కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పని

పని

పని చేయడానికి, సుఖసంతోషాలు అనుభవించడానికి సంబంధం ఏంటి?

మనం మంచిగా, నైపుణ్యంగా పని చేయడం నేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

సామె 22:29

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 16:16-23—నైపుణ్యవంతంగా వీణ వాయిస్తాడనే పేరు యువకుడైన దావీదుకు ఉంది; ఆందోళనతో సతమతమౌతున్న సౌలు రాజుకు అతని సంగీతం ఊరట ఇచ్చింది

    • 2ది 2:13, 14—హూరామబీ నైపుణ్యంగల పనివాడు కాబట్టి రాజైన సొలొమోను ఒక పెద్ద నిర్మాణ పనిలో అతన్ని ఉపయోగించాడు

యెహోవా సేవకులు ఎలాంటి పనివాళ్లుగా పేరు తెచ్చుకోవాలనుకుంటారు?

ఎఫె 4:28; కొలొ 3:23

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 24:10-21—అబ్రాహాము సేవకుడు అడిగిన దానికంటే రిబ్కా ఎక్కువే చేసింది; అలా అందరికి సహాయం చేసే గుణం, కష్టపడి పనిచేసే అలవాటు తనకు ఉన్నాయని చూపించింది

    • ఫిలి 2:19-23—యువకుడైన తిమోతికి వినయంగా ఇతరుల కోసం కష్టపడే స్ఫూర్తి ఉందని చూసి అపొస్తలుడైన పౌలు అతనికి ఒక బరువైన బాధ్యతను అప్పగించాడు

దేవుని సేవకులు ఎందుకు బద్దకస్తులుగా ఉండకూడదు?

సామె 13:4; 18:9; 21:25, 26; ప్రస 10:18

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • సామె 6:6-11—రాజైన సొలొమోను చీమల్ని చూపించి సోమరులుగా ఉండకూడదని, కష్టపడి పని చేయాలని చెప్పాడు

మన అవసరాలను తీర్చుకోవడానికి ఎందుకు కష్టపడి పనిచేయాలి?

మన కుటుంబం కోసం ఎందుకు కష్టపడి పనిచేయాలి?

1తి 5:8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • రూతు 1:16, 17; 2:2, 3, 6, 7, 17, 18—తన అత్త నయోమి అవసరాల్ని తీర్చడానికి విధవరాలైన రూతు కష్టపడి పనిచేసింది

    • మత్త 15:4-9—దేవుని సేవ చేస్తున్నామనే సాకుతో తల్లిదండ్రుల అవసరాల్ని పట్టించుకోని వాళ్లను యేసు గద్దించాడు

మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏం చేయడానికి సిద్ధంగా ఉండాలి?

డబ్బు సంపాదించడాన్ని మనం ఎలా చూడాలి?

చక్కగా పని చేసి మన అవసరాలు తీర్చుకోవాలన్నదే యెహోవా కోరికని మనకెలా తెలుసు?

మత్త 6:25, 30-32; లూకా 11:2, 3; 2కొ 9:10

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 31:3-13—లాబాను తన దగ్గర పనిచేసిన తన అల్లుడు యాకోబుతో అన్యాయంగా వ్యవహరించాడు కానీ యెహోవా యాకోబు కష్టాన్ని దీవించాడు

    • ఆది 39:1-6, 20-23—యోసేపు పోతీఫరు ఇంట్లో దాసుడిగా ఉన్నప్పుడు అలాగే జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు యెహోవా అతని కష్టాన్ని దీవించాడు

దేవుని సేవ కంటే ఉద్యోగానికి మొదటిస్థానం ఎందుకు ఇవ్వకూడదు?

కీర్త 39:5-7; మత్త 6:33; యోహా 6:27

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 12:15-21—ఆధ్యాత్మిక సంపదల కంటే భౌతిక సంపదలకే మొదటిస్థానం ఇవ్వడం మూర్ఖత్వమని యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు

    • 1తి 6:17-19—అపొస్తలుడైన పౌలు ధనవంతులైన క్రైస్తవులతో గర్విష్ఠులుగా ఉండడం ప్రమాదకరమని చెప్పి, “మంచిపనుల విషయంలో ధనవంతులుగా ఉండమని” ప్రోత్సహించాడు

ఉద్యోగం విషయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

  • నిర్గ 20:4; అపొ 15:29; ఎఫె 4:28; ప్రక 21:8—ఈ ఉద్యోగాన్ని ఒప్పుకుంటే దేవునికి ఇష్టంలేని పని ఏదైన నేను చేయాల్సి వస్తుందా?

  • నిర్గ 21:22-24; యెష 2:4; 1కొ 6:9, 10; 2కొ 7:1—ఈ ఉద్యోగం దేవునికి ఇష్టంలేని పనిని ప్రోత్సహిస్తుందా లేదా దానికి మద్దతిస్తుందా, ఈ ఉద్యోగంలో చేరితే నేను కూడా దానిలో పాల్గొన్నట్టు అవుతుందా?

  • రోమా 13:1-7; తీతు 3:1, 2—ఈ ఉద్యోగంలో చేరితే నేను ఏదైన చట్టాన్ని మీరాల్సి వస్తుందా?

  • 2కొ 6:14-16; ప్రక 18:2, 4—ఈ ఉద్యోగంలో చేరితే నేను అబద్ధ మతానికి మద్దతు ఇచ్చినట్టు, దానికి సంబంధించిన పనుల్లో పాల్గొన్నట్టు అవుతుందా?

యెహోవా కోసం పని చేయడం

క్రైస్తవులు చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటి?

యెహోవా సేవలో మన బెస్ట్‌ ఇవ్వాలని ఎందుకు అనుకుంటాం?

యెహోవా సేవలో మనం చేస్తున్నదాన్ని ఇతరులతో ఎందుకు పోల్చుకోకూడదు?

గల 6:3-5

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 25:14, 15—యేసు ఒక ఉదాహరణ ద్వారా తన శిష్యులందరూ తమ సామర్థ్యాలకు తగ్గట్టు యెహోవా సేవ చేస్తారని చెప్పాడు

    • లూకా 21:2-4—పేద విధవరాలు వేసిన చిన్న కానుకకు గొప్ప విలువుందని యేసు దయగా చెప్పాడు

యెహోవా సేవలో మనకున్న నియామకాన్ని చేయడానికి కావాల్సిన శక్తి ఎక్కడ నుండి వస్తుంది?

2కొ 4:7; ఎఫె 3:20, 21; ఫిలి 4:13

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 2తి 4:17—అపొస్తలుడైన పౌలు తనకు సరిగ్గా అవసరమైన సమయానికే అవసరమైన శక్తిని పొందానని చెప్పాడు

యెహోవా సేవలో కష్టపడి పని చేసినప్పుడు మనం ఎందుకు సంతోషిస్తాం?