కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం B

మాట్లాడడం ఎప్పుడు ఆపేయాలి?

మాట్లాడడం ఎప్పుడు ఆపేయాలి?

“శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లతో మనం మాట్లాడాలనుకుంటాం కాబట్టి, ఎవరైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే లేదా ఏదైన ప్రశ్న అడిగితే మనం వాళ్లతో మాట్లాడడానికి ఎంతో సంతోషిస్తాం.—అపొ. 13:48.

కానీ ఎదుటి వ్యక్తి కోప్పడితే, వాదనకు దిగితే లేదా ఆ సమయంలో మాట్లాడడానికి ఇష్టపడకపోతే అప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా, దయగా ఉంటూ మాట్లాడడం ఆపేయండి. (సామె. 17:14) ఆయన మీద గౌరవం చూపిస్తూ, మంచిగా అక్కడ నుండి వచ్చేయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే ముందుముందు అతను మనతో మాట్లాడడానికి ఇష్టపడవచ్చు.—1 పేతు. 2:12.