కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గ్రాడ్యుయేషన్‌ రోజు—అదొక మనోహరమైన రోజు

గ్రాడ్యుయేషన్‌ రోజు—అదొక మనోహరమైన రోజు

గ్రాడ్యుయేషన్‌ రోజు​—⁠అదొక మనోహరమైన రోజు

“ఈరోజెంతో మనోహరం. నీలాకాశంలో సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. తివాచీలా ఉన్న పచ్చని గడ్డి. పక్షుల కిలకిలరావాలు. ఇది నిజంగా మనోహరమైన రోజు, ఈ రోజు మనకు ఆశాభంగం కలుగదు. యెహోవా దేవుడు ఆశాభంగం కలిగించే దేవుడు కాదు. ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు.”

ఈ మాటలతో యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు సామ్యుల్‌ హెర్డ్‌, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 117వ తరగతి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది సెప్టెంబరు 11, 2004. ఆ కార్యక్రమంలో క్షేమాభివృద్ధికరమైన బైబిలు ఆధారిత ఉపదేశంతోపాటు ఇప్పటి గిలియడ్‌ పాఠశాల విద్యార్థుల మరియు మిషనరీల అనుభవాలు చేర్చబడ్డాయి. అవును, న్యూయార్క్‌లోని, ప్యాటర్సన్‌లో వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో హాజరైన, ఆడియో వీడియో లింకు ద్వారా బ్రూక్లిన్‌ మరియు వాల్‌కిల్‌ భవన సముదాయాల్లో సమావేశమైన మొత్తం 6,974 మందికి అది నిజంగా మనోహరమైన రోజు.

విద్యార్థులను ప్రోత్సహించే మాటలు

అమెరికా బ్రాంచి కమిటీ సభ్యునిగా ఉన్న జాన్‌ కీకాట్‌ “మిషనరీగా ఆనందాన్ని కాపాడుకోండి” అనే మూలాంశం ఆధారంగా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు. ఈ గ్రాడ్యుయేషన్‌ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్నట్లే, గిలియడ్‌ విద్యార్థులు తమ ఆనందానికి పేరుగాంచారని ఆయన అన్నాడు. ఆ పాఠశాల కాలంలో ఇవ్వబడిన లేఖనాధార ఉపదేశం విద్యార్థులకు ఆనందాన్నిచ్చింది, కాగా ఇతరులు కూడా అదే విధమైన ఆనందం అనుభవించేందుకు సహాయం చేయగల స్థితిలో వారు ఉన్నారు. ఎలా? మిషనరీలుగా తమ పరిచర్యలో శాయశక్తులా పనిచేయడం ద్వారానే. యేసు ఇలా చెప్పాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) కొత్త మిషనరీలు ఇతరులకు సత్యాన్ని అందజేసే ఉదారుడు, “సంతోషంగా ఉండే దేవుడు” అయిన యెహోవాను అనుకరిస్తుండగా, తమ సొంత ఆనందాన్ని కాపాడుకోగలుగుతారు.​—⁠1 తిమోతి 1:​11, NW.

ఆ కార్యక్రమంలో తర్వాత, పరిపాలక సభ మరో సభ్యుడైన డేవిడ్‌ స్‌ప్లేన్‌ “మీరు స్నేహపూర్వకంగా ఎలా సర్దుకుపోతారు?” అనే మూలాంశం మీద మాట్లాడాడు. ఐకమత్యం కలిగివుండడం నిస్సందేహంగా మేలైనదీ, ఆహ్లాదకరమైనదీ అయినప్పటికీ, అలా ఉండడానికి “అందరికి అన్నివిధముల” వారమై ఉండడం అవసరం. (1 కొరింథీయులు 9:22; కీర్తన 133:⁠1) పట్టభద్రులవుతున్న విద్యార్థులు తమ మిషనరీ సేవలో ఇతరులనేకులతో అంటే క్షేత్రంలోని ప్రజలతో, తోటి మిషనరీలతో, తమ కొత్త సంఘంలోని సహోదర సహోదరీలతో, ప్రకటనా బోధనా పనిని నిర్దేశించే బ్రాంచి కార్యాలయంతో వ్యవహరించవలసి ఉంటుందని సహోదరుడు స్‌ప్లేన్‌ పేర్కొన్నారు. ప్రజలతో సాధ్యమైనంత మేరకు ఆహ్లాదకరమైన సంబంధాలను ఎలా నెలకొల్పుకోవచ్చనే విషయంపై ఆయన ఆచరణాత్మక సూచనలు ఇచ్చారు, అవేమిటంటే స్థానిక భాష నేర్చుకోవడం, స్థానిక ఆచారాలకు తగ్గట్టు తమను మలుచుకోవడం, తోటి మిషనరీల ఏకాంతాన్ని గౌరవించడం, సారథ్యం వహిస్తున్న వారికి లోబడడం.​—⁠హెబ్రీయులు 13:17.

