కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటిసారి మాట్లాడేటప్పుడు

పాఠం 5

నేర్పుగా మాట్లాడండి

నేర్పుగా మాట్లాడండి

సూత్రం: “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.”—కొలొ. 4:6.

పౌలు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 17:22, 23 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. ఏథెన్సు ప్రజలు పాటిస్తున్న అబద్ధమత ఆచారాల్ని చూసినప్పుడు పౌలుకు ఎలా అనిపించింది?—అపొస్తలుల కార్యాలు 17:16 చూడండి.

  2.  బి. ఏథెన్సు ప్రజల్ని తప్పుబట్టకుండా వాళ్ల నమ్మకాల్ని ఉపయోగించుకుంటూనే పౌలు మంచివార్తను నేర్పుగా ఎలా ప్రకటించాడు?

పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం ఏం చెప్తున్నాం అనే దాంతో పాటు దాన్ని ఎలా చెప్తున్నామో, ఎప్పుడు చెప్తున్నామో కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మాట్లాడితే ప్రజలు మనం చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చు.

పౌలులా ఉందాం

3. మంచి పదాల్ని ఎంచుకోండి. ఉదాహరణకు క్రైస్తవులుకాని వాళ్లతో యేసు గురించి, బైబిలు గురించి మాట్లాడేటప్పుడు వాళ్లకు అర్థమయ్యే పదాలను ఉపయోగించండి. అలాగే వాళ్లకు కోపం తెప్పించే మాటలు మాట్లాడకుండా జాగ్రత్తపడండి.

4. ఎదుటి వ్యక్తిని వెంటనే సరిచేయకండి. ఆయన్ని తన మనసులో ఉన్నదంతా ఫ్రీగా చెప్పనివ్వండి. ఒకవేళ బైబిలు బోధలకు విరుద్ధంగా ఏమైనా చెప్తే వాదించకండి. (యాకో. 1:19) ఆయన చెప్పేది వినడం ద్వారా ఆయన ఏం నమ్ముతున్నాడో, ఎందుకు అలా నమ్ముతున్నాడో మీరు తెలుసుకోగలుగుతారు.—సామె. 20:5.

5. వీలైనప్పుడల్లా ఎదుటి వ్యక్తి చెప్తున్న వాటిని ఒప్పుకోండి, వాళ్లను మెచ్చుకోండి. తన మత నమ్మకాలే సరైనవని ఆయన బలంగా నమ్ముతుండవచ్చు. కాబట్టి ముందు మీరిద్దరూ ఒప్పుకునే విషయాలతో మాటలు మొదలుపెట్టి తర్వాత బైబిలు సత్యాల్ని అర్థం చేసుకోవడానికి ఆయనకు మెల్లమెల్లగా సహాయం చేయండి.

ఇవి కూడా చూడండి