కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విభేదాలు వచ్చినప్పుడు

విభేదాలు వచ్చినప్పుడు

ఎవరైనా మనల్ని బాధపెడితే వాళ్లమీద కోపం పెంచుకోవడం గానీ, పగతీర్చుకోవడం గానీ ఎందుకు చేయకూడదు?

సామె 20:22; 24:29; రోమా 12:17, 18; యాకో 1:19, 20; 1పే 3:8, 9

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 25:9-13, 23-35—దావీదుకు, అతని మనుషులకు అవసరమైన సహాయాన్ని నాబాలు చేయకపోగా వాళ్లను అవమానించాడు; దాంతో దావీదు అతన్నీ, అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ చంపేయాలని తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, కానీ అబీగయీలు ఇచ్చిన తెలివైన సలహా దావీదు మీదకు రక్తాపరాధం రాకుండా కాపాడింది

    • సామె 24:17-20—శత్రువు పడిపోయినప్పుడు ఆనందించవద్దని, అది యెహోవాకు ఇష్టం లేదని, తీర్పు తీర్చే పని యెహోవాకే వదిలేయాలని రాజైన సొలొమోను పవిత్రశక్తి సహాయంతో రాశాడు

ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడడం మానేయడం గానీ, వాళ్లమీద కోపం పెంచుకోవడం గానీ సరైనదేనా?

లేవీ 19:17, 18; 1కొ 13:4, 5; ఎఫె 4:26

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • మత్త 5:23, 24—మన వల్ల ఒక సహోదరుడు నొచ్చుకున్నాడని తెలిస్తే అతనితో సమాధానపడేందుకు మనం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు

ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది?

మన విషయంలో పదేపదే పాపం చేసినవాళ్లు కూడా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడితే మనం ఎందుకు క్షమించాలి?

ఒక క్రైస్తవుడు మన గురించి లేనిపోనివి కల్పించి చెప్పడం, లేదా మనల్ని మోసం చేయడం లాంటి ఏదైనా పెద్ద తప్పు చేసి, మనం దాన్ని మర్చిపోలేకపోతుంటే అతనితో ఎవరు మాట్లాడాలి, ఏ ఉద్దేశంతో మాట్లాడాలి?

మత్త 18:15

యాకో 5:20 కూడా చూడండి

మన గురించి లేనిపోనివి కల్పించి చెప్పిన వ్యక్తితో లేదా మనల్ని మోసం చేసిన వ్యక్తితో, మనం ఒంటరిగా మాట్లాడాక కూడా అతను పశ్చాత్తాపపడడానికి ఇష్టపడకపోతే, అప్పుడు ఏం చేయాలి?