కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యుల్ని చేసేటప్పుడు

పాఠం 10

కట్టుబడి ఉండండి

కట్టుబడి ఉండండి

సూత్రం: “మీకు దేవుని గురించిన మంచివార్తను చెప్పడమే కాదు, మీకోసం మా ప్రాణాల్ని కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం, ఎందుకంటే మీరు మాకు చాలా ప్రియమైనవాళ్లు.”—1 థెస్స. 2:8.

యేసు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా యోహాను 3:1, 2 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. నీకొదేము యేసును ఎందుకు రాత్రిపూట కలవాలని అనుకొనివుంటాడు?—యోహాను 12:42, 43 చూడండి.

  2.  బి. శిష్యుల్ని చేసే పనికి యేసు కట్టుబడి ఉన్నాడని ఎలా చూపించాడు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం ప్రజల్ని ప్రేమిస్తాం కాబట్టి, వాళ్లు శిష్యులు అయ్యేలా సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేస్తాం.

యేసులా ఉందాం

3. మీ బైబిలు విద్యార్థికి అనుకూలమైన టైంలో, స్థలంలో స్టడీ చేయండి. ఆయన స్టడీకి ఫలానా రోజు, ఫలానా టైంలో కుదురుతుందని చెప్పవచ్చు. ఎక్కడ స్టడీ చేస్తే ఆయన ప్రశాంతంగా వినగలడో కనుక్కోండి. పని స్థలంలోనా, ఇంట్లోనా లేదా బయట ఎక్కడైనానా? సాధ్యమైనంతవరకు ఆయన చెప్పిన టైంకి కలుసుకునేలా మీ పనుల్ని సర్దుబాటు చేసుకోండి.

4. క్రమంగా స్టడీ చేయండి. మీకు ఎప్పుడైనా స్టడీ చేయడం కుదరకపోతే ఆ వారం స్టడీ మానేయకండి. బదులుగా ఇలా ప్రశ్నించుకోండి:

  1.   ఎ. ‘ఈ వారంలో వేరే రోజు స్టడీ చేయడం నాకు కుదురుతుందా?’

  2.  బి. ‘ఫోన్‌లో లేదా వీడియో కాల్‌లో స్టడీ చేయడం కుదురుతుందా?’

  3.  సి. ‘వేరే బ్రదర్‌ లేదా సిస్టర్‌ స్టడీ చేసేలా ఏర్పాటు చేయగలనా?’

5. సరిగ్గా ఆలోచించేలా సహాయం చేయమని ప్రార్థించండి. ఒకవేళ మీ బైబిలు విద్యార్థి క్రమంగా స్టడీ తీసుకోకపోయినా, లేదా నేర్చుకున్నవాటిని వెంటనే పాటించకపోయినా మీరు శిష్యుల్ని చేసే పనికి కట్టుబడి ఉంటూ, మీ విద్యార్థి మీద ఆశ వదులుకోకుండా ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. (ఫిలి. 2:13) ఖచ్చితంగా మీ బైబిలు విద్యార్థిలో ఎన్నో మంచి లక్షణాలు ఉండి ఉంటాయి; వాటిమీద దృష్టి పెట్టేలా సహాయం చేయమని ప్రార్థించండి.

ఇవి కూడా చూడండి