కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటిసారి మాట్లాడేటప్పుడు

పాఠం 2

సహజంగా మాట్లాడండి

సహజంగా మాట్లాడండి

సూత్రం: “సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!”—సామె. 15:23.

ఫిలిప్పు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 8:30, 31 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. ఫిలిప్పు తన మాటల్ని ఎలా మొదలుపెట్టాడు?

  2.  బి. ఆ అధికారితో మాటలు కలిపి, కొత్త విషయాల్ని పరిచయం చేయడానికి ఫిలిప్పు ఉపయోగించిన పద్ధతి సహజమైందని ఎందుకు చెప్పవచ్చు?

ఫిలిప్పు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం చక్కగా మాటలు కలిపి, సహజంగా సంభాషణను ముందుకు తీసుకెళ్తే, ఎదుటి వ్యక్తి కంగారుపడకుండా మనతో మాట్లాడవచ్చు, మనం చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చు.

ఫిలిప్పులా ఉందాం

3. బాగా గమనించండి. ఒక వ్యక్తి ముఖకవళికలు, నిలబడే-కూర్చునే తీరు నుండి వాళ్ల గురించి చాలానే తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్లు మీకు అనిపిస్తుందా? అలా అయితే “మీరు ఎప్పుడైనా ఇది విన్నారా?” అనే ఒక చిన్న ప్రశ్నతో ఒక బైబిలు సత్యాన్ని పరిచయం చేయండి. ఒకవేళ ఆ వ్యక్తి మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోతే మాట్లాడమని బలవంతపెట్టకండి.

4. ఓర్పుగా ఉండండి. కలిసిన వెంటనే ఏదైనా ఒక బైబిలు సత్యాన్ని చెప్పాల్సిందే అని అనుకోకండి. సహజంగా, మాటల మధ్యలో దాన్ని చెప్పేలా సరైన అవకాశం కోసం చూడండి. కొన్నిసార్లు దానికోసం ఆ వ్యక్తిని మళ్లీ కలిసేంతవరకు మీరు ఓపిగ్గా ఎదురుచూడాల్సి రావచ్చు.

5. పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి మీరు అనుకున్నది కాకుండా, వేరే విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టవచ్చు. అలాంటప్పుడు మీరు అనుకున్న బైబిలు సత్యాన్ని చెప్పకుండా ఆ వ్యక్తికి తగ్గట్టు, వాళ్లకు ఉపయోగపడే విషయాల గురించే మాట్లాడండి.