తర్వాత, గిలియడ్‌ ఉపదేశకుడైన లారెన్స్‌ బౌవెన్‌ “మీరేమి తలంచుచున్నారు?” అని ప్రశ్నించారు. ‘వెలిచూపునుబట్టి తీర్పు తీర్చినవారు’ యేసును మెస్సీయగా అంగీకరించలేదని ఆయన విద్యార్థులకు గుర్తుచేశాడు. (యోహాను 7:​24) అపరిపూర్ణ మానవులముగా మనమందరం ‘దేవుని సంగతులను తలంచకుండా, మనుష్యుల సంగతులను తలంచే’ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. (మత్తయి 16:​22, 23) ఆధ్యాత్మిక ప్రజలుకూడా తమ తలంపులను ఎల్లప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. సముద్రంలోవున్న ఓడలాగే, ఇప్పుడు చేసుకునే సర్దుబాట్ల వల్లనే గమ్యం చేరుకోవడమో ఆధ్యాత్మిక ఓడ బద్దలుకావడమో జరుగుతుంది. ఎల్లవేళలా బైబిలు అధ్యయనం చేస్తూ, చదివినదాని సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవడం, “దేవుని సంగతులను” తలంచడానికి మనకు సహాయం చేస్తాయి.

గిలియడ్‌ పాఠశాల మరో ఉపదేశకుడైన వాలెస్‌ లివరెన్స్‌ కార్యక్రమంలోని ఈ భాగాన్ని ముగించారు. “మీరేమి కొంటారు” అనే ఆయన మూలాంశం యెషయా 55:1 మీద ఆధారపడింది. మన కాలం కోసం ఇవ్వబడిన దేవుని ప్రవచనార్థక సందేశం నుండి కలిగే ఉపశమనాన్ని, ఆనందాన్ని, పోషణను ‘కొనండి’ అని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. యెషయా ప్రవచనం దేవుని వాక్యాన్ని నీటికి, ద్రాక్షారసానికి, పాలకు పోల్చింది. “రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే” దానిని ఎలా కొనవచ్చు? బైబిలు ప్రవచనానికి అవధానమిస్తూ, లేఖనరహిత తలంపుల, మార్గాల స్థానంలో దేవుని తలంపులను, మార్గాలను అలవరచుకోవడం ద్వారా మనమలా చేయవచ్చని సహోదరుడు లివరెన్స్‌ వివరించారు. (యెషయా 55:2, 3, 6, 7) ఇలా చేయడం ద్వారా కొత్త మిషనరీలు తమ విదేశీ నియామకాల్లో నిలదొక్కుకోగలుగుతారు. అపరిపూర్ణ మానవులు భౌతిక సుఖం కోసం పాటుపడడం మీదే సంతోషం ఆధారపడి ఉందని తరచూ అనుకుంటారు. “అలా అనుకోకండి, అలాంటి ఆలోచనకు తావివ్వకండి. దేవుని ప్రవచన వాక్యాన్ని అర్థవంతంగా అధ్యయనం చేయడానికి తప్పకుండా సమయం కేటాయించండి. అది మిమ్మల్ని ఉత్తేజపరచి, బలపరచడమే కాక, మీ మిషనరీ నియామకంలో ఆనందాన్నిస్తుంది.”

