కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటిసారి మాట్లాడేటప్పుడు

పాఠం 4

వినయం చూపించండి

వినయం చూపించండి

సూత్రం: “వినయంతో ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి.”—ఫిలి. 2:3.

పౌలు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 26:2, 3 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. పౌలు అగ్రిప్ప రాజుతో మాట్లాడేటప్పుడు ఎలా వినయం చూపించాడు?

  2.  బి. పౌలు మాట్లాడుతున్నప్పుడు అవధానాన్ని తనమీదికి కాకుండా యెహోవా మీదికి, లేఖనాల మీదికి ఎలా మళ్లించాడు?—అపొస్తలుల కార్యాలు 26:22 చూడండి.

పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం వినయంతో, గౌరవంతో ప్రకటించినప్పుడు ప్రజలు మనం చెప్పే సందేశాన్ని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

పౌలులా ఉందాం

3. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీకే అన్నీ తెలుసు, ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడకండి. మీ మాటల్లో గౌరవం చూపించండి.

4. మీరు చెప్పేవి బైబిల్లోనివే అని స్పష్టం చేయండి. దేవుని వాక్యంలో ఉన్న ఆలోచనలు ప్రజల హృదయాలను కదిలిస్తాయి. కాబట్టి మనం బైబిల్ని ఉపయోగించినప్పుడు మనం చెప్పేవాటి మీద కాకుండా బైబిలు మీద వాళ్ల విశ్వాసాన్ని పెంచిన వాళ్లమౌతాం.

5. సౌమ్యంగా ఉండండి. మీ మాటే నెగ్గాలన్నట్టు ప్రవర్తించకండి. వాళ్లతో వాదన పెట్టుకోవాలన్నది మన ఉద్దేశం కాదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా, సరైన సమయంలో అక్కడ నుండి వెళ్లిపోవడం ద్వారా వినయం చూపించండి. (సామె. 17:14; తీతు 3:2) మీరు సౌమ్యంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి భవిష్యత్తులో మీతో మాట్లాడడానికి ఇష్టపడవచ్చు.