కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం చేయడం

అధ్యయనం చేయడం

క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ఎందుకు క్రమంగా అధ్యయనం చేయాలి?

కీర్త 1:1-3; సామె 18:15; 1తి 4:6; 2తి 2:15

అపొ 17:11 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 9:1-3, అధస్సూచి—దానియేలు ప్రవక్త పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేశాడు కాబట్టి ఇశ్రాయేలీయులు బబులోనులో బందీలుగా ఉండే 70 సంవత్సరాల కాలం త్వరలోనే పూర్తి అవ్వబోతుందని అర్థం చేసుకున్నాడు

    • కీర్త 119:97-101—కీర్తనకర్త దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడని, దానికి లోబడడం వల్ల తన జీవితంలో ఎన్నో ప్రయోజనాలు పొందాడని చెప్పాడు

మనం ఎందుకు జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి?

హెబ్రీ 6:1-3; 2పే 3:18

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సామె 4:18—వేకువ వెలుగు అంతకంతకూ ఎక్కువ అయినట్టే, యెహోవా తనను ప్రేమించే వ్యక్తికి బైబిలు సత్యాల్ని అంతకంతకూ స్పష్టం చేస్తాడు

    • మత్త 24:45-47—చివరి రోజుల్లో ఆధ్యాత్మిక ఆహారాన్ని తగిన సమయంలో పెట్టేలా ఒక ‘నమ్మకమైన, బుద్ధిగల దాసున్ని’ నియమిస్తానని యేసు ముందే చెప్పాడు

లోకంలోని మేధావులు రాసిన పుస్తకాల్లో ఉన్న తెలివి కంటే బైబిల్లో ఉన్న తెలివి ఎందుకు విలువైనది?

తనను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో బైబిల్ని అధ్యయనం చేసేవాళ్లకు ఏం ఇస్తానని యెహోవా మాటిచ్చాడు?

వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి ప్రయోజనం పొందాలంటే మనం వేటికోసం ప్రార్థించాలి?

“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం ఎందుకు మంచిది?

మత్త 24:45-47

మత్త 4:4; 1తి 4:15 కూడా చూడండి

బైబిల్లో ఉన్న సరైన జ్ఞానాన్ని, చిన్నచిన్న వివరాలతో సహా తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి?

తెలివిని, అవగాహనను సంపాదించడం ఎందుకంత ముఖ్యం?

మనం చదివేటప్పుడు ఎందుకు మెల్లగా, జాగ్రత్తగా, ఆలోచిస్తూ చదవాలి?

బైబిల్లో చదివిన విషయాలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఎందుకు ఆలోచించాలి?

మనం నేర్చుకున్నవాటిని ఇతరులకు ఎలా వివరించాలో ఎందుకు జాగ్రత్తగా ఆలోచించాలి?

ముఖ్యమైన సత్యాల్ని మళ్లీమళ్లీ అధ్యయనం చేయడం ఎందుకు మంచిది?

2పే 1:13; 3:1, 2

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • ద్వితీ 6:6, 7; 11:18-20—ఇశ్రాయేలీయులు తమ పిల్లల హృదయాల్లో యెహోవా మాటల్ని నాటాలని, వాటిని మళ్లీమళ్లీ బోధించాలని యెహోవా ఆజ్ఞాపించాడు

బైబిల్లోని విషయాల్ని కుటుంబంగా కలిసి మాట్లాడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

ఎఫె 6:4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 18:17-19—అబ్రాహాము తన ఇంటివాళ్లకు నీతిగా జీవించడం నేర్పించాలని యెహోవా చెప్పాడు

    • కీర్త 78:5-7—ఇశ్రాయేలీయుల్లో ప్రతీ తరంవాళ్లు తర్వాతి తరంవాళ్లకు యెహోవా గురించి బోధించాలి; అలా చేస్తే ప్రజలు యెహోవా మీద నమ్మకం ఉంచుతూ ఆయన్ని సేవించగలుగుతారు

మీటింగ్స్‌లో అందరితో కలిసి అధ్యయనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

హెబ్రీ 10:25

సామె 18:1 కూడా చూడండి