ఉల్లాసవంతమైన విద్యార్థుల అనుభవాలు, ఇంటర్వ్యూలు

విద్యార్థులు క్రమంగా ప్రకటనా పనిలో భాగం వహించారు. గిలియడ్‌ మరో ఉపదేశకుడైన మార్క్‌ న్యూమర్‌ సారథ్యంలో చాలామంది విద్యార్థులు ‘సువార్తను గూర్చి సిగ్గుపడడం లేదు’ అనే అంశాన్ని నొక్కిచెప్పిన అనుభవాలను పునర్నటించి చూపించారు. (రోమీయులు 1:​16) అనుభవజ్ఞులైన ఈ పరిచారకులు ఇంటింటా, వీధిలో, దుకాణ కేంద్రాల దగ్గర ఎలా సాక్ష్యమిచ్చారో విని ప్రేక్షకులు ఆనందించారు. ఇతర భాషలు తెలిసిన విద్యార్థులు తమ సంఘ క్షేత్రాల్లో ఆ భాషలు మాట్లాడే ప్రజలను కలిసేందుకు చొరవ తీసుకున్నారు. ఇతరులు యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు ఆధారిత సాహిత్యాలను పునర్దర్శనాల్లో, గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించడంలో చక్కగా ఉపయోగించుకున్నారు. సువార్తను ప్రకటించడానికి వారు ‘సిగ్గుపడలేదు.’

సేవా విభాగానికి నియమించబడిన విలియం నాన్కీస్‌ అనే సహోదరుడు బుర్కీనా ఫాసో, లాట్వియా, రష్యాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన మిషనరీలను ఇంటర్వ్యూ చేశాడు. “నమ్మకస్థులకు యెహోవా ప్రేమపూర్వక ప్రతిఫలమిస్తాడు” అనే అంశంపై ఆధారపడిన ఆచరణాత్మక సలహాను వారు పంచుకున్నారు. ఇంటర్వ్యూ చేయబడిన ఒక సహోదరుడు, 300 మంది సైనికులున్న గిద్యోను సైన్యాన్ని గుర్తుంచుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించాడు. గిద్యోను తలపెట్టిన యుద్ధంలో విజయానికి తోడ్పడే నియామకం ప్రతీ సైనికునికి ఇవ్వబడింది. (న్యాయాధిపతులు 7:19-21) ఆ ప్రకారమే, తమ నియామకాల్లో నిలిచివుండే మిషనరీలకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది.

ఆ తర్వాత ప్యాటర్సన్‌లో ఉపదేశకునిగా ఉన్న సామ్యుల్‌ రాబర్సన్‌ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో “అందరికి అన్నివిధముల వారైవుండండి” అనే మూలాంశం నొక్కిచెప్పబడింది. ఆయన సెనెగల్‌, గువామ్‌, లైబీరియా, మడగాస్కర్‌ల నుండి వచ్చిన నలుగురు బ్రాంచి కమిటీ సభ్యులను ఇంటర్వ్యూ చేశాడు. ఈ దేశాల్లో మొత్తం 170 మంది మిషనరీలు సేవచేస్తున్నారు. కొత్త మిషనరీలు తమ నియామకాలకు తగ్గట్టు తమను తాము మలుచుకోవడంలో బ్రాంచి కమిటీలు ఎలా సహాయం చేస్తాయో పట్టభద్రులవుతున్న విద్యార్థులు, ఆ వ్యాఖ్యానాల నుండి తెలుసుకున్నారు. పాశ్చాత్య ప్రమాణాలకు కొత్తగా వింతగా అనిపించే ఆచారాలను నేర్చుకోవడమని దానర్థం. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో క్రైస్తవ సంఘంలోని వారితోసహా పురుషులు నడిచి వెళ్లేటప్పుడు స్నేహితుల్లా చేతులు పట్టుకుని నడవడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. గువామ్‌ బ్రాంచి ఆధ్వర్యంలోని కొన్ని ప్రాంతాల్లో, అసాధారణ ఆహారం అందించబడుతుంది. ఇతరులు సర్దుబాట్లు చేసుకున్నారు, కొత్త మిషనరీలు కూడా అలాగే చేయవచ్చు.

