కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

మా పాఠకుల ప్రశ్న

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

మానవులు అనుభవిస్తున్న బాధలకు దేవుడు కారణం కాదు. “సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము” అని బైబిలు చెబుతోంది. (యోబు 34:​10) మరి బాధలన్నిటికీ ప్రధాన కారకుడు ఎవరు?

సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక దేవదూత. యేసు, అతడిని “ఈ లోకాధికారి” అని పిలిచాడు. (యోహాను 14:​30) నిజమే, యెహోవాయే ఈ విశ్వానికి సర్వాధిపతి. ఆయన తన స్థానాన్ని ఎన్నటికీ వదులుకోడు. కానీ సాతాను కొంతకాలంపాటు అధికశాతం మానవులను పరిపాలించేందుకు దేవుడు అనుమతించాడు.​—⁠1 యోహాను 5:⁠19.

ఇప్పటివరకు సాతాను ఎలా పరిపాలించాడు? అతడు మానవులను మొదట కలిసినప్పటి నుండి హంతకుడిగా, మోసగాడిగానే ఉన్నాడు. అతడు తెలివైన పద్ధతులతో మానవ సమాజానికి ఎంతో హాని తలపెడుతున్నాడు. యేసు అతడిని ఈ మాటలతో నిందించాడు: “ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు.” (యోహాను 8:​44) తనను చంపాలని చూస్తున్నవారు మొదటి నరహంతకుడైన ఆ సాతాను పిల్లలే అని కూడా యేసు చెప్పాడు. యథారాజా తథాప్రజా అన్నట్లుగా, వారు అచ్చం అతనిలాగే ప్రవర్తిస్తూ అతని పిల్లలమని నిరూపించుకున్నారు.

ప్రజల హృదయాల్లో సాతాను ఇప్పటికీ అలాంటి క్రూర వైఖరిని నూరిపోస్తూనేవున్నాడు. ఉదాహరణకు, 1900 సంవత్సరం నుండి 1987 వరకు ఉన్న ఆయా ప్రభుత్వాలు, తమ ప్రత్యర్థులను తొలగించే ప్రయత్నంలో, జాతి నిర్మూలనలో, విచక్షణా రహితమైన హింసాత్మక చర్యల్లో 16,91,98,000 మంది ప్రజలను పొట్టనబెట్టుకున్నాయని అమెరికాలోని హవాయ్‌ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్‌ అయిన ఆర్‌. జె. రమల్‌ అంచనా వేశాడు. అంతేకాదు ఆ కాలంలోనే జరిగిన యుద్ధాల్లో కోట్లాదిమంది ఇతరులు కూడా చంపబడ్డారు.

బాధలకు దేవుడు కారణం కాకపోతే, మరి వాటిని ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు? ఎందుకంటే, పూర్వమెప్పుడో లోకంలోని ప్రాణులన్నింటికీ సంబంధించి లేవదీయబడిన నైతిక​పరమైన వివాదాంశాలు ఇంకా పరిష్కరించబడాల్సివుంది. వాటిలో ఒకదాన్ని పరిశీలిద్దాం.

మానవ చరిత్రారంభంలో, ఆదాము హవ్వలు సాతాను చెప్పిన మాట విన్నారు. వారు దేవుని పరిపాలనను తిరస్కరించి, స్వీయపాలనను ఇష్టపడ్డారు. అంటే వారు నిజానికి అపవాది పాలనకు దాసోహం కావాలని కోరుకున్నారని అర్థం.​—⁠ఆదికాండము 3:​1-6; ప్రకటన 12:⁠9.

ఆ వివాదాంశాన్ని నిరూపించేందుకు సరైన రుజువులు సమకూర్చడానికి సమయమివ్వకుండా దానిని పరిష్కరించడం న్యాయం కాదని యెహోవా అనుకున్నాడు. దానివల్ల ఏయే విషయాలు స్పష్టంగా రుజువయ్యాయి? సాతాను చేతుల్లో ఉన్న మానవ పరిపాలన కేవలం బాధలకే దారితీస్తుంది. నిజానికి, దేవుడు అలా సమయమివ్వడం చివరకు మానవులకే ప్రయోజనాలను తీసుకొచ్చింది. ఏ విధంగా? సమకూర్చబడిన ఆ రుజువులను పరిశీలించి, వాటిని నమ్మేవారికి దేవుని పరిపాలన కావాలని కోరుకుంటున్నామని చూపించే అవకాశం దొరుకుతుంది. దేవుడేమి కోరుతున్నాడో నేర్చుకుని, దానిప్రకారం జీవించేవారికి నిరంతరం జీవించే భావి నిరీక్షణ ఉంటుంది.​—⁠యోహాను 17:⁠3; 1 యోహాను 2:⁠17.

ఇప్పుడైతే ఈ లోకమంతా సాతాను చేతుల్లో ఉందన్న విషయం నిజమే. కానీ అలా కొంతకాలం వరకే ఉంటుంది. త్వరలోనే యెహోవా తన కుమారుని ద్వారా ‘అపవాది యొక్క క్రియలను లయపరుస్తాడు.’ (1 యోహాను 3:⁠8) దేవుని నిర్దేశంలో యేసు, ప్రజల మానసిక వేదనను తీసేస్తాడు, అంతేకాదు ప్రజల జీవితాల్లో అలుముకున్న విషాదభరితమైన పరిస్థితులను కూడా మార్చేస్తాడు. ఇంకా ఆయన గతంలో బాధ అనుభవించి చనిపోయిన కోట్లాదిమందిని పునరుత్థానం చేస్తాడు అంటే ఈ భూమిపై వారిని తిరిగి బ్రతికిస్తాడు.​—⁠యోహాను 11:⁠25.

యేసును పునరుత్థానం చేయడం, అపవాది క్రియలపై దేవుడు విజయం సాధించాడు అనడానికి ఒక నిదర్శనం. అది దేవుని పరిపాలన కావాలనుకునే మానవుల కోసం ఏమి వేచి ఉందో చూపించే ఒక ఉదాహరణ కూడా. (అపొస్తలుల కార్యములు 17:​31) ఊరటనిచ్చే ఈ మాటలతో బైబిలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తోంది: “దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి​వేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—⁠ప్రకటన 21:​3, 4. (w 08 2/1)