కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞాపకముంచుకోవలసిన రోజు

జ్ఞాపకముంచుకోవలసిన రోజు

జ్ఞాపకముంచుకోవలసిన రోజు

శాశ్వత ఆశీర్వాదాలను అనుభవించే నిరీక్షణనిస్తూ మానవజాతి భవిష్యత్తును పూర్తిగా మార్చివేసిన రోజు అది. చరిత్రలోని మరే ఇతర రోజూ మానవజాతి భవిష్యత్తును అంతగా ప్రభావితం చెయ్యలేదు. యేసు ఏ పనులను చేయడానికి భూమ్మీదకు వచ్చాడో వాటన్నింటినీ పూర్తి చేసిన రోజది. హింసా కొయ్యకు మేకులతో కొట్టబడిన ఆయన తుది శ్వాస తీసుకొని ‘సమాప్తమైనది!’ అని బిగ్గరగా అన్నాడు. (యోహాను 19:​30) యేసు ఏ సంకల్పం కోసం భూమ్మీదకు వచ్చాడు?

“మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చె[ను]” అని బైబిలు చెబుతోంది. (మత్తయి 20:​28) వారసత్వంగా సంక్రమించిన పాపమరణాల నుండి మానవజాతిని రక్షించడానికి యేసు తన ప్రాణాన్ని లేదా జీవితాన్ని అర్పించాడు. నిజమే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:​16) యేసు బలి ఎంత విలువైన ఏర్పాటో కదా!

యేసు మరణించిన దినమును జ్ఞాపకముంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఆ రోజున, దేవుని కుమారుడు తన అపొస్తలులు నమ్మకంగా ఉండేందుకు వారికి సహాయపడే విలువైన పాఠాలను నేర్పించాడు. ఆయన మాట్లాడిన చివరి మాటలు ఆ శిష్యుల హృదయాలను ఎంతగా కదిలించివుంటాయో కదా! ఆయన ఏమి బోధించాడు? యేసు వారికి బోధించిన దాని నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? ఈ ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.