కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెహోవాను “ఆత్మతో” ఆరాధించడమంటే ఏమిటి?

సుఖారను ఊరి దగ్గరున్న యాకోబు బావిలో నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఒక సమరయ స్త్రీకి సాక్ష్యమిచ్చేటప్పుడు, యేసు క్రీస్తు ఇలా చెప్పాడు: “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలె[ను].” (యోహాను 4:​24) సత్యారాధన “సత్యముతో” అర్పించబడాలి, అంటే యెహోవా దేవుడు బైబిలులో తన గురించీ తన సంకల్పాల గురించీ ఏమి తెలియజేశాడో దానికి అనుగుణంగా ఉండాలి. మనం దేవునికి చేసే సేవ ఆత్మతో కూడా చేసేదై ఉండాలి అంటే, ప్రేమ విశ్వాసాల నిండు హృదయంతో ప్రేరేపించబడి అత్యాసక్తితో చేసేదై ఉండాలి. (తీతు 2:​14) అయితే, ‘దేవుడ్ని ఆత్మతో ఆరాధించాలన్న’ యేసు వ్యాఖ్యానం, మనం యెహోవాను ఎలాంటి మానసిక దృక్పథంతో సేవిస్తామనే దాని కంటే ఇంకా ఎక్కువైన దానికి వర్తిస్తుందని సందర్భం చూపిస్తోంది.

బావి వద్ద ఆస్త్రీతో యేసు చేసిన చర్చ, ఆరాధనలో ఉత్సాహం ఉందా లేదా అన్నదాని గురించి కాదు. అబద్ధ ఆరాధనను కూడా అత్యాసక్తితో, భక్తితో చేయవచ్చు. భౌతిక స్థలాలైన సమరయలోని ఒక పర్వతం మీదగానీ లేక యెరూషలేములోని ఆలయంలోగానీ, తండ్రి ఆరాధించబడడని చెప్పిన తర్వాత, దేవుని నిజమైన స్వభావంపై ఆధారపడిన క్రొత్త ఆరాధనా విధానాన్ని యేసు సూచించాడు. (యోహాను 4:​21) “దేవుడు ఆత్మ స్వరూపి” అని ఆయన చెప్పాడు. (యోహాను 4:​24, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) సత్య దేవుడు పదార్థం కాదు గనుక ఆయనను చూడడం లేక స్పర్శించడం సాధ్యంకాదు. ఆయన ఆరాధన ఒక భౌతిక ఆలయం లేక పర్వతం చుట్టూ పరిభ్రమించదు. కాబట్టి, కంటికి కనిపించే వాటిని మించివుండే ఆరాధనలోని ఒక అంశాన్ని యేసు సూచించాడు.

అంగీకృతమైన ఆరాధన సత్యముతో చేసేదే గాక, దేవుని అదృశ్య చురుకైన శక్తి అయిన పరిశుద్ధాత్మచే నడిపించబడేదై కూడా ఉండాలి. “[పరిశుద్ధ] ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు” అని వ్రాశాడు అపొస్తలుడైన పౌలు. “దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము” అని కూడా ఆయన జత చేశాడు. (1 కొరింథీయులు 2:​8-12) అంగీకృతమైన విధంగా దేవుడ్ని ఆరాధించడానికి, మనకు ఆయన పరిశుద్ధాత్మ తోడై ఉండాలి, దానిచే మనం నడిపించబడాలి. అంతేగాక, మన ఆత్మ లేక మానసిక దృక్పథం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దాన్ని అన్వయించుకోవడం ద్వారా దేవుని ఆత్మతో శృతిచేయబడినదై ఉండడం ఆవశ్యకం.

[28వ పేజీలోని చిత్రం]

దేవుడ్ని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించండి