కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అమూల్యమైన రక్తముచేత” విముక్తిచేయబడ్డాం

“అమూల్యమైన రక్తముచేత” విముక్తిచేయబడ్డాం

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”

“అమూల్యమైన రక్తముచేత” విముక్తిచేయబడ్డాం

యెహోవా తన ఏకైక కుమారుడు తన పరిపూర్ణ మానవప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించడానికి పంపించడం ఆయన ప్రేమకు సంబంధించిన గొప్ప క్రియ. పాపులమైన మనకు అలాంటి విమోచన ఎంతో అవసరం, ఎందుకంటే ఏ అపరిపూర్ణ మానవుడూ “ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు.” (కీర్తన 49:​6-9) కాబట్టి, దేవుడు “తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి[నందుకు]” మనం దేవునికి ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా!​—⁠యోహాను 3:​16.

విమోచన క్రయధనం మనకెలా విముక్తి కలిగిస్తుంది? యెహోవా దేవుని ప్రేమకు సంబంధించిన ఈ గొప్ప క్రియ ఫలితంగా మనం ఏ నాలుగు విధాలుగా విముక్తి పొందుతామో పరిశీలిద్దాం.

విమోచన క్రయధనం ద్వారా విముక్తి

మొదటిగా యేసు బలి, వారసత్వంగా వచ్చిన పాపం నుండి మనల్ని విముక్తుల్ని చేయగలదు. మనందరం పాపంలో జన్మించాం. మనం యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించగలిగే ముందే పాపులం. ఎలా? రోమీయులు 5:​12 ఇలా చెబుతోంది: ‘ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది.’ పాపభరితుడైన ఆదాము సంతానంగా మనం అతని అపరిపూర్ణ స్థితిని వారసత్వంగా పొందాం. అయితే విమోచన క్రయధనం చెల్లించబడింది కాబట్టి, వారసత్వంగా వచ్చిన పాపపు ఉచ్చు నుండి విముక్తి పొందడం మనకు సాధ్యమే. (రోమీయులు 5:​16) యేసు ‘ప్రతి మనుష్యుని కోసం మరణాన్ని అనుభవించి’ ఆదాము సంతానం కోసం పాపపు పరిణామాలను భరించాడు.​—⁠హెబ్రీయులు 2:9; 2 కొరింథీయులు 5:21; 1 పేతురు 2:​24.

రెండవదిగా విమోచన క్రయధనం, పాపంవల్ల కలిగే మరణకరమైన ప్రభావాల నుండి మనల్ని విముక్తుల్ని చేయగలదు. “పాపమువలన వచ్చు జీతము మరణము.” (రోమీయులు 6:​23) పాపానికి శిక్ష మరణం. దేవుని కుమారుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా, విధేయులైన మానవజాతికి నిత్యజీవం సాధ్యమయ్యేలా చేశాడు. అవును, “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు.”​—⁠యోహాను 3:​36.

మనం దేవుని కుమారునిపట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తేనే పాపపు ప్రభావాల నుండి విముక్తి చేయబడతామనేది గమనించండి. అలా విశ్వాసాన్ని ప్రదర్శించడంలో, మన జీవితంలో మార్పులు చేసుకుని దానిని దేవుని చిత్తానికి అనుగుణంగా మలచుకోవడం ఇమిడివుంది. మనం ఏ చెడు మార్గాన్నైనా అనుసరిస్తుంటే దానిని విడిచిపెట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవాటిని చేసేందుకు చర్యతీసుకోవాలి. మనం ‘మన పాపాలు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సునొంది తిరగాలి’ అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు.​—⁠అపొస్తలుల కార్యములు 3:20.

మూడవదిగా యేసు అర్పించిన బలి, అపరాధ భావాల నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకొని ఆయన కుమారుని శిష్యులుగా మారేవారు ఉపశమనాన్ని పొందుతారు. (మత్తయి 11:​28-30) మనలో అపరిపూర్ణతలున్నా పవిత్రమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవించడంలో మనం ఎంతో ఆనందం పొందుతాం. (1 తిమోతి 3:9; 1 పేతురు 3:​21) మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం ద్వారా మనం దయ పొంది, కలవరపెట్టే మనస్సాక్షి నుండి ఉపశమనం పొందుతాం.​—⁠సామెతలు 28:​13.

సహాయాన్ని, భావినిరీక్షణను అందిస్తుంది

చివరగా, విమోచన క్రయధనంపట్ల విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారా దేవుని ఎదుట మనకున్న స్థానం గురించిన భయం నుండి విముక్తి పొందుతాం. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.” (1 యోహాను 2:⁠1) ఉత్తరవాదిగా లేక సహాయకునిగా యేసు పాత్ర గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.” (హెబ్రీయులు 7:​25) పాపపు కళంకమేదైనా మనలో ఉన్నంతవరకు దేవుని ఎదుట సరైన స్థానం కలిగివుండడంలో మనకు సహాయం చేయడానికి ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు సేవలు మనకు అవసరం. యేసు మనకోసం ప్రధానయాజకునిగా ఎలా వ్యవహరించాడు?

యేసు సా.శ. 33లో తాను పునరుత్థానం చేయబడిన నలభై దినాల తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు, అక్కడ ఆయన తన “అమూల్యమైన రక్తము”నకు సంబంధించిన విలువను దేవునికి అర్పించాడు. తత్ఫలితంగా, యేసు త్వరలో విధేయులైన మానవజాతిని పాపమరణాల నుండి విముక్తుల్ని చేస్తాడు. * (1 పేతురు 1:​18, 19) కాబట్టి, యేసుక్రీస్తు మన ప్రేమ, విధేయతలు పొందేందుకు అర్హుడని మీరు అంగీకరించరా?

అంతేగాక, యెహోవా దేవుడు కూడా మన ప్రేమ, విధేయతలు పొందేందుకు అర్హుడు. మనం విముక్తి పొందేలా ఆయన ప్రేమపూర్వకంగా “విమోచన” క్రయధనాన్ని ఏర్పాటుచేశాడు. (1 కొరింథీయులు 1:​30, 31) మనం ఇప్పటి జీవితానికే కాక, నిత్యజీవితాన్ని ఆస్వాదించే భావినిరీక్షణ విషయంలో కూడా ఆయనకు రుణపడివున్నాం. కాబట్టి, మనం ‘మనుష్యులకు కాక దేవునికే లోబడేందుకు’ ఎన్నో కారణాలున్నాయి.​—⁠అపొస్తలుల కార్యములు 5:​29.

[అధస్సూచి]

^ పేరా 12 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2006 (ఆంగ్లం)లో మార్చి/ఏప్రిల్‌ చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీకు తెలుసా?

యేసు ఓలీవల కొండ నుండి పరలోకానికి ఆరోహణమయ్యాడు.​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠9, 12.

యేసు నమ్మకమైన అపొస్తలులు మాత్రమే ఆయన ఆరోహణమవడాన్ని చూశారు.​—⁠అపొస్తలుల కార్యములు 1:​2, 11-13.