కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటిసారి మాట్లాడేటప్పుడు

పాఠం 3

దయ చూపించండి

దయ చూపించండి

సూత్రం: “ప్రేమ . . . దయ చూపిస్తుంది.”—1 కొరిం. 13:4.

యేసు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా యోహాను 9:1-7 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. యేసు ముందేం చేశాడు? చూపులేని ఆ వ్యక్తిని బాగుచేశాడా లేక అతనికి మంచివార్తను చెప్పాడా?—యోహాను 9:35-38 చూడండి.

  2.  బి. ఆ వ్యక్తి యేసు చెప్పేది వినడానికి ఎందుకు ఇష్టపడి ఉంటాడు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం ఎదుటి వ్యక్తిని పట్టించుకుంటున్నామని వాళ్లకు అనిపిస్తే, వాళ్లు మనం చెప్పేది వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

యేసులా ఉందాం

3. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి. వాళ్లకు ఎలా అనిపిస్తుందో ఊహించడానికి ప్రయత్నించండి.

  1.   ఎ. ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ వ్యక్తి దేని గురించి ఆందోళన పడుతుండవచ్చు? ఆయన్ని ఆకట్టుకునే, ఉపయోగపడే విషయాలు ఏమై ఉండవచ్చు?’ ఇలా ఆలోచించడం వల్ల మీరు మనస్ఫూర్తిగా దయ చూపించగలుగుతారు.

  2.  బి. ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం ద్వారా, వాళ్లకు ముఖ్యమని అనిపించే విషయాల్ని మీరు కూడా పట్టించుకుంటున్నారని చూపించండి. ఆ వ్యక్తి తనకు ఎలా అనిపిస్తుందో చెప్పినప్పుడు లేదా తను ఎదుర్కొంటున్న ఏదైనా ఒక సమస్య గురించి చెప్పినప్పుడు వెంటనే వేరే విషయాల్లోకి వెళ్లిపోకండి.

4. గౌరవం చూపిస్తూ, దయగా మాట్లాడండి. మీకు ఎదుటి వ్యక్తి పట్ల కనికరం ఉంటే, వాళ్లకు నిజంగా సహాయం చేయాలనిపిస్తే అది మీరు మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. మీ స్వరాన్ని, మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఎదుటి వ్యక్తికి కోపం తెప్పించే లేదా వాళ్లను బాధపెట్టే విషయాలు మాట్లాడకండి.

5. సహాయం చేయండి. ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలిగే అవకాశాల కోసం చూడండి. మనం దయతో చేసే పనుల వల్ల కఠినులైనా కరిగిపోవచ్చు, మనతో మాట్లాడడానికి ఇష్టపడవచ్చు.

ఇవి కూడా చూడండి