కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆహ్వానితులకు సమాచారం

ఆహ్వానితులకు సమాచారం

అటెండెంట్లు: అటెండెంట్లు ఉన్నది మీకు సహాయం చేయడానికే. పార్కింగ్‌, సీట్లు పెట్టుకోవడం, హాలు లోపలికి వెళ్లడం-బయటికి రావడం వంటివాటి గురించి వాళ్లు నిర్దేశాలిస్తారు. దయచేసి వాళ్లకు పూర్తిగా సహకరించండి.

బాప్తిస్మం: ప్రత్యేకించి చెప్తే తప్ప, బాప్తిస్మం తీసుకునేవాళ్లకు మెయిన్‌ హాలులో స్టేజీ ముందు భాగంలో సీట్లు కేటాయించబడతాయి. శనివారం ఉదయం బాప్తిస్మ ప్రసంగం మొదలవ్వడానికి ముందే వాళ్లు ఆ సీట్లలో కూర్చోవాలి. ప్రతీ ఒక్కరు తమ టవల్‌ను, నీళ్లలో దిగేటప్పుడు వేసుకోవడానికి మర్యాదగా ఉండే బట్టల్ని తెచ్చుకోవాలి.

విరాళాలు: ఈ సమావేశంలో అందరికీ సరిపడా సీట్లు, సౌండ్‌ సిస్టమ్‌, వీడియో, వేరే చాలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. మనం ఈ సమావేశాన్ని ఆనందించడానికి, యెహోవాకు ఇంకా దగ్గరవ్వడానికి అవి సహాయం చేస్తాయి. ఆ ఏర్పాట్లన్నిటికి ఎంతో డబ్బు ఖర్చయింది. మీరు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు ఈ ఖర్చులకే కాక, ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వడానికి కూడా ఉపయోగపడతాయి. తేలిగ్గా గుర్తుపట్టగలిగే విరాళాల పెట్టెలు హాలులో అక్కడక్కడ ఉంచబడ్డాయి. అయితే, donate.pr418.com ద్వారా ఆన్‌లైన్‌లో విరాళం ఇవ్వడం మీకు వీలౌతుందేమో చూడండి. మీ విరాళాలకు ఎంతో మెచ్చుకుంటున్నాం. రాజ్య సంబంధ పనులకు ఉదారంగా మద్దతిస్తున్నందుకు పరిపాలక సభ మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది.

ప్రథమ చికిత్స: ఇది అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమేనని దయచేసి గుర్తుంచుకోండి.

పోగొట్టుకున్నవి-దొరికినవి: వేరేవాళ్ల వస్తువులేమైనా మీకు దొరికితే, వాటిని ఈ విభాగానికి తెచ్చి ఇవ్వండి. ఒకవేళ మీరేదైనా పోగొట్టుకుంటే, ఈ విభాగానికి వెళ్లి చూసుకోండి. తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన పిల్లల్ని ఈ విభాగానికి తీసుకెళ్లాలి. అయితే, ఎవరికీ అనవసరంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, దయచేసి మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకొని, జాగ్రత్తగా చూసుకోండి.

సీట్లు: దయచేసి ఇతరుల గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీతోపాటు మీ వాహనంలో వచ్చేవాళ్ల కోసం, మీ ఇంట్లో ఉంటున్నవాళ్ల కోసం, లేదా మీ స్టడీవాళ్ల కోసం సీట్లు ఆపుకోవచ్చు. దయచేసి మీకు అవసరంలేని సీట్లలో ఏమీ పెట్టకండి.

స్వచ్ఛంద సేవ: సమావేశ ఏర్పాట్లకు సంబంధించిన పనుల్లో సహాయం చేయాలని ఇష్టపడుతుంటే, దయచేసి సమాచార-స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి.

యెహోవాసాక్షుల పరిపాలక సభ ఏర్పాటు చేసింది

© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania