కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకోవడం

పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకోవడం

పెళ్లి చేసుకోకుండా ఉండడం కూడా ఒక బహుమానమే అని ఎందుకు చెప్పవచ్చు?

పెళ్లికాని క్రైస్తవుల్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం ఎందుకు తప్పు?

1కొ 7:28, 32-35; 1థె 4:11

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • రోమా 14:10-12—తోటి క్రైస్తవులకు తీర్పు తీర్చడం ఎందుకు తప్పో అపొస్తలుడైన పౌలు వివరించాడు

    • 1కొ 9:3-5—అపొస్తలుడైన పౌలుకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది, కానీ అతను ఒంటరిగా ఉండడం వల్ల పరిచర్య మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగాడు

సంతోషంగా జీవించాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని పెళ్లికాని క్రైస్తవులు అనుకోవాలా?

1కొ 7:8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • న్యా 11:30-40—యెఫ్తా కూతురు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది, జీవితమంతా ఆలయంలో సంతోషంగా సేవ చేసింది

    • అపొ 20:35—ఈ లేఖనంలోని యేసు మాటల్ని బట్టి చూస్తే, ఆయన పెళ్లి చేసుకోకపోయినా సంతోషంగా ఉన్నాడు; ఎందుకంటే ఆయన ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు

    • 1థె 1:2-9; 2:12—ఒంటరి జీవితాన్ని గడిపిన అపొస్తలుడైన పౌలు, తన పరిచర్యలో పొందిన సంతోషం గురించి, అద్భుతమైన ఫలితాల గురించి చెప్పాడు

మిగతా దేవుని సేవకుల్లాగే పెళ్లికాని క్రైస్తవులు కూడా నైతిక విషయాల్లో ఎందుకు పవిత్రంగా ఉండాలి?

1కొ 6:18; గల 5:19-21; ఎఫె 5:3, 4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సామె 7:7-23—ఒక అనైతిక స్త్రీ వలలో పడిన యువకుడికి ఎలాంటి చెడు ఫలితాలు వచ్చాయో సొలొమోను రాజు వివరించాడు

    • పర 4:12; 8:8-10—షూలమ్మీతీ తన ప్రవర్తనంతటిలో పవిత్రంగా ఉంది కాబట్టి లేఖనాలు ఆమెను పొగుడుతున్నాయి

ఎలాంటి పరిస్థితుల్లో ఒంటరి క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు?

1కొ 7:9, 36

1థె 4:4, 5 కూడా చూడండి