కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మళ్లీ కలిసినప్పుడు

పాఠం 7

పట్టుదల చూపించండి

పట్టుదల చూపించండి

సూత్రం: ‘వాళ్లు మానకుండా బోధిస్తూ, మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.’—అపొ. 5:42.

పౌలు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 19:8-10 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. ఆసక్తి చూపించిన వాళ్లకు సహాయం చేసే విషయంలో పౌలు పట్టుదలను ఎలా చూపించాడు?

  2.  బి. ఆసక్తి చూపించిన వాళ్లను పౌలు ఎన్నిసార్లు కలిశాడు? అలా ఎంతకాలం చేశాడు?

పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. రిటన్‌ విజిట్లు బాగా చేయాలన్నా, బైబిలు స్టడీలను మొదలుపెట్టాలన్నా సమయం, కృషి అవసరం.

పౌలులా ఉందాం

3. వాళ్లకు అనుకూలమైన టైంలోనే కలవండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ వ్యక్తిని ఎప్పుడు, ఎక్కడ కలిస్తే నాతో మాట్లాడడానికి ఇష్టపడతాడు?’ మీకు అనుకూలంగా లేకపోయినా, వాళ్లు చెప్పిన టైంకే మళ్లీ కలవడానికి ప్రయత్నించండి.

4. మళ్లీ ఎప్పుడు కలవచ్చో అడగండి. మీరు మాటలు ముగించిన ప్రతీసారి, మళ్లీ ఏ టైంకి కలవచ్చో అడగండి. మీరు ఎప్పుడు, ఎక్కడ కలవాలని అనుకున్నారో ఆ టైంకి అక్కడ ఉండేలా చూసుకోండి.

5. ఆశ వదులుకోకండి. ఇంటి వ్యక్తి ఎక్కువగా ఇంట్లో ఉండడం లేదని, బాగా బిజీగా ఉంటున్నాడని మీరు గమనిస్తే ఆయనకు ఆసక్తి లేదనే ముగింపుకు రాకండి. (1 కొరిం. 13:4, 7) అయితే ఆయన్ని కలవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూనే, మీరు మీ సమయాన్ని వృథా చేసుకోకుండా జాగ్రత్తపడండి.—1 కొరిం. 9:26.