే సహనం మన తోటి విశ్వాసుల్ని బలపర్చగలదు

చాలామంది మతనాయకులు, రాజకీయ నాయకులు యెహోవా సేవకుల్ని హింసించడానికి ఏం చేస్తుంటారు?

యిర్మీ 26:11; మార్కు 3:6; యోహా 11:47, 48, 53; అపొ 25:1-3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 19:24-29—ఎఫెసులో అర్తెమి ఆలయం లాంటి చిన్నచిన్న ఆలయ విగ్రహాలను తయారు చేసేవాళ్లు; విగ్రహపూజ చేయకూడదు అనే క్రైస్తవ బోధ వాళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందేమో అని భయపడి క్రైస్తవుల్ని హింసించారు

    • గల 1:13, 14—పౌలు (సౌలు) క్రైస్తవుడిగా మారకముందు, ఆయనకు యూదా మత సంప్రదాయాల మీద విపరీతమైన ఉత్సాహం ఉండేది, అందుకే ఆయన క్రైస్తవుల్ని హింసించాడు

యెహోవా సేవకులు పడుతున్న హింసల వెనక ఉన్నది ఎవరు?