కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రష్యన్‌ సంగీతంలో దేవుని పేరు

రష్యన్‌ సంగీతంలో దేవుని పేరు

రష్యన్‌ సంగీతంలో దేవుని పేరు

ప్రముఖ రష్యన్‌ సంగీత రచయితయైన మోడెస్ట్‌ ముస్సోర్గ్‌స్కి 1877లో బైబిలు ప్రాంతాలలో జరిగినవాటి ఆధారంగా ఒక సంగీత రచనను ప్రచురించాడు. ఆయన తన స్నేహితుడికిలా రాశాడు: “నేను జీసస్‌ నావినస్‌ [యెహోషువ] గురించిన ఒక బైబిలు సన్నివేశాన్ని పూర్తిగా బైబిలు ఆధారంగా, నావినస్‌ విజయం సాధిస్తూ కనాను గుండా వెళ్లిన మార్గాలను అనుసరిస్తూ రాశాను.” ముస్సోర్గ్‌స్కి, “సన్హెరీబు నాశనం” వంటి ఇతర సంగీత రచనలలో బైబిలు అంశాలను, పాత్రధారులను కూడా ఉపయోగించుకున్నాడు.

ముస్సోర్గ్‌స్కి, “జీసస్‌ నావినస్‌”లోనే కాక “ద డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ సెన్నాచెరిబ్‌” అనే తన పుస్తకపు 1874వ ఎడిషన్‌లోనూ, దైవిక నామానికి రష్యన్‌ ఉచ్ఛారణను ఉపయోగిస్తూ దేవుణ్ణి గురించి ప్రస్తావించాడు, దేవుని పేరు హెబ్రీ లేఖనాల్లో יהוה (YHWH) అనే నాలుగు అక్షరాలను ఉపయోగించి వ్రాయబడింది, ఆ పేరు బైబిల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది.

బైబిల్లో పేర్కొనబడిన యెహోవా అనే పేరు 20వ శతాబ్దారంభానికి ముందే రష్యాలో బాగా తెలుసని ముస్సోర్గ్‌స్కి రచనలు చూపిస్తున్నాయి. ఇది సముచితమే, ఎందుకంటే స్వయంగా యెహోవాయే మోషేతో ఇలా అన్నాడు: “నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.”—నిర్గమకాండము 3:15.

[32వ పేజీలోని చిత్రం]

1913లో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ కన్సర్వేటరీ, ముస్సోర్గ్‌స్కి సంగీతం ముద్రితరూపంలో ఉంచబడింది ఇక్కడే

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

షీట్‌ మ్యూజిక్‌: The Scientific Music Library of the Saint-Petersburg State Conservatory named after N.A. Rimsky-Korsakov; స్ట్రీట్‌ సీన్‌: National Library of Russia, St. Petersburg