కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటిసారి మాట్లాడేటప్పుడు

పాఠం 1

శ్రద్ధ చూపించండి

శ్రద్ధ చూపించండి

సూత్రం: “ప్రేమ . . . సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు.”—1 కొరిం. 13:4, 5.

యేసు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా యోహాను 4:6-9 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. సమరయ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టే ముందు యేసు ఏమేం గమనించాడు?

  2.  బి. “తాగడానికి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అని యేసు అడిగాడు. మాటలు మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి పద్ధతి అని ఎందుకు చెప్పవచ్చు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మొదటిసారి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఆసక్తి ఉన్న విషయాన్ని ఎంచుకుంటే ఆయన మనతో చక్కగా మాట్లాడవచ్చు.

యేసులా ఉందాం

3. పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి. మీరు సిద్ధపడిన విషయాల గురించే మాట్లాడాలని అనుకోకుండా, ప్రస్తుతం ఇతరులు వేటిగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాటితోనే మాటలు మొదలుపెట్టండి. ఇలా ప్రశ్నించుకోండి:

  1.   ఎ. ‘ఈ మధ్య వార్తల్లో దేని గురించి ఎక్కువగా చెప్తున్నారు?’

  2.  బి. ‘నా చుట్టూ ఉన్నవాళ్లు, తోటి ఉద్యోగులు లేదా తోటి విద్యార్థులు వేటి గురించి మాట్లాడుకుంటున్నారు?’

4. బాగా గమనించండి. ఇలా ప్రశ్నించుకోండి:

  1.   ఎ. ‘ఈ వ్యక్తి ఏ పనిలో ఉన్నాడు? బహుశా ఆయన దేని గురించి ఆలోచిస్తుండవచ్చు?’

  2.  బి. ‘ఈ వ్యక్తి వేసుకున్న బట్టలు, కనపడే తీరు, ఇల్లు ఆయన నమ్మకాల గురించి లేదా ఆయన పెరిగిన విధానం గురించి ఏం చెప్తున్నాయి?’

  3.  సి. ‘ఆయనతో మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా?’

5. వినండి.

  1.   ఎ. మీరే ఎక్కువగా మాట్లాడకండి.

  2.  బి. ఎదుటి వ్యక్తి తన మనసులో ఉన్నది చెప్పేలా ప్రోత్సహించండి. అవసరమైతే ప్రశ్నలు వేయండి.