కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తెలివి

తెలివి

నిజమైన తెలివిని సంపాదించాలంటే మనకు ఎలాంటి వైఖరి ఉండాలి?

నిజమైన తెలివి ఎక్కడ దొరుకుతుంది?

మనం తెలివి కోసం దేవున్ని అడగవచ్చా?

కొలొ 1:9; యాకో 1:5

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 1:8-12—ఇశ్రాయేలీయులను చక్కగా పరిపాలించడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని యౌవనుడైన సొలొమోను యెహోవాకు ప్రార్థించాడు, అతను కోరినదాన్ని యెహోవా సంతోషంగా ఇచ్చాడు

    • సామె 2:1-5—దాచబడిన సంపదల కోసం వెతికినట్టు తెలివిని, అవగాహనను, వివేచనను వెతకమని లేఖనాలు చెప్తున్నాయి; వాటికోసం శ్రద్ధగా వెతికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం ఇస్తాడు

యెహోవా ఎవరి ద్వారా అలాగే దేని ద్వారా తెలివిని ఇస్తాడు?

యెష 11:2; 1కొ 1:24, 30; 2:13; ఎఫె 1:17; కొలొ 2:2, 3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సామె 8:1-3, 22-31—ఈ లేఖనం తెలివికి వ్యక్తిత్వం ఉన్నట్టు మాట్లాడుతుంది, నిజానికి ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ విశ్వంలో మొట్టమొదట సృష్టించబడిన దేవుని కుమారుడే

    • మత్త 13:51-54—వాళ్ల మధ్యే పుట్టిపెరిగిన మనిషికి ఇంత తెలివి ఎలా వచ్చిందా అని యేసు బోధలు వింటున్న చాలామంది ఆశ్చర్యపోయారు

దేవుడు ఇచ్చే తెలివిని సంపాదించుకుంటే మనం ఎలా ఉంటాం?

దేవుడు ఇచ్చే తెలివి మనకు కావాల్సిన నిర్దేశాన్ని ఎలా ఇస్తుంది, అది మనల్ని ఎలా కాపాడుతుంది?

దేవుడు ఇచ్చే తెలివి ఎంత విలువైనది?

సామె 3:13, 14; 8:11

యోబు 28:18 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 28:12, 15-19—యోబు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయినా, ఆస్తిపాస్తుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోయినా దేవుడు ఇచ్చే తెలివి ఎంత అమూల్యమైనదో చెప్పాడు

    • కీర్త 19:7-9—యెహోవా నియమాలు, జ్ఞాపికలు అనుభవం లేనివాళ్లకు కూడా తెలివిని ఇస్తాయని దావీదు రాజు అన్నాడు

దేవున్ని లెక్కచేయని లోకపు తెలివిని స్వీకరిస్తే మనకెలాంటి హాని జరగవచ్చు?