కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మళ్లీ కలిసినప్పుడు

పాఠం 9

అర్థం చేసుకుంటూ మాట్లాడండి

అర్థం చేసుకుంటూ మాట్లాడండి

సూత్రం: “సంతోషించేవాళ్లతో సంతోషించండి; ఏడ్చేవాళ్లతో ఏడ్వండి.”—రోమా. 12:15.

యేసు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా మార్కు 6:30-34 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. యేసు, ఆయన అపొస్తలులు ఎందుకు “ఏకాంత ప్రదేశానికి బయలుదేరారు”?

  2.  బి. ప్రజలకు బోధించడానికి యేసును ఏది కదిలించింది?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం ప్రజల్ని నిజంగా పట్టించుకుంటాం కాబట్టే మంచివార్తను ప్రకటిస్తాం.

యేసులా ఉందాం

3. శ్రద్ధగా వినండి. ఎదుటి వ్యక్తి తన మనసులో ఉన్నదంతా చెప్పేలా అవకాశం ఇవ్వండి. మాటల మధ్యలో కలుగజేసుకోకండి. వాళ్ల ఫీలింగ్స్‌ని, బాధల్ని, అభిప్రాయాల్ని కొట్టిపారేసినట్టు మాట్లాడకండి. మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా వింటారో వాళ్ల ఆలోచనలకు విలువిస్తున్నారని చూపిస్తారు.

4. ఆసక్తి చూపించిన వ్యక్తి గురించి ఆలోచించండి. ఆయన మాటల్ని బట్టి ఈ ప్రశ్నలు వేసుకోండి:

  1.   ఎ. ‘ఈ వ్యక్తి సత్యం తెలుసుకోవడం ఎందుకు అవసరం?’

  2.  బి. ‘బైబిలు స్టడీ తీసుకోవడం వల్ల ఇప్పుడు అలాగే భవిష్యత్తులో, ఆయన జీవితం ఎలా మెరుగౌతుంది?’

5. ఆయనకు సహాయం చేయగలిగే విషయాల గురించి మాట్లాడండి. బైబిలు స్టడీ తీసుకోవడం వల్ల ఆయనకున్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయని, అలాగే ఉపయోగపడే సలహాల్ని పొందుతాడని వీలైనంత త్వరగా వివరించండి.

ఇవి కూడా చూడండి