కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యుల్ని చేసేటప్పుడు

పాఠం 11

సులభంగా అర్థమయ్యేలా మాట్లాడండి

సులభంగా అర్థమయ్యేలా మాట్లాడండి

సూత్రం: “మీరు సులభంగా అర్థమయ్యే మాటలు మాట్లాడకపోతే మీరేం చెప్తున్నారో ఎవరికైనా ఎలా తెలుస్తుంది?”—1 కొరిం. 14:9.

యేసు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా మత్తయి 6:25-27 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. యెహోవాకు మనపట్ల ఉన్న శ్రద్ధ గురించి చెప్పడానికి యేసు ఏ ఉదాహరణను ఉపయోగించాడు?

  2.  బి. పక్షుల గురించి యేసుకు చాలా విషయాలు తెలిసినా, ఆయన వాటన్నిటి గురించి ఎందుకు చెప్పలేదు? అది మంచి పద్ధతి అని ఎందుకు చెప్పవచ్చు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం సులభంగా అర్థమయ్యేటట్టు బోధిస్తే ప్రజలు మనం చెప్పేవి గుర్తుంచుకుంటారు, మనం వాళ్ల హృదయాన్ని చేరుకుంటాం.

యేసులా ఉందాం

3. మరీ ఎక్కువ మాట్లాడకండి. ఒక విషయం గురించి మీకు తెలిసిందంతా చెప్పే బదులు స్టడీ పుస్తకంలో ఉన్న సమాచారం మీదే మనసుపెట్టండి. ఒక ప్రశ్న అడిగాక విద్యార్థి జవాబు చెప్పేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడండి. ఆయన బైబిలు బోధలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న విషయం ఏదైనా చెప్తే లేదా ఆయనకు జవాబు తెలియకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొన్ని ప్రశ్నలు వేయండి. మీ విద్యార్థికి ముఖ్యాంశం అర్థమైతే చాలు, ముందుకెళ్లండి.

4. మీ విద్యార్థికి అప్పటికే తెలిసిన విషయాల్ని ఉపయోగించి కొత్త విషయాలు అర్థం చేసుకునేలా సహాయం చేయండి. ఉదాహరణకు పునరుత్థానం గురించిన పాఠం మొదలుపెట్టే ముందు, చనిపోయినవాళ్ల పరిస్థితి గురించి మీ విద్యార్థి అప్పటికే నేర్చుకున్న వాటిని మళ్లీ గుర్తుచేయండి.

5. ఉదాహరణల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఒక ఉదాహరణను ఉపయోగించే ముందు ఇలా ప్రశ్నించుకోండి:

  1.   ఎ. ‘ఈ ఉదాహరణ సింపుల్‌గానే ఉందా?’

  2.  బి. ‘నా విద్యార్థికి ఇది సులభంగానే అర్థమౌతుందా?’

  3.  సి. ‘దీన్ని ఉపయోగిస్తే నా విద్యార్థి కేవలం ఉదాహరణే కాకుండా, ముఖ్యాంశాన్ని కూడా గుర్తుంచుకోగలుగుతాడా?’

ఇవి కూడా చూడండి