పరిపాలక సభ సభ్యుడైన గై పియర్స్‌ “‘మన ప్రభువు రాజ్యం’ విషయంలో విశ్వసనీయంగా ఉండండి” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ప్రేక్షకులకు ఇలా గుర్తుచేశారు: “యెహోవా ఒక ఉద్దేశంతోనే సృష్టిని చేశాడు. తన సృష్టి విషయంలో ఆయనకు ఒక సంకల్పముంది. ఈ భూగోళంపట్ల ఆయనకున్న సంకల్పం మారలేదు. అది నిరాటంకంగా దాని నెరవేర్పువైపుకు సాగుతుంది. ఏదీ దానిని మార్చలేదు.” (ఆదికాండము 1:28) మొదటి మానవుడైన ఆదాము పాపం కారణంగా వచ్చిన కష్టాల మధ్యకూడా దేవుని సర్వాధిపత్యానికి విశ్వసనీయంగా లోబడమని సహోదరుడు పియర్స్‌ అందరినీ ప్రోత్సహించాడు. “మనం తీర్పు గడియలో జీవిస్తున్నాం. యథార్థ హృదయులు సత్యం తెలుసుకునేలా సహాయం చేయడానికి మనకు కొద్ది సమయమే మిగిలివుంది. ఇతరులకు రాజ్య సువార్త ప్రకటించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి” అని సహోదరుడు పియర్స్‌ ఉద్బోధించాడు. దేవుని రాజ్యానికి యథార్థంగా మద్దతునిచ్చేవారికి ఆయన తోడ్పాటు తప్పకుండా ఉంటుంది.​—⁠కీర్తన 18:25.

చివరిగా ఛైర్మన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల నుండి వచ్చిన శుభాకాంక్షలు, అభినందనలు చదివి వినిపించారు. ఆ తర్వాత పట్టభద్రులవుతున్న విద్యార్థులకు ఆయన డిప్లొమాలు అందజేశారు, గిలియడ్‌ విద్యార్థి ఒకరు తాము పొందిన శిక్షణపట్ల తమ హృదయపూర్వక కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేసే ఉత్తరం చదివారు. హాజరైన వారందరూ ఎంతో కాలంపాటు గుర్తుంచుకునే అత్యంత మనోహరమైన ఆ రోజు అలా సముచితంగానే ముగిసింది.

[23వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు 

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 11

పంపించబడిన దేశాల సంఖ్య: 22

విద్యార్థుల సంఖ్య: 48

సగటు వయస్సు: 34.8

సత్యంలో సగటు సంవత్సరాలు: 18.3

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 13.4

[24వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 117వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు పేర్కొనబడ్డాయి.

(1) థాంప్సన్‌, ఇ.; నోర్వెల్‌, జి.; పావెల్‌, టి.; కోజా, ఎమ్‌.; మకెంటైర్‌, టి. (2) రైలీ, ఎ.; క్లేటన్‌, సి.; ఆలెన్‌, జె.; బ్లాంకో, ఎ.; మూన్‌యోస్‌, ఎల్‌.; రుస్తాడ్‌, ఎన్‌. (3) గొరేరో, జెడ్‌.; గార్సియె, కె.; మెకెర్లీ, డి.; ఇషికావా, టి.; బ్లాంకో, జి. (4) మకెంటైర్‌, ఎస్‌.; క్రూస్‌, ఇ.; గొరేరో, జె.; రిచీ, ఓ.; అవెలెనిడే, ఎల్‌.; గార్సియె, ఆర్‌. (5) పావెల్‌, జి.; ఫిస్కా, హెచ్‌.; మూన్యోస్‌, వి.; బామాన్‌, డి.; షా, ఎస్‌.; బ్రౌన్‌, కె.; బ్రౌన్‌, ఎల్‌. (6) షా, సి.; రైలీ, ఎ.; పలోక్విన్‌, సి.; మ్యూంక్‌, ఎన్‌.; మెకెర్లీ, డి.; ఇషికావా, కె. (7) మ్యూంక్‌, ఎమ్‌.; పలోక్విన్‌, జె.; కోజా, టి.; అవెలెనిడే, ఎమ్‌.; ఆలెన్‌, కె.; రిచీ, ఇ.; నోర్వెల్‌, టి. (8) క్రూస్‌, జె.; బామాన్‌, హెచ్‌.; క్లేటన్‌, జెడ్‌.; ఫిస్కా, ఇ.; థాంప్సన్‌, ఎమ్‌.; రుస్తాడ్‌, జె.