కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం C

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు స్టడీ ఎలా చేయాలి?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు స్టడీ ఎలా చేయాలి?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ఏ విషయాలు చేర్చాలో నిర్ణయించేటప్పుడు సహోదరులు ఎంతో ప్రార్థించారు, పరిశోధన చేశారు. ఆ ప్రచురణ నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే బైబిలు స్టడీ చేసేటప్పుడు కింద ఇచ్చిన సలహాలను పాటించండి.

స్టడీ చేసేముందు

  1. 1. బాగా సిద్ధపడండి. అలా చేస్తున్నప్పుడు మీ విద్యార్థి అవసరాలు, పరిస్థితులు, నమ్మకాల గురించి ఆలోచించండి. ఆయనకు ఏ విషయాలు అర్థం చేసుకోవడానికి లేదా పాటించడానికి కష్టంగా ఉంటాయో ముందే ఊహించుకోండి. “ఇవి కూడా చూడండి” అనే భాగంలో ఉన్న సమాచారం మీ విద్యార్థికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి. అవసరాన్ని బట్టి దాన్ని స్టడీ చేసేటప్పుడు కూడా ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి.

స్టడీ చేస్తున్నప్పుడు

  1. 2. విద్యార్థి ఒప్పుకుంటే స్టడీ ఆరంభంలో, ముగింపులో ప్రార్థన చేయండి.

  2. 3. మీరే ఎక్కువగా మాట్లాడకుండా చూసుకోండి. ఇచ్చిన సమాచారం మీదే దృష్టి పెట్టండి. విద్యార్థిని తన మనసులో ఉన్నదంతా చెప్పనివ్వండి.

  3. 4. ఏదైన కొత్త సెక్షన్‌ మొదలుపెట్టేటప్పుడు, దానికి సంబంధించిన ముఖ్యాంశాన్ని చదివి, కొన్ని పాఠాల పేర్లను చెప్పండి.

  4. 5. ఏదైన ఒక సెక్షన్‌ని పూర్తి చేసిన తర్వాత, ఆ సెక్షన్‌కు సంబంధించిన “. . . మీరేం నేర్చుకున్నారు?” భాగాన్ని ఉపయోగించి మీ విద్యార్థి నేర్చుకున్న సత్యాల్ని గుర్తుంచుకునేలా సహాయం చేయండి.

  5. 6. మీ విద్యార్థితో మీరు ఒక్కో పాఠాన్ని స్టడీ చేస్తుండగా . . .

    • పేరాలన్నిటినీ చదవాలి.

    • “చదవండి” అని ఉన్న లేఖనాలన్నిటినీ చదవాలి.

    • అవసరాన్ని బట్టి ఉల్లేఖించిన మిగతా లేఖనాల్ని కూడా చదవొచ్చు.

    • “వీడియో చూడండి” అని ఉన్న ప్రతీచోట వీడియోను చూపించండి (మీకు అందుబాటులో ఉంటే).

    • ఇచ్చిన ప్రతీ ప్రశ్న అడగండి.

    • “ఎక్కువ తెలుసుకోండి” అనే భాగంలో ఉన్న బొమ్మల్ని చూపించి, వాటి మీద తన అభిప్రాయాన్ని చెప్పమని విద్యార్థిని అడగండి.

    • మీ విద్యార్థి తన ఆధ్యాత్మిక ప్రగతిని గుర్తించడానికి, “ఇలా చేసి చూడండి” అనే బాక్సును ఉపయోగించండి. అందులో ఇచ్చిన లక్ష్యాన్ని గానీ, ఇంకా ఏదైన లక్ష్యాన్ని గానీ, లేదా రెండిటినీ చేరుకోమని ఆయన్ని ప్రోత్సహించండి.

    • మీ విద్యార్థి స్టడికీ సిద్ధపడేటప్పుడు, తనకు “ఇవి కూడా చూడండి” అనే భాగంలో ఏ ఆర్టికల్‌ లేదా ఏ వీడియో నచ్చిందో అడగండి.

    • ఒక పాఠాన్ని ఒకేసారి పూర్తిచేయడానికి ప్రయత్నించండి.

స్టడీ తర్వాత

  1. 7. మీ విద్యార్థి గురించి ఆలోచిస్తూ ఉండండి. మీ విద్యార్థి ప్రగతిని దీవించమని, తనకు ఎలా సహాయం చేయాలో మీకు అర్థమయ్యేలా తెలివిని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి.